Bollywood: చిత్రసీమలో నెలల వ్యవధిలోనే సినీ సెలబ్రిటీలు వివిధ కారణాల వల్ల తుది శ్వాస విడవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే కరోనా వచ్చినప్పటి నుంచే ఈ పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఎంతోమంది కళాకారులను ఇండస్ట్రీ కోల్పోతోంది. ఇక ఇప్పుడు తాజాగా బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. విలక్షణ నటుడిగా పేరు సొంతం చేసుకున్న బాలీవుడ్ నటుడు భరత్ కపూర్ కన్నుమూశారు.. 80 సంవత్సరాల భరత్ కపూర్ ముంబైలోని ఒక ప్రముఖ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ గుండెపోటుతో సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచినట్లు సమాచారం.. ఇక ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది. విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న భరత్ కపూర్ మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
భరత్ కపూర్ విషయానికి వస్తే 1970వ సంవత్సరంలో తన నటన జీవితాన్ని ప్రారంభించిన ఈయన.. సినిమాలతో పాటు సీరియల్స్ లో కూడా నటించి చెరగని ముద్ర వేసుకున్నారు. భాగ్య విధాత, పరంపర లాంటి సీరియల్స్ లో మెరిసిన భరత్ కపూర్ దేశ్ పరదేశి, బలిదాన్, హిందుస్థాన్ కీ కసమ్, నూరి, సోనీ పే సుహాగా, లవ్ స్టోరీ, రామ్ బలరాం వంటి 80కి పైగా చిత్రాలలో నటించి మెప్పించారు . నటుడు గానే కాకుండా సహాయ నటుడిగా, ప్రతి నాయకుడిగా కూడా గొప్ప గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. వెండితెర పైనే కాకుండా రంగస్థలంపై కూడా అద్భుతమైన నటుడిగా పేరు ఘడించారు.
ఇకపోతే భరత్ కపూర్ సోమవారం మధ్యాహ్నం 3:00 సమయంలో గుండెపోటుకి గురై హాస్పిటల్ లో చికిత్స చెందుతూ మృతి చెందారు. ఇక అదే రోజు అనగా సాయంత్రం 6 గంటలకు సైన్ హాస్పిటల్ సమీపంలోని స్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ అంతిమయాత్రలో దర్శకుడు రమేష్ తల్వార్ , రాకేష్ బేడీ తదితర సినీ నాటక రంగ ప్రముఖులు పాల్గొన్నారు. ఇకపోతే భరత్ కపూర్ మరణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఆయన సన్నిహితుడు, ప్రముఖ నటుడు అవతార్ గిల్ ధ్రువీకరించారు. ఇకపోతే భరత్ కపూర్ మరణంపై అవతార్ గిల్ స్పందిస్తూ..” తమ ఐదు దశాబ్దాల బంధాన్ని గుర్తు చేసుకున్నారు. భరత్ కపూర్ నాకు సోదరుడిలా గురువులా ఉండేవారు. ఆయనను కోల్పోవడం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. ఏప్రిల్ 30న నార్త్ బాంబే అసోసియేషన్ లో శాంతి సభ కార్యక్రమం నిర్వహించనున్నాము” అంటూ తెలిపారు.
ALSO READ:Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?
భరత్ కపూర్ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. భార్య లోప, కుమారులు సాగర్ ,రాహుల్ ఉన్నారు. కుమార్తె కవిత కొన్నేళ్ళ క్రితమే మరణించారు.. ఇక విలక్షణ నటుడిగా భరత్ కపూర్ పోషించిన వైవిధ్యమైన పాత్రలు హిందీ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఇక ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు, విశ్లేషకులు , నెటిజన్స్ కోరుతున్నారు.