E-Paper
Advertisement

Allu Arjun -Sneha Reddy: అల్లు అర్జున్ స్నేహ రెడ్డి 15 వెడ్డింగ్ యానివర్సరీ.. కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన బన్నీ!

Allu Arjun -Sneha Reddy: అల్లు అర్జున్ స్నేహ రెడ్డి 15 వెడ్డింగ్ యానివర్సరీ.. కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన బన్నీ!
Advertisement

Allu Arjun -Sneha Reddy: టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుస సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్న అల్లు అర్జున్ ప్రస్తుతం తన తమ్ముడు అల్లు శిరీష్(Allu Sirish) పెళ్లి వేడుకల కోసం కొద్ది రోజులపాటు ఈయన తన సినిమా షూటింగులకు చిన్న విరామం ప్రకటించారు. అల్లు శిరీష్ నైనిక రెడ్డి మార్చి ఆరవ తేదీ ఎంత ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇక అదే రోజు అల్లు అర్జున్ స్నేహ రెడ్డి పెళ్లిరోజు కావటం విశేషం. సరిగా అల్లు అర్జున్ స్నేహల వివాహం జరిగి 15 సంవత్సరాలు కావడంతో ఈ పెళ్లి రోజు వేడుకను ఎంత స్పెషల్ గా జరుపుకున్నారు.

ఖరీదైన కారును కొన్న అల్లు అర్జున్ స్నేహ రెడ్డి..

ఇక అల్లు శిరీష్ పెళ్లి వేడుకలలో భాగంగా అల్లు అర్జున్, స్నేహ రెడ్డి(Sneha Reddy) కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇక ఈ పెళ్లికి సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు స్నేహ రెడ్డి తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక 15వ పెళ్లిరోజు సందర్భంగా అల్లు అర్జున్ స్నేహ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్టులు షేర్ చేశారు. అయితే ఈ పెళ్లి రోజు సందర్భంగా అల్లు అర్జున్ స్నేహ రెడ్డికి ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారని తెలుస్తుంది. ఖరీదైన మంచి బ్రాండ్ కి సంబంధించిన కొత్త కారును అల్లు అర్జున్ తెప్పించినట్టు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి.

15వ పెళ్లిరోజు సందర్భంగా..

Advertisement

ఈ వీడియోలో భాగంగా ఖరీదైన లగ్జరీ కారు అల్లు అర్జున్ ఇంటి వద్దకు తీసుకువచ్చిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవ్వడంతో బహుశా తన 15వ పెళ్లిరోజు సందర్భంగా అల్లు అర్జున్ స్నేహ రెడ్డికి ఈ కానుకను ఇచ్చారంటూ సోషల్ మీడియాలో ఈ వీడియోలను వైరల్ చేస్తున్నారు. ఇక ఈ కారు ఏ బ్రాండ్ కు సంబంధించింది? దీని ఖరీదు ఎంత? ఈ కారు ప్రత్యేకతలు ఏంటనే విషయంపై అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు అల్లు శిరీష్ పెళ్లి వేడుకలలో ఎంతో బిజీగా ఉన్నారు.

?igsh=aGo1c2J1dGlxZ2pw

Advertisement

అల్లు అర్జున్ కెరియర్ విషయానికి వస్తే పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న బన్నీ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దాదాపు 70% షూటింగ్ పనులు పూర్తి అయ్యాయని తెలుస్తోంది. భారీ బడ్జెట్ సినిమాగా హై విజువల్ వండర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని మరొక కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే.

Also Read: Jr.NTR -Prashanth Neel::ఎన్టీఆర్ నీల్ సినిమాలో సీనియర్ నటి.. చిరకాల కోరిక నెరవేరుతోందా?

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×