E-Paper
Advertisement

పిల్లలు నీళ్లు తాగట్లేదా? అయితే మీరు డేంజర్‌లో పడ్డట్టే! సమ్మర్‌లో పిల్లల కోసం స్పెషల్ గైడ్!

పిల్లలు నీళ్లు తాగట్లేదా? అయితే మీరు డేంజర్‌లో పడ్డట్టే! సమ్మర్‌లో పిల్లల కోసం స్పెషల్ గైడ్!
Advertisement

Kids Hydration :మంచి నీళ్ళు ..పేరులోనే ఉంది మంచి. అలా అని అతిగా తాగితే అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా చిన్న పిల్లలు. మరి ఎంత మోతాదులో తీసుకుంటే మంచిది. ఒకసారి డీటైల్డ్ గా చూసేద్దాం.

నిజానికి ఒకే వయసు ఉన్నవాళ్ళంతా ఒకేలా నీళ్ళు తాగాలని ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకో తెలుసా… ఒక్కొకరి బాడీ మెటబాలిజం ఒక్కోలా ఉంటుంది కాబట్టి. బాడీకి ఎంత నీరు కావాలనేది వాళ్ళ వయసు, ఆడే ఆటలు, బయట ఉన్న ఎండలు, పట్టే చెమట మరియు వారి హెల్త్ స్టేటస్  బట్టి మారిపోతుంది.

Advertisement

ఒక జనరల్ లెక్క ప్రకారం చూస్తే

సో ..అందరి లైఫ్ స్టైల్ ఒకేలా ఉండదు కాబట్టి, అందరికీ ఒకే కొలత సెట్ కాదన్న మాట. కానీ ఒక జనరల్ లెక్క ప్రకారం చూస్తే.. ఒకటి నుంచి నాలుగేళ్ల లోపు పిల్లలు రోజుకు కనీసం 1 లీటరు, అయిదు నుంచి తొమ్మిదేళ్ల పిల్లలు 1.5 లీటర్లు, ఇక తొమ్మిది నుంచి పద్నాలుగేళ్ల లోపు వారు పక్కాగా 2 లీటర్ల నీళ్లు తాగాలన్నది ఒక లెక్క. ముఖ్యంగా ఈ సమ్మర్లో ఎండలు మండిపోతున్నాయి కాబట్టి, ఆటలు ఆడేటప్పుడు దాహం వేస్తే అంతకంటే ఎక్కువే తాగాల్సి ఉంటుందన్నది మర్చిపోకూడదు.

Advertisement

అసలైన చిక్కు ఏంటో తెలుసా.

అయితే ఇక్కడ పేరెంట్స్ కి వచ్చే అసలైన చిక్కు ఏంటో తెలుసా. కొంతమంది పిల్లలు నీళ్లు తాగమంటే అస్సలు వినరు. అలాంటి వాళ్ళ కోసం తల్లిదండ్రులు మార్కెట్లో దొరికే కలర్ కలర్ కూల్ డ్రింక్స్ , ప్యాక్డ్ జ్యూస్‌లు కొనిస్తున్నారు. కాని అవి 100 శాతం ఫ్రూట్ జ్యూస్ అని కంపెనీలే చెప్పవు. ఎందుకంటే అందులో ఉండేవి మాత్రం నాన్ షుగర్ స్వీట్‌నెస్, యాడెడ్ షుగర్స్, డేంజర్ కలర్స్ అని వారికి కూడా తెలుసు కాబట్టి. ఇక అవి నిలువ ఉండాలంటే ప్రిజర్వేటివ్స్ కలపక తప్పని పరిస్థితి.

వీటి వల్ల పిల్లలకు లేనిపోని హెల్త్ ఇష్యూస్ రావడమే కాకుండా, చిన్న వయసులోనే పళ్ళ సమస్యలు, ఒబెసిటీ (అతి బరువు) రావడం పక్కా.

also read :పెరుగు vs మజ్జిగ! ఎండల్లో ఏది బెస్ట్? ఈ నిజాలు తెలిస్తే అస్సలు వదలరు!

పండ్లతో జ్యూస్ తయారు చేసి ఇస్తే

అందుకే వాటిని ఇకనైనా దూరం పెట్టేసి నీళ్ళు ఎక్కువగా తాగని వారికి ఇంట్లోనే ఫ్రెష్‌గా పండ్లతో జ్యూస్ తయారు చేసి ఇస్తే, పిల్లలు ఇష్టంగా లొట్టలు వేసుకుంటూ తాగడం ఖాయం, ఇక దాహం తీరడంతో పాటు పిల్లలకి కావాల్సిన ఎనర్జీ, మినరల్స్ ఇక్కడ బోనస్.

ఇక వయసును బట్టి చూస్తే.. తొమ్మిది నుంచి పదమూడేళ్ల లోపు పిల్లలకు 180 మిల్లీ లీటర్లు, 13 ఏళ్లు పైబడిన వారికి 250 మిల్లీ లీటర్ల హోమ్ మేడ్ జ్యూస్ ఇవ్వడం ఉత్తమం.

అలాగే పుచ్చకాయ, ఖర్బూజ, స్ట్రాబెర్రీ, నారింజ వంటి పండ్లను ముక్కలుగా కోసి ఇస్తే నేరుగా బాడీకి హైడ్రేషన్ అందుతుంది. ఒకవేళ బయట జ్యూస్ కొనాల్సి వచ్చినా రంగులు, కెమికల్స్, షుగర్ లేనివి మాత్రమే ఎంచుకోవడం మేలు. దాహంగా ఉంది కదా అని కార్బొనేటెడ్ డ్రింక్స్ (సోడాలు) జోలికి మాత్రం వెళ్ళకండే. వాటిలో ఉండే షుగర్, కెఫీన్ వల్ల దాహం తీరకపోగా ఇంకా పెరుగుతుంది.

మీరే ఛాన్స్ తీసుకొని

ఇక పిల్లలు ఒక్కసారి గనుక ఆటల్లో పడ్డారా దాహం వేస్తున్నా చెప్పరు, సో ..మీరే ఛాన్స్ తీసుకొని ప్రతి అరగంటకు లేదా గంటకు ఒకసారి నీళ్లు తాగాలని గుర్తు చేస్తే మంచిది.

మరి ఇవన్ని చిట్కాలు పాటించి మీ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు కదూ!

also read :ధనుష్ ‘కర’ టీజర్ టాక్.. ‘నీ పాపం.. నీ పుణ్యం.. నువ్వే నరుక్కోవాలి!’.. ఏప్రిల్ 30న థియేటర్లు షేక్ అవ్వాల్సిందే!

Related News

లెక్కలో యమ ఫాస్ట్.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆర్థిక లావాదేవీల్లో నిపుణులు

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

Big Stories

Advertisement
×