E-Paper
Advertisement

Arjun Sarja:  పొలిటికల్ ఎంట్రీ పై అర్జున్ సర్జా కామెంట్స్..జ్ఞానం కూడా కావాలిగా అంటూ!

Arjun Sarja:  పొలిటికల్ ఎంట్రీ పై అర్జున్ సర్జా కామెంట్స్..జ్ఞానం కూడా కావాలిగా అంటూ!
Advertisement

Arjun Sarja: అర్జున్ సర్జా ప్రస్తుతం సీతా పయనం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇదివరకు ఈయన తెలుగు, కన్నడ, తమిళ భాషలలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న అర్జున్ ప్రస్తుతం తెర వెనుక ఉంటూ సినిమాని ముందుకు నడిపిస్తున్నారు. హీరోగా నిర్మాతగా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న ఈయన ప్రస్తుతం దర్శకుడిగా మారారు. ఈయన దర్శకత్వంలో తన కుమార్తె ఐశ్వర్య అర్జున్ (Aishwary Arjun), నిరంజన్ ప్రధాన పాత్రలలో సీతా పయణం (Seetha Payanam)అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఫిబ్రవరి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో తెలుగులో కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు.

రాజకీయాలు అంటే ఆసక్తి లేదు..

ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా అర్జున్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయనకు రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఎంతో మంది సెలబ్రిటీలు రాజకీయాలలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నటుడు అర్జున్ రాజకీయాలలోకి వచ్చే ఆలోచనలో ఉన్నారా అంటూ ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నలకు అర్జున్ సమాధానం చెబుతూ తనకు ఏమాత్రం ఆసక్తి లేదని తెలిపారు.

రాజకీయాలపై జ్ఞానం ఉండాలి..

Advertisement

రాజకీయాలలోకి రావాలి అంటే ఆసక్తి ఉండాలి అలాగే రాజకీయాల గురించి అవగాహన, జ్ఞానం కూడా ఉండాలని తెలిపారు. నాకు రాజకీయాలలోకి వచ్చే ఆసక్తి ఏమాత్రం లేదు అలాగే రాజకీయాల పరంగా సరైన జ్ఞానం కూడా లేదని అందుకే తాను రాజకీయాలలోకి రావాలనుకోలేదు అంటూ ఈ సందర్భంగా అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈయన వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే రాజకీయాలలోకి వచ్చే ఆలోచనలో ఏమాత్రం లేరని స్పష్టమవుతుంది. రాజకీయాలకు దూరంగా కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కొనసాగుతూ ఈయన ఎంతో బిజీగా ఉన్నారు.

విశ్వక్ సేన్ తో అర్జున్ సినిమా..

Advertisement

ఇక ఐశ్వర్య అర్జున్ ఇదివరకే పలు తమిళ కన్నడ సినిమాలలో హీరోయిన్ గా నటించారు. ప్రస్తుతం సీతా పయనం సినిమా ద్వారా ఈమె తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో నిరంజన్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే నిజానికి ఈ సినిమాలో హీరో విశ్వక్ సేన్ నటించాల్సి ఉండగా నటుడు అర్జున్ తో విభేదాలు కారణంగా ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఇలా ఇద్దరి మధ్య గతంలో పెద్ద ఎత్తున వివాదం కూడా చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ ఇంటర్వ్యూలో భాగంగా మరోసారి విశ్వక్ తో సినిమా చేసే అవకాశం వస్తే చేస్తారా అంటూ ప్రశ్న ఎదురవడంతో మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవ జరగలేదని కొన్ని కారణాలవల్ల ఆయన సినిమా నుంచి తప్పుకున్నారు తిరిగి ఒక కథకు విశ్వక్ సరిగ్గా సరిపోతారు అనుకుంటే కచ్చితంగా తనతో సినిమా చేస్తాను అంటూ అర్జున్ ఈ సందర్భంగా తెలియజేశారు.

Also Read: V.K Naresh: హాగ్ చేసుకుందామంటే చీరలు కట్టుకొచ్చారు.. హీరోయిన్ల పై నరేష్ బోల్డ్ కామెంట్స్!

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×