Balayya Carpenter: నందమూరి బాలయ్య బాబు అంటేనే గాడ్ ఆఫ్ మాసెస్. ఆయన హీరోగా యాక్షన్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. అఖండ్ 2 తో మంచి జోష్ మీద ఉన్న బాలయ్య బాబు కొరటాలతో జోడీ అంటే ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అయతే ఈ సినమాకు సంబంధించి ఓ వార్తి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమా టైటిల్ ను ‘కార్పెంటర్’గా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మాస్ సినిమాలకు కేరాఫ్ గా నిలిచిన బాలయ్యకు ఈ టైటిల్ సరిగ్గా సరిపోయిందంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఎప్పటి నుంచో వీరి కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఇప్పడు టైటిల్ కూడా సెట్ అవ్వడంతో మరో హిట్ అంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకు యంగ్ సెన్సేషన్ మ్యూజిక్ దర్శకుడు అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
Read also-Rakul Preet Singh: లేడీ బాస్ గెటప్ లో ఆకట్టుకుంటున్న రకుల్ ప్రీత్ సింగ్!
బాలయ్య బాబు చివరిగా ‘అఖండ 2’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా కమర్షియల్ గా మంచి విజయం అందుకోక పోయినా బాలయ్య బాబు మైలేజ్ ను మరింత పెంచింది. ఇప్పటికే వరుస సినిమాలతో బిజీ బిజీ గా ఉన్న బాలయ్య ఇప్పుడు కొరటాల శివ ను కూడా లైన్ లో పెట్టడంతో ప్రేక్షకులకు వరుస వినోదం అందించనున్నారు. ఇదే ఏడాది బాలయ్య కు నేషనల్ అవార్డు కూడా రావడంతో బాలయ్య బాబు రాబోయే సినిమాలపై మరింత శ్రద్ద పెట్టారు. అటు సీనియర్ దర్శకులకు ఓకే చెప్తూనే ఇటు యంగ్ దర్శకులకు కూడా అవకాశాలు ఇస్తున్నారు.
Read also-యంగ్ నటీమణులపై పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఘాటు వ్యాఖ్యలు.. ఇది వేరే లెవెల్..
ప్రభాస్ తో మిర్చి లాంట్ మాస్ ఎంటర్ టైనర్ ను ప్రేక్షకులకు అందించిన కొరటాల శివ నుంచి సినిమా వస్తుందంటేనే భారీ అంచనాలు ఉంటాయి. ఇటీవల ఎన్టీఆర్ తో తీసిన ‘దేవర’ టాలీవుడ్ రికార్డులను తిరగ రాసింది. మెగాస్టార్ తో తీసిన ఆచార్య అశించిన మేరకు ఆడక పోవడంతో మొత్తం ఎఫర్ట్ ఎన్టీఆర్ దేవర్ మీద పెట్టారు కొరటాల శివ దీంతో ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ప్రస్తుంతం బాలయ్య బాబుతో సినిమాను ప్రకటించారు. అంతే కాకుండా ఈ సినిమాకు ‘కార్పెంటర్’ టైటిల్ కూడా బాలయ్య బాబుకు తగ్గట్టుగా ఉండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఎన్టీఆర్ దేవర సినిమాకు కూడా అనిరుద్ సంగీతం అందించారు. ఈ సినిమా పాటలు ఏ రేంజ్ హిట్ సాధించాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమా పాటలు కూడా అద స్థాయిలో ఉంటాయని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.