E-Paper
Advertisement

Thyroid: థైరాయిడ్ రిపోర్ట్ నార్మల్‌గా ఉన్నా నీరసం తగ్గడం లేదా? అసలు గుట్టు ఇదే!

Thyroid: థైరాయిడ్ రిపోర్ట్ నార్మల్‌గా ఉన్నా నీరసం తగ్గడం లేదా? అసలు గుట్టు ఇదే!
Advertisement

Thyroid: చాలామంది మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో థైరాయిడ్ ఒకటి. ఇది కేవలం హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల మాత్రమే వస్తుందని మనం అనుకుంటాం. అందుకే వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడుతుంటాం. అయితే, ట్యాబ్లెట్లు వేసుకుంటున్నా కూడా చాలామందిలో బరువు పెరగడం, విపరీతమైన నీరసం, జుట్టు రాలడం వంటి లక్షణాలు అలానే ఉంటున్నాయి. అసలు మందులు వేసుకున్నా శరీరంలో మార్పులెందుకు రావడం లేదనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. దానికి గల కారణాలేమిటో ఇప్పుడు చూద్దాం.

థైరాయిడ్ అంటే?

మన గొంతు భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథిని శరీరానికి ఇంజిన్ లాంటిదని చెప్పొచ్చు. ఇది విడుదల చేసే T3, T4 హార్మోన్లు మన శరీర జీవక్రియలను నియంత్రిస్తాయి. మనం తిన్న ఆహారం శక్తిగా మారాలన్నా, గుండె కొట్టుకోవాలన్నా ఈ హార్మోన్లు కీలకం. మెదడులోని పిట్యూటరీ గ్రంథి ఆదేశాల మేరకు ఇవి పనిచేస్తాయి. ఒకవేళ ఈ గ్రంథి మందగిస్తే దానిని హైపోథైరాయిడిజం అని, అతిగా పనిచేస్తే హైపర్ థైరాయిడిజం అని అంటారు. కానీ ఇక్కడ హార్మోన్ల స్థాయి కంటే అవి కణాలకు ఎంతవరకు అందుతున్నాయన్నదే ముఖ్యం.

Advertisement

Also Read: పారిజాత పువ్వుల్లో దాగున్న ఆరోగ్యం.. ఒత్తిడి, డయాబెటిస్, కీళ్ల నొప్పులకు చెక్ పెట్టండిలా!

అసలు రహస్యం కణాల్లోనే:

చాలామంది థైరాయిడ్ సమస్యను కేవలం హార్మోన్ల లోపంగానే చూస్తారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది కణ శక్తికి సంబంధించిన సమస్య. మన కణాల్లో ఉండే మైటోకాండ్రియా అనే భాగాలు ఆహారాన్ని శక్తిగా మారుస్తాయి. ఒకవేళ మీ రక్తంలో థైరాయిడ్ హార్మోన్లు సరిగ్గా ఉన్నా, మీ మైటోకాండ్రియా బలహీనంగా ఉంటే ఆ హార్మోన్లు ప్రభావం చూపలేవు. ఫలితంగా మందులు వాడుతున్నా కూడా శరీరం లోపల శక్తి ఉత్పత్తి కాక ఎప్పుడూ అలసటగా, నీరసంగా అనిపిస్తుంది.

ట్యాబ్లెట్లే పరిష్కారం కాదు:

Advertisement

థైరాయిడ్ మందులు వేసుకోవడం ద్వారా బయటి నుంచి హార్మోన్లను అందిస్తున్నాం. అయితే ఆ హార్మోన్లు కణస్థాయిలోకి వెళ్లి పని చేయాలంటే శరీరానికి తగిన పోషకాలు అవసరం. ఐరన్, మెగ్నీషియం, విటమిన్ బి వంటి మూలకాలు లోపించినప్పుడు ట్యాబ్లెట్ల ప్రభావం తగ్గిపోతుంది. అలాగే తీవ్ర ఒత్తిడి, సరైన నిద్ర లేకపోవడం వల్ల శరీరం హార్మోన్లను స్వీకరించే సామర్థ్యాన్ని కోల్పోతుంది. అందుకే థైరాయిడ్ రిపోర్ట్స్ నార్మల్‌గా ఉన్నప్పటికీ.. శారీరక ఇబ్బందులు మాత్రం అలానే ఉంటాయి.

జీవనశైలిలో మార్పులే పరిష్కారం:

థైరాయిడ్‌ను అదుపులోకి తెచ్చుకోవాలంటే.. మందులతో పాటు జీవనశైలిలో మార్పులు తప్పనిసరి. కేవలం ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరంగా ఉండి, ప్రోటీన్ ఎక్కువగా ఉండే సహజ ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మైటోకాండ్రియా పనితీరును మెరుగుపరచవచ్చు. ప్రతిరోజూ కండరాలకు పనిచెప్పే వ్యాయామాలు చేయడం వల్ల కణాలు చురుగ్గా మారుతాయి. ఒత్తిడిని తగ్గించుకుని, పోషకాహారంపై దృష్టి పెట్టినప్పుడు మాత్రమే థైరాయిడ్ మందులు పూర్తిస్థాయిలో పనిచేస్తాయి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని గుర్తించుకోవడమే తొలి అడుగు.

Also Read: గ్లాసు పసుపు నీటితో మీ రోజును స్టార్ట్ చేయండి.. ఎనర్జీతో పాటు మెరిసే చర్మం మీ సొంతం!

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×