E-Paper
Advertisement

Crazy Kalyanam Film: క్రేజీ కళ్యాణం నుండి అనుపమ ఫస్ట్ లుక్.. బర్తడే స్పెషల్ ట్రీట్!

Crazy Kalyanam Film: క్రేజీ కళ్యాణం నుండి అనుపమ ఫస్ట్ లుక్.. బర్తడే స్పెషల్ ట్రీట్!
Advertisement

Crazy Kalyanam Film: మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమె తొలిసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో వచ్చిన ‘అ ఆ’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత ‘శతమానం భవతి’ సినిమాతో మంచి పాపులారిటీ అందుకుంది. అప్పటినుండి వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె.. తాజాగా ‘క్రేజీ కళ్యాణం’ అనే సినిమాలో నటిస్తోంది.

క్రేజీ కళ్యాణం నుండి అనుపమ ఫస్ట్ లుక్..

ఈరోజు అనుపమ పుట్టినరోజు కావడంతో ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ క్రేజీ కల్యాణం నుండి అనుపమ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.. ఇందులో పెళ్లికూతురు గెటప్ లో డాన్స్ చేస్తున్న అనుపమ స్టిల్ ఆకట్టుకుంటోంది. పైగా ఈ సినిమాలో అనుపమ “కీర్తి” అనే పాత్రలో నటిస్తున్నట్లు రివీల్ చేశారు. మొత్తానికైతే క్రేజీ కల్యాణం నుండి ఆమె బర్త్డే స్పెషల్గా విడుదలైన ఈ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

క్రేజీ కళ్యాణం సినిమా విశేషాలు..

Advertisement

క్రేజీ కళ్యాణం సినిమా విషయానికి వస్తే.. అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, నరేష్ వికె , అఖిల్ ఉడ్డేమారి ప్రధాన పాత్రలో భద్రప్ప గాజుల తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్ పై బూసమ్ జగన్మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. పెళ్లిచూపులుగా సాగే ఆసక్తికరమైన కథతో పూర్తిస్థాయి ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, తెలంగాణలోని పలు గ్రామీణ ప్రాంతాలలో సినిమా షూటింగ్ జరుపుతున్నట్లు మేకర్స్ తెలియజేశారు. సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మొత్తానికైతే క్రేజీ కళ్యాణంతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యింది అనుపమ పరమేశ్వరన్.

అనుపమ కెరియర్..

అనుపమ కెరియర్ విషయానికి వస్తే.. ఒకప్పుడు సాంప్రదాయంగా ప్రేక్షకులను తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న అనుపమ.. ఈ మధ్యకాలంలో సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస పెట్టి గ్లామర్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. డ్రాగన్ సినిమాలో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ డోస్ పెంచేసి ముద్దులతో రెచ్చిపోయింది.. ఇక అలాగే పరదా, కిష్కిందపురి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అనుపమ.. చివరిగా బైసన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు క్రేజీ కళ్యాణం అంటూ మరోసారి ప్రేక్షకులను వైవిధ్యమైన కథతో ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యింది. మరి ఈ సినిమా అనుపమాకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

నటన కోసం చదువుకు దూరం..

Advertisement

అనుపమ 1996 ఫిబ్రవరి 18న కేరళలోని త్రిసూర్ జిల్లాలోని ఇరింజలకుడ అనే ఒక మలయాళీ కుటుంబంలో జన్మించింది. ఈమెకు ఒక తమ్ముడు కూడా ఉన్నారు. ఆయన పేరు అక్షయ్. తమ సొంత ఊరిలోనే పాఠశాల విద్యను పూర్తి చేసిన అనుపమ, ఆ తర్వాత సీఎంఎస్ కళాశాల కొట్టాయంలో చదువుకుంది. నటనను కొనసాగించడానికి విద్యను నిలిపేసిన ఈమె.. కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ లో మధ్యలోనే ఆపేసినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో అటు నటన ప్రాధాన్యత ఉన్న చిత్రాలతో పాటు ఇటు గ్లామర్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనుపమ పరమేశ్వరన్.

 

also read: Mammootty: ఆరోగ్య సమస్యలపై తొలిసారి స్పందించిన మెగాస్టార్.. రుచి , వాసన కోల్పోయానంటూ!

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×