E-Paper
Advertisement

NBK 111: కాకినాడ షూటింగ్ లో నందమూరి బాలకృష్ణకు గాయాలు.. హెల్త్ కండిషన్ పై డాక్టర్ల క్లారిటీ!

NBK 111: కాకినాడ షూటింగ్ లో నందమూరి బాలకృష్ణకు గాయాలు.. హెల్త్ కండిషన్ పై డాక్టర్ల క్లారిటీ!
Advertisement

Balakrishna Injury: నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులను, సినీ ప్రేమికులను ఒక్కసారిగా షాక్‌కి గురిచేసే వార్త బయటికొచ్చింది. కాకినాడ పోర్ట్ ఏరియాలో శరవేగంగా జరుగుతున్న ఆయన కొత్త సినిమా షూటింగ్ స్పాట్‌లో ఒక అనుకోని ప్రమాదం జరిగింది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘NBK 111’ (వర్కింగ్ టైటిల్) సినిమాకి సంబంధించి ఒక భారీ యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్నారు. ఈ ఫైట్ సీన్‌లో బాలయ్య డూప్ లేకుండా స్వయంగా స్టంట్స్ చేస్తుండగా,ఊహించని విధంగా కాలు జారి మోకాలికి బలంగా దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే అలర్ట్ అయిన యూనిట్ సభ్యులు ఆయనను కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారని సమాచారం.

అక్కడ డాక్టర్లు ఆయనకు ఫస్ట్ ఎయిడ్ చేసి, మోకాలికి అవసరమైన మెరుగైన ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఫ్యాన్స్ కంగారు పడాల్సిన పనిలేదని డాక్టర్లు క్లారిటీ ఇచ్చినప్పటికీ, అభిమానుల్లో మాత్రం  టెన్షన్ కనిపిస్తుంది.ఏజ్ ఎంత ఉన్నా సరే, రిస్కీ స్టంట్స్ దగ్గర డూప్‌ని వాడకుండా రియల్‌గా చేయడం బాలయ్యకి ఉన్న అలవాటన్న సంగతి స్పెషల్ గా చెప్పక్కర్లేదు.

Advertisement

ఇక గతంలో గోపీచంద్ మలినేనితో చేసిన ‘వీరసింహారెడ్డి’ సాలి హిట్ అవడంతో సినిమా పై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. అందుకే ఈ ప్రాజెక్ట్ కోసం ప్రతీ సీన్‌ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్లాన్ చేస్తున్నాడట గోపీచంద్ మలినేని.

ఇప్పటికే బోయపాటి శ్రీనుతో చేసిన ‘అఖండ’2, అనిల్ రావిపూడి ‘భగవంత్ కేసరి’, బాబీ కాంబోలో వచ్చిన ‘డాకు మహారాజ్’ వంటి వరుస హిట్లతో బాక్సాఫీస్ దగ్గర జోరు మీదున్న బాలయ్య మరోసారి ఆ సక్సెస్ స్ట్రీక్ ని కంటిన్యూ చేయాలని ఫిక్స్ అయినట్టే కనిపిస్తున్నాడు.అయితే ఇలాంటి టైమ్‌లో ఫుల్ ఎనర్జీతో పనిచేస్తుంటే ఇలా గాయల పాలవడం నిజంగా బాధాకరం.ఇక ఈ యాక్సిడెంట్ వల్ల  షూటింగ్‌కి కాస్త బ్రేక్ పడిందని తెలుస్తుంది .

Advertisement

ఇక  బాలకృష్ణ కాకినాడ ఆస్పత్రిలోనే ఉన్నారనే న్యూస్ బయటకు రాగానే ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారట.తమ హీరో త్వరగా కోలుకుని, మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టి సక్సెస్ ఫుల్ గా సినిమాని కంప్లీట్  చేయాలని కోరుకుంటున్నారు.ఇక ప్రస్తుతం బాలయ్య ఆరోగ్య పరిస్థితి చూస్తుంటే డాక్టర్ల సలహా ప్రకారం ఆయన కొద్దిరోజులు రెస్ట్ తీసుకున్నాకే మళ్లీ షూటింగ్‌కి వచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా ఆరు పదులు దాటి ఐదేళ్ళు అవుతున్నా ఇంకా ఈ ఏజ్ లో దబిడి దిబిడే అంటూ వరుస సినిమాలని లైనప్ చేస్తున్న బాలయ్య ని మెచ్చుకోకుకుండా ఉండలేము!

Related News

వారి టార్చర్ వల్లే వదిలేసా -ఐశ్వర్య లక్ష్మీ

యష్ ‘టాక్సిక్’ కథ లీక్..ఆ సెంటిమెంట్ వింటే మైండ్ పోవాల్సిందే!

బాలయ్యకు గాయం.. NBK 111 రిలీజ్ డౌటేనా? కొరటాల ప్రాజెక్ట్‌పై పడ్డ ఎఫెక్ట్!

రీతూ వర్మ – వైష్ణవ్ తేజ్ మధ్య బ్రేకప్?

జయకృష్ణ సీక్రెట్ లీక్ చేసిన రషా.. ‘శ్రీనివాస మంగాపురం’ సెట్స్‌లో ఏం జరిగిందంటే?

మరో కొత్త సినిమాతో ‘లెనిన్ ‘డైరెక్టర్.. ఒక హిట్.. క్రేజీ హీరోతో ఛాన్స్!

NBK 111:బాబాయ్ కోసం అబ్బాయ్ ఎమోషనల్ మెసేజ్.. జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నాడంటే?

జాన్ అబ్రహం కొత్త ఇల్లు ఎంతో తెలుసా ..రేటు చూస్తే మతి పోవాల్సిందే !

Big Stories

Advertisement
×