BigTV English

Bed Room Problems: బెడ్రూంలో డీలా పడుతున్నారా? ఈ ఆకుకూరతో రేసు గుర్రంలా రెచ్చిపోవచ్చు తెలుసా?

Bed Room Problems: బెడ్రూంలో డీలా పడుతున్నారా? ఈ ఆకుకూరతో రేసు గుర్రంలా రెచ్చిపోవచ్చు తెలుసా?

Spinach Improve Men Efficiency: ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది జీవితాలు గందరగోళంగా మారిపోతున్నాయి. గంటలు గంటలు కంప్యూటర్ ముందు కూర్చొని రకరకాల ఇబ్బందులకు గురవుతున్నారు. పని ఒత్తిడితో వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతున్నారు. చివరకు శృంగారాన్ని కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నారట. తాజా పరిశోధనలో భారత్ లో పాటు చాలా దేశాల్లో 40 ఏళ్లు దాటిన పురుషులు మంచం మీద కొద్ది సేపటికే చతికిలబడిపోతున్నారని తేలింది. అంతేకాదు, బెడ్ రూమ్ లో రేసు గుర్రంలా పరిగెత్తాలంటే ఓ ఆకుకూరను రోజూ కాస్త తింటే సరిపోతుందంటున్నారు.


పాలకూరతో లైంగిక పటుత్వం

పాలకూరను తరచుగా ఇంట్లో వాడుతూనే ఉంటాం. పాలకూర పప్పు, పాలకూర ఫ్రై, పాలకూర పకోడి లాంటి వంటకాలను చేసుకుంటాం. అయితే, రోజూ పాలకూర తినడం వల్ల ఆ సామర్థ్యం గణనీయంగా పెరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. పాలకూరలో క్లోరిన్, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుషల్కంగా ఉంటాయి. ఇవి లైంగికంగా బలోపేతం చేస్తున్నట్లు తేలింది. పచ్చి పాలకూర జ్యూస్ తాగితే వీర్య సమస్యలు తగ్గడంతో పాటు లైంగిక పటుత్వం పెరుగుతుంది. పాలకూరలోని ఫోలిక్ యాసిడ్ అంగస్తంభన సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జననాంగాలకు రక్త ప్రసరణను పెంచి మరింత ఎనర్జీ ఇస్తుంది.  పాలకూరను వంటకాల్లో వేసుకుని తినడం కంటే ఆకులను జ్యూస్ గా చేసుకుని తాగితే పడక గదిలో రెచ్చిపోవచ్చు అంటున్నారు.


Read Also:గొంతులో నొప్పి.. బొంగురు మాటలు.. స్వరపేటిక క్యాన్సర్ కావచ్చు జాగ్రత్త!

చైనా పరిశోధనలో కీలక విషయాలు వెల్లడి

తాజాగా చైనాలోని  శాంటౌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు అమెరికాలోని 3,184 మంది పురుషులు తీసుకునే ఆహారం ఆధారంగా లైంగిక పని తీరును పరిశీలించారు. వారిలో దాదాపు 27 శాంత మంది పురుషులలో అంగస్తంభన సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. పాలకూర లాంటి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తక్కువగా తినేవారిలో ఈ సమస్య 37 శాతం ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల అంగస్తంభన సమస్య గణనీయంగా తగ్గినట్లు వెల్లడించారు.

40 ఏండ్లు దాటిన వారిలో సమస్య మరింత తీవ్రం

అటు యుకెలో 40 ఏండ్లు పైబడిన పురుషులలో సగం మంది మంచం మీద కష్టపడుతున్నట్లు పరిశోధనలు తెలిపారు.  అధిక బరువు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిలో అంగస్తంభ సమస్య మరింత తీవ్రంగా ఉన్నట్లు గుర్తించారు. అలాంటి వారు పాలకూరను రెగ్యులర్ గా తీసుకుంటే ఆ సమస్యలు తగ్గినట్లు పరిశోధకులు తెలిపారు. పాలకూర తీసుకోవడం వల్ల రక్తహీనత తగ్గడంతో పాటు ఎముకల ఆరోగ్యం పెరుగుతుంది. క్యాన్సర్ కారకాలను అడ్డుకోవడంలోనూ పాలకూర ఉపయోగపడుతుంది. పాలకూర వృద్ధాప్య ఛాయలను తగ్గించి చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. పాలకూరతో పాటు నట్స్, బెర్రీలు, డార్క్ చాక్లెట్లలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకున్నా ఆ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు. సో, మీరూ బెడ్రూంలో రెచ్చిపోవాలంటే రోజూ పాలకూర తినేయండి!

Read Also:రాత్రి నిద్రపోయేముందు మద్యం సేవిస్తున్నారా?.. ఈ సమస్యలు వచ్చే ప్రమాదముంది జాగ్రత్త!

Related News

Poor Kidney Function: కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని తెలిపే.. సంకేతాలు ఇవే !

Type 5 Diabetes: టైప్-5 డయాబెటిస్ బారిన పడుతున్న యువత .. లక్షణాలు ఎలా ఉంటాయంటే ?

Heart Disease: గుండె సంబంధిత సమస్యలకు చెక్ పెట్టే.. 5 సూపర్ ఫుడ్స్ ఇవే !

Ghost In Dreams: నిద్రకు ముందు ఇలాంటి పనులు చేస్తే.. దెయ్యాలు కలలోకి వస్తాయ్, జర భద్రం!

Sleep on Side: గుండె సేఫ్ గా ఉండాలంటే ఏ సైడ్ పడుకోవాలి? డాక్టర్లు ఏం చెప్తున్నారంటే?

Diet tips: రాగి ముద్ద తినడం వల్ల కలిగే ఆరోగ్య రహస్యాలు.. శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు

Shocking Facts: రాత్రి 7 తర్వాత భోజనం చేస్తారా? మీ ఆరోగ్యానికి షాక్ ఇచ్చే నిజాలు!

Heart Problems: రాత్రిపూట తరచూ గురక.. నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన 5 ఆరోగ్య సమస్యలు

Big Stories

×