E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Anchor Suma: యాంకర్ల సిండికేట్ వివాదం.. ఉదయ భాను కామెంట్స్ పై సుమ రియాక్షన్

Anchor Suma: యాంకర్ల సిండికేట్ వివాదం.. ఉదయ భాను కామెంట్స్ పై సుమ రియాక్షన్
Advertisement

Anchor Suma Reacts on Syndicate Controversy: దశాబ్దాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతుంది యాంకర్ సుమ. ఆమె లేకపోతే ఈవెంట్ లేదనేట్టుగా మారింది పరిస్థితి. ఎంతో యాంకర్లు వస్తున్నారు, పోతున్నారు. కానీ, సుమ స్థానం మాత్రం టాప్ లోనే ఉంటుంది. ఎన్ని జనరేషన్స్ మారిన యాంకర్ సుమ ఎప్పుడప్పుడు అప్డేట్ అవుతూ లేటెస్ట్ వెర్షన్ తో ఆడియన్స్ ని ఇండస్ట్రీని ఆకట్టుకునే వస్తుంది. నిజానికి ఎంత స్టార్ డమ్ ఉంటే అంత వివాదాలు, విమర్శలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా ఈ పోటీ ప్రపంచంలో ఎవరోకరు వెలేత్తి చూపిస్తూ విమర్శలు చేస్తుంటారు.

సుమపై ఉదయభాను కామెంట్స్?

Advertisement

కానీ, యాంకర్ సుమ మాత్రం వివాదాలకు, విమర్శలకు దూరంగా ఉంటుంది. అంతగా తన యాంకరింగ్ తో ప్రతి ఒక్కరి మెప్పిస్తు వస్తుంది. దర్శక ధీరుడు రాజమౌళి సైతం సుమ లేకపోతే తన సినిమా ఈవెంట్ వద్దు అంటారు. అలాంటిది సుమను ఉద్దేశిస్తూ గతంలో మరో సీనియర్ యాంకర్ ఉదయభాను చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఒకప్పుడు సుమకు గట్టి పోటీ ఇచ్చిన ఉదయభాను ప్రస్తుతం యాంకరింగ్ దూరమైన సంగతి తెలిసిందే. ఆమె స్టేజ్ పై కనిపించి చాలా కాలం అవుతుంది. చాలా కాలం తర్వాత ‘ఓ భామ అయ్యో రామ’ సినిమా ఈవెంట్‌ని హోస్ట్ చేసింది.

సిండికేట్ వివాదం

ఈ కార్యక్రమంలో యాంకర్ల సిండికేట్‌పై బహిరంగ కామెంట్స్ చేసింది. ఈ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన డైరెక్టర్ విజయ్ కనకమేడల.. చాలా రోజుల తర్వాత ఉదయభాను యాంకర్ గా హోస్ట్ చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. ఆయన కామెంట్స్ కి ఆమె స్పందిస్తూ ఇదొక్కటే చేస్తున్నానని, మళ్లీ కార్యక్రమాలు చేస్తానే లేదో కూడా తేలియదు. చేస్తాననే నమ్మకం కూడా లేదు. ఇప్పుడు ఒక కార్యక్రమం ఉంటుంది.. చేయాలనుకుంటాం.. కానీ ఆరోజు వచ్చేసరికి అది మన చేతుల్లో ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అంతగా పెద్ద సిండికేట్ ఎదిగిందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

Advertisement

అయితే ఇవి యాంకర్ సుమని ఉద్దేశించి చేసిందని అంత అభిప్రాయపడ్డారు. దీనిపై సోషల్ మీడియా పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. తను ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదని తన వ్యాఖ్యలపై ఉదయభాను వివరణ కూడా ఇచ్చింది. తాజాగా ఈ కామెంట్స్ తాజాగా సుమ స్పందించింది. ఇటీవల ఓ పాడ్ కాస్ట్ కి ఇచ్చిన ఇంటర్య్వూలో ఉదయ భాను కామెంట్స్ పై ఆమె అభిప్రాయాన్ని అడిగారు. దీనికి సుమ స్పందిస్తూ.. ఒకప్పుడు హోస్టింగ్ అంటే ఎవరికీ తెలిసేది కాదు.. వాల్యూ కూడా ఉండేది కాదు. కానీ ఇప్పుడు అంత మారింది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి, సక్సెస్ మీట్‌కి ఎవరు హోస్ట్ చేయాలనేది ప్రొడక్షన్ హౌస్, డైరెక్టర్లు డిసైడ్ చేస్తారు. వాళ్లకి కావాల్సిన కంటెంట్‌ని బట్టి సెలెక్ట్ చేసుకుంటారు. ప్రిరిలీజ్ ఈవెంట్‌లు, ఇతర ఫంక్షన్లు అంటే సుమ ఉండాల్సిందే.. అని దర్శక, నిర్మాతలు, హీరోలు నన్ను అభినందిస్తుంటారు. వారి కామెంట్స్ నాకు మంచి బూస్టింగ్ ఇస్తాయి. దానికి కారణం నా స్థిరత్వమే.

