E-Paper
Advertisement

Room Heaters: చలి ఎక్కువైందని రూమ్ హీటర్స్ వాడుతున్నారా? తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన సేఫ్టీ టిప్స్ ఇవే!

Room Heaters: చలి ఎక్కువైందని రూమ్ హీటర్స్ వాడుతున్నారా? తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన సేఫ్టీ టిప్స్ ఇవే!
Advertisement

Room Heaters: చలికాలం వచ్చిందంటే చాలు.. ఇంటిని వెచ్చగా ఉంచేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటాం. దాని కోసం చాలామంది గీజర్‌లు, వాటర్ హీటర్‌లు, రూం హీటర్లపై ఆధారపడుతుంటారు. కానీ వీటిని కేవలం సౌకర్యం కోసమే కాకుండా.. భద్రత పరంగా కూడా చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. గీజర్ లేదా వాటర్ హీటర్ కొనాలంటే ధర ఒక్కటే కాదు.. నమ్మకమైన బ్రాండ్, BEE రేటింగ్, ట్యాంక్ సామర్థ్యం వంటి అంశాలను తప్పకుండా పరిశీలించాలి. లేదంటే చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారి తీయొచ్చు. కాబట్టి కొత్త రూమ్ హీటర్స్ కొనాలనుకుంటున్నా, ఇప్పటికే వాడుతున్నా కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే..

ప్రస్తుతం శీతాకాలంలో చలి నుంచి ఉపశమనం పొందడానికి రూం హీటర్ల వినియోగం బాగా పెరుగుతున్న క్రమంలో.. కొత్తది కొనాలనుకుంటుంటే మాత్రం దాని వైరింగ్‌, ప్లగ్‌, స్విచ్‌లు సరిగ్గా ఉన్నాయో లేదో ముందుగా తనిఖీ చేయడం చాలా అవసరం అంటున్నారు నిపుణులు.

గాలి ప్రసారం తప్పనిసరి:

Advertisement

సాధారణంగా రూం హీటర్ ఆన్ చేసినప్పుడు చాలామంది గదిలోని తలుపులు, కిటికీలు పూర్తిగా మూసేస్తుంటారు. మొదట్లో ఎలాంటి ఇబ్బంది లేకపోయినా.. ఎక్కువసేపు గది మూసి ఉంటే ఆక్సిజన్ సరిపడా అందక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే రాత్రంతా హీటర్‌ను ఆన్ చేసి ఉంచితే.. గదిలో కార్బన్ డయాక్సైడ్ స్థాయి పెరిగి, ఆక్సిజన్ స్థాయి తగ్గుతుంది. ఇది శ్వాసక్రియపై తీవ్ర ప్రభావం చూపవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. కొన్ని సందర్భాల్లో నిద్రలోనే ప్రమాదం జరిగే పరిస్థితి కూడా తలెత్తుతుంది. సరైన అవగాహన లేకపోవడమే ఇలాంటి ఘటనలకు ప్రధాన కారణం.

హీటర్ వాడే సరైన సమయం ఇదే:

గది ఉష్ణోగ్రత బాగా చల్లగా ఉన్నప్పుడు, నిద్రపోయే సమయానికి హీటర్ ఆన్ చేయడం మంచిది కాదు. దాని బదులుగా నిద్రకు గంట ముందే హీటర్‌ను ఆన్ చేసి గదిని కొద్దిగా వెచ్చగా మార్చుకోవడం ఉత్తమం. ఆ తర్వాత నిద్రకు ఉపక్రమించే ముందు హీటర్‌ను ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల ప్రమాదాల అవకాశాలు తగ్గుతాయి.

సరైన ప్రదేశంలో ఉంచాలి:

Advertisement

రూం హీటర్‌ను సమతలంగా ఉండే.. అటూ ఇటూ కదలని ఉపరితలంపై సరైన ఎత్తులో అమర్చాలి. మధ్యలో ఉంచితే వేడి సమానంగా వ్యాప్తి చెందుతుంది. దీంతోపాటు బ్యాలెన్స్ కోల్పోయే అవకాశం ఉండదు. దీనివల్ల ప్రమాదాలు కూడా తగ్గుతాయి.

ఆ ప్రదేశాల్లో వద్దు:

బాత్‌రూం, సింక్ లేదా నీటి దగ్గర రూం హీటర్‌లను అస్సలు ఉంచకూడదు. నీటితో కలిస్తే విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అలాగే మీరు పడుకునే ప్రదేశానికి చాలా దగ్గరగా హీటర్ ఉంచడం వల్ల చర్మంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం కూడా ఉంటుంది.

చిన్నారులకు దూరంగా:

చిన్న పిల్లలు లేదా హీటర్ వినియోగంపై అవగాహన లేని వారు దాని దగ్గరకు వెళ్లకుండా పెద్దలు అప్రమత్తంగా ఉండాలి. ప్రమాదాల గురించి వారికి ముందుగానే చెప్పి, హీటర్‌ను వారికి అందుబాటులో లేకుండా ఉంచడం చాలా అవసరం. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే.. రూం హీటర్‌ను సురక్షితంగా ఉపయోగించుకోవచ్చు. చలి నుంచి రక్షణ పొందడమే కాదు, అనవసర ప్రమాదాలను కూడా దూరం చేసుకోవచ్చు.

Related News

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్నో ప్రయోజనాలు

Big Stories

Advertisement
×