E-Paper
Advertisement

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో బాలయ్య సినిమా… ఎవరూ ఊహించిన కాంబో సెట్ అయ్యిందా?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో బాలయ్య సినిమా… ఎవరూ ఊహించిన కాంబో సెట్ అయ్యిందా?
Advertisement

Balakrishna -Shekhar Kammula: నందమూరి నటన సింహం బాలకృష్ణ(Balakrishna) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తే కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. గత ఏడాది అఖండ 2 (Akhanda 2 )సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అనుకున్న స్థాయిలో ఈ సినిమా సక్సెస్ అందుకోలేక పోయింది. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా NBK 111 అని వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ వరుస సినిమాలను లైన్ లో పెట్టారు.. ఈ సినిమా అనంతరం ఈయన కొరటాల శివ(Koratala Siva), విజయ్ కనకమేడల, వివేక్ ఆత్రేయ వంటి దర్శకులతో సినిమా చేయబోతున్న వార్తలు వచ్చాయి.

క్లాస్ డైరెక్టర్ తో మాస్ హీరో..

ఇకపోతే మరో డైరెక్టర్ ను కూడా బాలకృష్ణ లైన్ లో పెట్టారని తెలుస్తుంది. ఎవరు ఊహించిన విధంగా బాలకృష్ణ శేఖర్ కమ్ముల (Shekhar Kammula)డైరెక్షన్ లో సినిమా రాబోతుందని తెలుస్తుంది. బాలకృష్ణ మాస్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తారు శేఖర్ కమ్ముల మాత్రం ఫ్యామిలీ సినిమాలు క్లాసిక్ సినిమాలను చేస్తూ ఉంటారు అలాంటిది వీరిద్దరి కాంబినేషన్లో సినిమా సెట్ అయిందనే విషయం తెలియడంతో అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు.

శేఖర్ కమ్ముల సినిమాకు బాలయ్య గ్రీన్ సిగ్నల్?

Advertisement

శేఖర్ కమ్ముల బాలకృష్ణని దృష్టిలో పెట్టుకొని ఒక అద్భుతమైన స్క్రిప్ట్ సిద్ధం చేశారని తెలుస్తోంది. ఈ స్టోరీ లైన్ విన్నటువంటి బాలకృష్ణ సినిమా చేయటానికి సానుకూలంగానే స్పందించారని సమాచారం. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా దాదాపు సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఈ సినిమా కనుక సెట్ అయితే ఇండస్ట్రీలోనే కాంబో ట్రెండ్ సెట్టర్ గా మారబోతుందని తెలుస్తుంది. మరి బాలకృష్ణ శేఖర్ కమ్ముల కాంబోలో సినిమా రాబోతుంది అంటూ వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.

ఊహించని కాంబో సెట్ అయ్యిందా?

Advertisement

ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్న సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో పాటు ఈయన కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారని ఈ రెండు సినిమాలు సమాంతరంగా షూటింగ్ పనులను జరుపుకుంటాయని తెలుస్తుంది. ఈ సినిమా పూజ కార్యక్రమాలు మే ఒకటో తేదీ జరగనున్నదని, రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి ప్రారంభం కాబోతోంది అంటూ వార్తలు వచ్చాయి కానీ ఇప్పటివరకు ఈ కాంబినేషన్లో సినిమాకు సంబంధించి ఏ విధమైనటువంటి సమాచారం మాత్రం వెలబడలేదు. తాజాగా శేఖర్ కమ్ములతో సినిమా చేయబోతున్నారంటూ కూడా వార్తలు రావడంతో అభిమానులు మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలా మాస్ హీరో క్లాస్ డైరెక్టర్ కాంబినేషన్ లో సినిమా రాబోతుందని తెలియడంతో ఈ కాంబినేషన్లో సినిమా అసలు ఊహించలేదని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Also Read: మైక్రో ఫైనాన్స్ కేసు… మంగ్లీ మెడకు బిగుస్తున్న ఉచ్చు..అరెస్ట్ తప్పదా?

Related News

ఎవరీ సాత్విక.. ఒక్క టీజర్ తోనే ఊహించని క్రేజ్!

కీర్తి సురేష్ పుట్టినరోజు స్పెషల్.. ‘అక్క’ టీజర్ రిలీజ్ !

ఇండస్ట్రీలో విషాదం.. మ్యూజిక్ డైరెక్టర్ ‘దేవా’ కన్నుమూత!

హార్ట్ టచ్ ఫీలింగ్.. ఆకట్టుకుంటున్న దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్!

కావ్య మారన్ తో అనిరుధ్ పెళ్లి ఫిక్స్.. వారికి ప్రత్యేక ఆహ్వానం!

ఈ జనరేషన్‌కు మరో బ్రహ్మానందం దొరికేశాడు.. కోనా వెంకట్ కామెంట్స్!

గ్లామర్ మాత్రమే కాదు.. చీరకట్టులోనూ త్రిష అందం అదుర్స్!

రజనీకాంత్‌కు తిరుగులేదుగా.. ‘జైలర్ 2’ కలెక్షన్ల లెక్క ఇదే!

Big Stories

Advertisement
×