E-Paper
Advertisement

అఖిల్ ‘లెనిన్’ మళ్లీ వాయిదా.. న్యూ రిలీజ్ డేట్ ఇదే!

అఖిల్ ‘లెనిన్’ మళ్లీ వాయిదా.. న్యూ రిలీజ్ డేట్ ఇదే!
Advertisement

Lenin Movie: అఖిల్ అక్కినేని (Akhil Akkineni) హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ ‘లెనిన్’ (Lenin Movie) మరోసారి వాయిదా పడింది. ఈ సినిమాను మరోసారి వాయిదా వేస్తున్నట్లుగా మేకర్స్ అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ఈసారి వాయిదాకు కారణం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ‘పెద్ది’ (Peddi Movie) చిత్రమే కారణమని ఈ ప్రకటనలో తెలిపారు. మనం ఎంట‌ర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై ముర‌ళి కిషోర్ అబ్బూరు ద‌ర్శ‌క‌త్వంలో అక్కినేని నాగార్జున‌, సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తోన్న చిత్రం ‘లెనిన్’. ఈ సినిమా మే 1న విడుదల కావాల్సి ఉండగా, ఏప్రిల్ 30న ‘పెద్ది’ సినిమా వస్తుండటంతో.. రామ్ చరణ్, అఖిల్ మధ్య ఉన్న బాండింగ్ కారణంగా, ఆ సినిమాకు గౌరవమిస్తూ.. సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. మేకర్స్ విడుదల చేసిన ప్రకటనలో..

Also Read- శివయ్య ఆశీస్సులతో కొడుకుకు పేరు పెట్టిన ఆది సాయికుమార్..ఎంత క్యూట్ గా ఉందో!

‘లెనిన్’ విడుదల వాయిదా..

Advertisement

‘‘మే 1వ తేదీన విడుదల కావాల్సిన ‘లెనిన్’ చిత్రాన్ని వాయిదా వేస్తున్నాము. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ ఏప్రిల్ 30న వస్తున్న నేపథ్యంలో, సినిమాలను ఒక సానుకూల, ఆరోగ్యకరమైన వాతావరణంలో అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి ఇదే సరైన సమయమని మేము నమ్ముతున్నాము. మా హీరో అఖిల్‌తో రామ్ చరణ్‌కు ఉన్న అనుబంధంతో పాటు, ఆయన ఎప్పుడూ ఒక శ్రేయోభిలాషిగా ఉన్నారనే విషయం తెలియంది కాదు. అందుకే ఆయనకు గౌరవమిస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ‘లెనిన్’ చిత్రం 26 జూన్ 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రం ఎప్పుడు వచ్చినా.. ఎమోషన్‌తో నిండిన ఒక సంపూర్ణ సినిమా పండుగలా ఉంటుందని, మా టీమ్ మొత్తం బెస్ట్ అవుట్ ఫుట్ ఇచ్చేందుకు కృషి చేస్తామని హామీ ఇస్తున్నాము. వెండితెరపై అద్భుతమైన అనుభూతిని ఇచ్చేలా, ఈ సినిమాను రూపొందిస్తున్నాం. మీ ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు’’ అని లెనిన్ టీమ్ ఈ ప్రకటనలో తెలిపింది.

Also Read- పెళ్లి అయినవారు, కానివారు.. ఇలా ఎందరో నాపై మనసు పడ్డారు! -జయమాలిని

ఈసారి నో డౌట్..

Advertisement

ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్, భారీగా అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. ఇటీవల వదిలిన ‘వారెవా వారెవా’ సాంగ్ కూడా మ్యూజిక్ లవర్స్ ‌నుంచి మంచి స్పందనను రాబట్టుకుంది. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అఖిల్ అక్కినేని సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో శివాజీ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ సినిమా, ఈసారి మాత్రం కచ్చితంగా చెప్పిన డేట్‌కి వస్తుందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. చూద్దాం మరి.. ఈ సినిమాతో అయినా అఖిల్‌కు అనుకుంటున్న హిట్ వస్తుందేమో..

Also Read- అమ్మాయిల డ్రస్సులపై దివి బోల్డ్ రియాక్షన్.. నో కామెంట్స్..జస్ట్ ఎంజాయ్!

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×