E-Paper
Advertisement

Amardeep: మరీ ఇలా అయితే ఎలా గురూ.. ఎవరికి తెలియని నిజాలు బయటపెట్టిన అమర్దీప్ తల్లి!

Amardeep: మరీ ఇలా అయితే ఎలా గురూ.. ఎవరికి తెలియని నిజాలు బయటపెట్టిన అమర్దీప్ తల్లి!

Amardeep:ఒకప్పుడు సిరిసిరి మువ్వలు, జానకి కలగనలేదు అంటూ పలు చిత్రాలలో నటించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న అనంతపురం వాసి అమర్దీప్ చౌదరి (Amardeep Chowdary) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా సీరియల్స్ లో కంటే కూడా బిగ్ బాస్ సీజన్ 7(Bigg Boss 7).లోకి అడుగుపెట్టి కప్పు కొట్టాలి అనే కసితో ఆయన ఆడిన తీరు… ఇచ్చిన పర్ఫామెన్స్ అందరి దృష్టిని ఆకట్టుకుంది. అంతేకాదు అమర్దీప్ కి ఊహించని పాపులారిటీని అందించింది అని చెప్పవచ్చు. ఇకపోతే అమర్దీప్ చూడడానికి బయటకి అమాయకంగా కనిపించినా.. అమ్మాయిల ఫ్యాన్ లోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆయనకు ఎంతోమంది అమ్మాయిలు లెటర్స్ కూడా పంపించారట. అయితే ఈ విషయాలన్నింటినీ కూడా ఆయన తల్లి రూప ఒక ఇంటర్వ్యూలో పాల్గొని బయటపెట్టారు. ముఖ్యంగా అమర్దీప్ గురించి తెలియని ఎన్నో నిజాలను ఆమె బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచారు.

అమర్దీప్ లో ఉండే నెగటివ్ పాయింట్స్ అవే..

విషయంలోకి వెళ్తే.. అమర్దీప్ చౌదరి, శైలీ చౌదరి కలయికలో వచ్చిన చిత్రం ‘సుమతీ శతకం’. ఫిబ్రవరి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే ఈయనకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే గతంలో అమర్దీప్ చౌదరి తల్లి రూపా చేసిన కామెంట్లు మరొకసారి వైరల్ గా మారుతున్నాయి. అమర్దీప్ గురించి రూప మాట్లాడుతూ.. “అమర్దీప్ లో కొన్ని నెగటివ్ పాయింట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఎదుటి వ్యక్తులు ఎలాంటి వారైనా సరే గుడ్డిగా నమ్మేస్తారు. మన తన అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తాడు.

ఆ షో కోసం ఎంతో కష్టపడ్డాడు..

పైగా కష్టపడే వ్యక్తి కూడా. అమర్దీప్ ‘నీతోనే డాన్స్’ షో కోసం మూడు నెలలు కేటాయించారు. ఆ షో కోసం ఎంత కష్టపడ్డాడు అంటే ప్రతిరోజు రాత్రి ఇంటికి వచ్చి కాళ్ల నొప్పులతో ఇబ్బంది పడేవాడు. రోజు గంటన్నర సేపు నేను వాడి కాళ్లు నొక్కితే తప్ప పడుకునేవాడు కాదు. నీతోనే డాన్స్ సమయంలో అమర్ పడ్డ కష్టం వర్ణనాతీతం. ప్రతిరోజూ ఏడ్చేవాడు నొప్పికి తట్టుకోలేక.. ఎన్నో టాబ్లెట్స్ తీసుకున్నాడు. ఆఖరికి ఫిజియోథెరపీ కూడా చేయించుకున్నాడు” అంటూ నీతోనే డాన్స్ షో కోసం అమర్దీప్ పడ్డ కష్టాలను ఆమె బయటపెట్టారు.

ALSO READ:Amardeep Home tour: అమర్దీప్ హోమ్ టూర్.. ఆధ్యాత్మికత ఉట్టిపడుతూ!

ఎన్నో కంప్లైంట్స్ కూడా తెచ్చేవాడు..

ఇక అమర్ కి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. సకల కళా వల్లభుడు అని నాగార్జున కూడా పేరు ఇచ్చాడు. అయితే అమర్దీప్ కి ఇండస్ట్రీలోకి రాకముందే అంటే ఇప్పుడే కాదు కాలేజ్ టైం ఉన్నప్పటి నుంచి డాన్స్ బాగా చేస్తాడు, హ్యాండ్సమ్ గా ఉంటాడనే కారణం తోనే అప్పటినుంచి కూడా అమర్ కి అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అని రూపం చెప్పుకొచ్చారు. అమ్మాయిల.నుంచి ఎన్నో లెటర్స్ వస్తూ ఉంటాయి. పైగా ఎన్నో కంప్లైంట్ లు కూడా వచ్చాయి. ఇక వాటన్నింటిని చూసి చూడనట్టు వదిలేస్తూ ఉంటాను అంటూ కూడా రూపా చెప్పుకొచ్చారు. ఇక మొత్తానికైతే అమర్ కంప్లైంట్స్ ఎక్కువగా తీసుకొచ్చేవాడని తెలియడంతో అది చూసిన అమర్ ఫ్యాన్స్ .. ఇలా అయితే ఎలా గురూ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.. ఒక దీనికి తోడు తరుణ్ లా ఉన్నావని తన చుట్టూ ఉండే స్నేహితులు ప్రోత్సహించడం వల్లే అమర్దీప్ కి నటన పైన ఆసక్తి కలిగింది అంటూ ఆమె తెలిపింది.

Related News

అర్ధరాత్రి ఆ వీడియో డిలీట్ చేయడానికి కారణం అదే….. నిజం చెప్పేసిన బాలీవుడ్ బ్యూటీ!

‘రైరై రారా’ సాంగ్‌కు థియేటర్లోనే పూనకాలు.. ‘పెద్ది’ లేడీ ఫ్యాన్ మాస్ అరాచకం!

సడన్‌గా కాంట్రవర్సీలో ఇరుక్కున్న అనుష్క శర్మ.. ఆ ఒక్క పోస్టే కారణమా?

ఆమిర్ ఖాన్ కెరీర్ బెస్ట్ క్లాసిక్ ‘లగాన్’.. 25 ఏళ్ల వేడుకగా థియేటర్లలోకి రీ రిలీజ్!

‘డాన్ 3’ వివాదం.. రణ్‌వీర్ సింగ్‌పై ఆర్డర్ ఉపసంహరణ.. ఇంకా ముగియని గొడవ!

మెగా పవర్ స్టార్ బాక్సాఫీస్ జాతర.. ఊళ్లో సంబరాలు మామూలుగా లేవుగా..

దీపికా పదుకొణె డిప్రెషన్‌పై ప్రకాష్ పదుకొణె ఎమోషనల్.. ఏం జరిగిందంటే?

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, సీబీఎఫ్‌సీ మాజీ చీఫ్ కన్నుమూత.. ఏం జరిగిందంటే?

Big Stories

×