E-Paper
Advertisement

Akhanda 2 Censor: అఖండ 2 సెన్సార్ పూర్తి… రన్ టైమ్ ఎంతంటే!

Akhanda 2 Censor: అఖండ 2 సెన్సార్ పూర్తి… రన్ టైమ్ ఎంతంటే!
Advertisement

Akhanda 2censor: బాలకృష్ణ (Balakrishna) హీరోగా బోయపాటి శ్రీను(Boyapati Sreenu) దర్శకత్వంలో నటించిన తాజా చిత్రం అఖండ 2(Akhanda 2). ఈ సినిమా డిసెంబర్ ఐదవ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో ఎంతో ఘనంగా జరుగుతుంది. ఈ సినిమా విడుదలకు కేవలం వారం రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో విడుదలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకున్నారు తాజాగా ఈ సినిమా సెన్సార్ సభ్యులు చూసి అనంతరం సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయడమే కాకుండా ఈ సినిమా రన్ టైం కూడా లాక్ చేశారని తెలుస్తోంది.

2:45 నిమిషాల రన్ టైం..

అఖండ 2 సినిమా చూసిన అనంతరం సెన్సార్ సభ్యులు సినిమా అద్భుతంగా ఉండబోతుందని వారి అభిప్రాయాలను తెలియజేసినట్లు సమాచారం. అలాగే ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికెట్ జారీ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా 2 గంటల45 నిమిషాల నిడివితో రన్ టైమ్ లాక్ చేసినట్టు తెలుస్తుంది. ఇలా ఈ సినిమా ఫర్ఫెక్ట్ రన్ టైంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తుంది. ఇక బోయపాటి బాలయ్య కాంబినేషన్ అంటేనే సూపర్ హిట్ కాంబినేషన్ అని చెప్పాలి. ఈ సినిమా విడుదలకు ముందే భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.

సనాతన ధర్మ పరిరక్షణ నేపథ్యం..

Advertisement

ఇదివరకు బాలకృష్ణ నటించిన సినిమాలన్నీ కేవలం తెలుగు ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం అయ్యేది కానీ మొదటిసారి అఖండ 2 పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా సనాతన ధర్మ పరిరక్షణ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటించబోతున్నారు. ఒక పాత్రలో సనాతన ధర్మ పరిరక్షకుడిగాను మరో పాత్రలో ఎమ్మెల్యేగా కూడా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ చూస్తుంటే బాలయ్య కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్లను రాబట్టే సినిమాగా అఖండ 2 నిలుస్తుందని చిత్ర బృందం, అభిమానులు కూడా భావిస్తున్నారు.

బాలకృష్ణకు జోడిగా సంయుక్త మీనన్..

Advertisement

ఇక ఈ సినిమాను 14 రీల్స్ బ్యానర్ పై గోపి అచంట, రామ్ అచంట నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణకు జోడిగా నటి సంయుక్త మీనన్ నటిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీత సంగీతం అందించనున్నారు. బాలయ్య యాక్షన్ ఎలివేషన్స్ కు తమన్ బ్యాక్గ్రౌండ్ సోర్స్ కచ్చితంగా థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తుందని చెప్పాలి. ఇప్పటివరకు విడుదల చేసిన అప్డేట్స్ మాత్రం సినిమా పట్ల భారీగా అంచనాలను పెంచేసాయి. మరి బాక్స్ ఆఫీస్ వద్ద అఖండ 2 ఎలాంటి సంచలనాలను సృష్టించబోతుందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా డిసెంబర్ ఐదవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో నాలుగవ తేదీనే ప్రీమియర్లు ప్రసారం కానున్న సంగతి తెలిసిందే.

Also Read; MSVPG: భారీ ధరకు’మన శంకర ప్రసాద్ గారు’ నాన్ థియేట్రికల్ రైట్స్..పెట్టుబడి వచ్చేసిందిగా?

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×