E-Paper
Advertisement

Actress Rasi: ప్రాణం పోయినా ప్రభాస్ సినిమాలో ఆ పాత్ర చేయను…రాశి సంచలన వ్యాఖ్యలు!

Actress Rasi: ప్రాణం పోయినా ప్రభాస్ సినిమాలో ఆ పాత్ర చేయను…రాశి సంచలన వ్యాఖ్యలు!
Advertisement

Actress Rasi: సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పలు సినిమాలలో నటిస్తూ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ నటి రాశి (Rasi)ఒకరు. ఒకానొక సమయంలో ఈమె తెలుగు తమిళ భాషలలో స్టార్ హీరోలు అందరి సినిమాలలో నటించి వరుస విజయాలను సొంతం చేసుకున్నారు. ఇక ఇటీవల కాలంలో రాసి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి పలు సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. అదేవిధంగా బుల్లితెర సీరియల్స్ లో కూడా ఈమె నటించిన సంగతి తెలిసిందే. తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంతో బిజీగా ఉన్న రాసి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ప్రభాస్ సినిమాకు రాసి కండిషన్లు..

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాల గురించి కూడా ప్రస్తావనకు తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలోనే పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సినిమాల గురించి ప్రస్తావనకు వచ్చింది. ప్రభాస్ తనుకు చాలా ఇష్టమైన నటుడని రాశి తెలిపారు. అయితే ఇప్పటివరకు ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం తనుకు రాలేదు కనీసం ఒక్క సినిమాలో అయినా ప్రభాస్ తో కలిసి నటించాలని ఉంది అంటూ తన మనసులో కోరికను బయటపెట్టారు. ఇలా ప్రభాస్ సినిమాలో నటించాలని ఉందని చెప్పిన రాశి కండిషన్లు కూడా పెట్టడం గమనార్హం.

ప్రభాస్ తల్లిగా నటించను..

Advertisement

తాను ప్రభాస్ సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్నాను కానీ ఆయనకు తల్లి పాత్రలలో మాత్రం నటించడానికి ఇష్టపడనని అలాంటి పాత్రలు వస్తే సినిమా చేయనని తెలియజేశారు. అలాగే ప్రభాస్ అక్క వదిన పాత్రలలో కూడా నటించనని తెలిపారు.. ప్రభాస్ వయసు నా వయసు దాదాపు ఒకటే ఉంటుంది అలాంటి వ్యక్తికి తాను తల్లిగా అసలు నటించనని, ఈ పాత్రలు కాకుండా ఏదైనా కీలక పాత్రలో చేసే అవకాశం వస్తే కచ్చితంగా ప్రభాస్ సినిమాలో నటిస్తానని రాసి తెలిపారు. తాను ప్రభాస్ సినిమాలను చూడాలి అనుకుంటే కచ్చితంగా థియేటర్ కి వెళ్లి చూస్తానని అలాగే ప్రభాస్ నటించిన మిర్చి సినిమాకు కూడా తాను డబ్బింగ్ చెప్పానని తెలిపారు..

గొప్ప నటుడు అవుతాడని ఊహించాను..

Advertisement

ప్రభాస్ చాలా అద్భుతమైన నటుడు ఆయన నటించడం మొదటి సినిమా ట్రైలర్ చూస్తున్న తర్వాత ఈయన ఎప్పటికైనా గొప్ప నటుడు అవుతారు అనే విషయాన్ని నేను నా తమ్ముడుతో చెప్పానని అప్పటి విషయాలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇలా ప్రభాస్ అంటే ఎంతో ఇష్టమైనప్పటికీ ఇంతవరకు తనని నేరుగా కలిసే అవకాశం మాత్రం రాలేదని రాశి ఈ సందర్భంగా ప్రభాస్ సినిమాల గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.మరి ప్రభాస్ గురించి, ఆయన సినిమాలలో నటించే విషయాల గురించి రాసి తన మనసులో కోరికను బయటపెట్టారు ఇప్పుడైనా ఈమెకు ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం వస్తుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Ram Charan: రామ్ చరణ్ ప్రమాదం పై స్పందించిన టీమ్.. నాలుగు కుట్లు పడ్డాయంటూ!

Related News

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

సాహో ప్రపంచంలోకి ఓజీ..? ఏం ప్లాన్ చేస్తున్నావ్ సుజిత్ ?

మీరే నాకు స్ఫూర్తి… బాబాయ్ కు అబ్బాయ్ విషెస్!

Big Stories

Advertisement
×