E-Paper
Advertisement

పెద్ది కథ విన్నాక తేరుకోలేకపోయాను… అంచనాలు పెంచిన ఆర్ట్ డైరెక్టర్!

పెద్ది కథ విన్నాక తేరుకోలేకపోయాను… అంచనాలు పెంచిన ఆర్ట్ డైరెక్టర్!
Advertisement

Peddi Movie: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం పెద్ది(Peddi). ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ జూన్ 4వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది.. పెద్దగా సమయం లేకపోవడంతో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా(Avinash Kolla) ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన సినిమా గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వటమే కాకుండా సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేస్తున్నాయి.. పెద్ది సినిమా గురించి అవినాష్ మాట్లాడుతూ..

ఇప్పటివరకు ఇలాంటి కథ వినలేదు..

పెద్ది సినిమా కథ విన్న తర్వాత తాను దాదాపు ఒక అరగంట పాటు ఈ సినిమా కథ నుంచి తేరుకొని బయటపడలేకపోయానని తెలిపారు. తన ఇన్ని సంవత్సరాల సినీ కెరియర్లో ఎన్నో సినిమా కథలను విన్నాను కానీ మొదటిసారి పెద్ది సినిమా కథ విన్నప్పుడు తనకు ఇలాంటి అనుభూతి కలిగిందని కాస్త ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమా కథ విన్న తర్వాత తాను ఎట్టి పరిస్థితులలో కూడా పెద్ది సినిమాకు పనిచేసే అవకాశాన్ని వదులుకోకూడదని అప్పుడే గట్టిగా నిర్ణయించుకున్నానని అవినాష్ కొల్లా తెలియజేశారు. పెద్ది సినిమాలో అద్భుతమైన పొటెన్షియల్ దాగి ఉందని ధీమా వ్యక్తం చేశారు.

పెద్దిపై అంచనాలు పెంచిన ఆర్ట్ డైరెక్టర్..

Advertisement

ఇలా పెద్ది సినిమా గురించి ఈయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో అభిమానులు ఊహించుకుంటున్నారు. ఒక సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది అలాంటి వ్యక్తి ఈ సినిమా విషయంలో చాలా ఎక్సైట్ అయ్యారు అంటే ఈ సినిమా ఏ స్థాయిలో ఉంటుందో స్పష్టంగా తెలుస్తుంది. ఈ విధంగా ఆర్ట్ డైరెక్టర్ నుంచి వచ్చినటువంటి ఈ రియాక్షన్ చూస్తుంటే బుచ్చిబాబు వెండితెరపై మ్యాజిక్ చేయబోతున్నారని భావిస్తున్నారు.

జూన్ 3 న ప్రీమియర్లు..

Advertisement

మరి పెద్ది సినిమా ద్వారా రామ్ చరణ్ ఏ విధమైనటువంటి సక్సెస్ అందుకుంటారనేది తెలియాలి అంటే మరి కొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే. ఈ సినిమా మరో 25 రోజులలో విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందం అధికారకంగా ప్రమోషన్లను ప్రారంభించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండటమే కాకుండా సినిమా పట్ల భారీగా అంచనాలను పెంచేశాయి. RRR తర్వాత రామ్ చరణ్ పలు సినిమాలలో నటించిన బాక్సాఫీస్ వద్ద పూర్తిగా నిరాశకు గురిచేసాయి. మెగా అభిమానుల ఆశలన్నీ కూడా పెద్ది సినిమా పైనే ఉన్నాయి. మరి ఈ సినిమాతో రామ్ చరణ్ ఎలాంటి సక్సెస్ అందుకుంటారు, అభిమానులకు ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు అనేది తెలియాలి అంటే జూన్ 4వ తేదీ వరకు ఎదురు చూడాల్సిందే. ఈ సినిమా జూన్ 4న విడుదలవుతుండగా మూడవ తేదీనే ప్రీమియర్లు ప్రసారం కాబోతున్నాయి.

Also Read: ఆ డైరెక్టర్ ను ఇంటికి పిలిపించి మరి తిట్టిన అల్లు అర్జున్… ఇన్నాళ్లకు బయటపెట్టిన డైరెక్టర్?

Related News

ఈ జనరేషన్‌కు మరో బ్రహ్మానందం దొరికేశాడు.. కోనా వెంకట్ కామెంట్స్!

గ్లామర్ మాత్రమే కాదు.. చీరకట్టులోనూ త్రిష అందం అదుర్స్!

రజనీకాంత్‌కు తిరుగులేదుగా.. ‘జైలర్ 2’ కలెక్షన్ల లెక్క ఇదే!

గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకుంటే.. చిరంజీవి సినిమాలో అసలు ట్విస్ట్ ఇదే!

రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో పరిచయాలున్నా.. ఆ పని మాత్రం చేయలేదు!

స్పెషల్ అట్రాక్షన్ గా రణబీర్ వాచ్.. రాముడు, హనుమంతుడితో ప్రత్యేక డిజైన్..

దాసరి సినిమా షూటింగ్‌లో అసలేం జరిగింది? దివ్యవాణి బయటపెట్టిన విషయాలు

రణబాలి విషయంలో నేను చెప్పిందే జరిగింది.. విజయ్ కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×