నా స్క్రిప్ట్ నేనే రాసుకుంటా

‘యాంకర్ గా నేను ఇన్నేళ్లు జర్నీచేశానంటే దానికి నా స్థిరత్వమే కారణం. ఆడియన్స్‌ని ఎలా ఎంటర్‌టైన్ చేయాలనే ఆలోచిస్తుంటా. అందుకే ఎప్పుడూ నన్ను నేను అప్డేట్ చేసుకుంటూ ఉంటా. నాకు ఏదైనా ఈవెంట్ నా దగ్గరి వచ్చిందంటే ముందు వాళ్లకి ఏం కావాలో అది చేయడంతో పాటు.. నేనేం చేయగలనో అది ఆలోచిస్తా. ఆ ఈవెంట్ గురించి నేనే స్క్రిప్ట్ రాసుకుంటాను. గెస్ట్‌‌లుగా ఎవరొస్తున్నారు? వాళ్ల గురించి ఏం మాట్లాడాలి? ఏ కంటెంట్ వైరల్ అయ్యింది? ఏది మాట్లాడితే బాగుంటుంది? ఏది మాట్లాడ కూడదు. వంటి ప్రతి అంశాన్ని గ్రాంటెడ్ గా తీసుకుని ఆలోచిస్తాను. అయితే ఈవెంట్ ఆర్గనైజ్ చేసే వాళ్ల దగ్గర నుంచి పెద్దగా ఇన్ పుట్స్ ఉండవు. అందుకే ప్రతిదీ నేనే ప్లాన్ చేసుకుంటా’ అని చెప్పింది.

నాకేం తెలియనప్పుడే ఈ ప్రొఫెషన్ నన్ను ఎంచుకుంది. ఆ తరువాత అదే ప్రొఫెషన్‌ని నేను సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. అది నాకు నచ్చింది. అందుకే నేను ఇంకా కంటిన్యూ అవుతున్నాను. చాలామంది కెరీర్ ని ఎంచుకోవడంలో తడబడుతుంటారు. తమకేది కరెక్ట్ ఎటువెళ్లాలో తెలియడం లేదంటారు. నువ్వు ఎంచుకున్నవృత్తిలో నువ్వు సక్సెస్ అయ్యావా? లేదా? అన్నది ఎలా తెలుస్తుందంటే.. ఉదయం నువ్వు లేవగానేఏయ్వాట్ టూ గో’ అనే ఉత్సాహం నీలో ఉంటే సక్సెస్ వచ్చేసినట్టే. నీ పరుగు డబ్బుకోసమో.. ఇంకేదైకోసమో అంటే కష్టం. నీ ప్యాషన్‌ని నువ్వు ఫాలో అయితే.. మనీ నిన్ను ఫాలో అవుతుంది’ అని చెప్పుకొచ్చింది.

Related News

ఇక గ్యాప్ ఇస్తే ఇంటికొచ్చి కొట్టండి.. ఫ్యాన్స్‌కు అఖిల్ షాకింగ్ ఓపెన్ ఆఫర్!

రౌడీ హీరోతో కోల్డ్ వార్.. మూడేళ్ల తర్వాత నోరు విప్పిన అభిషేక్ నామా!

ఎస్పీబీని ఇళయరాజా అంతలా ఎందుకు హర్ట్ చేశారు? నిజాలు బయటపెట్టిన ఎస్పీ చరణ్!

40 ఏళ్ల బంధం, లెక్కలేనన్ని అఫైర్స్.. ఆభయంతోనే సైలెంట్‌గా ఉన్నానన్న గోవిందా భార్య!

Nagabandham Twitter Review : ‘ నాగబంధం ‘ ట్విట్టర్ రివ్యూ.. అడ్వెంచర్ ఎలా ఉందంటే..?

ఆ యాంగిల్లో ఫొటోలా? లైవ్‌లోనే కెమెరామెన్లకు క్లాస్ పీకిన స్టార్ హీరోయిన్!

యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్.. వెండితెరపై హీరోయిన్ ఛాన్స్.. అయినా దానికి నో చెప్పిన నాగదుర్గ!

కన్నడలో మరో సెన్సేషనల్ థ్రిల్లర్.. వైరల్ అవుతున్న ‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’ కౌంట్‌డౌన్ పోస్టర్!

Big Stories

×