E-Paper
Advertisement

Tollywood Actress: ఈ ఫోటోలో అమాయకంగా ఉన్న చిన్నారిని గుర్తు పట్టారా?ఇప్పుడు స్టార్ హీరోయిన్ తెలుసా?

Tollywood Actress: ఈ ఫోటోలో అమాయకంగా ఉన్న చిన్నారిని గుర్తు పట్టారా?ఇప్పుడు స్టార్ హీరోయిన్ తెలుసా?
Advertisement

Tollywood Actress: సాధారణంగా ప్రతి ఒక్కరు వారి చిన్ననాటి ఫోటోలను ఎంతో భద్రంగా ఒక జ్ఞాపకంగా దాచి పెట్టుకుంటాము. అయితే ఇటీవల సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందిన తర్వాత ఎంతమంది సెలబ్రిటీలు కూడా వారి చిన్నప్పటి ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. ఇలా హీరో హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తే అభిమానులకు పండగే అని చెప్పాలి. అభిమానులు ఆ ఫోటోలను మరింత వైరల్ చేస్తూ ఉంటారు. ఒక హీరోయిన్ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలోనే ఆమె అభిమానులు ఈ ఫోటోని షేర్ చేస్తూ ఇక్కడ ఉన్నది ఎవరో గుర్తుపట్టారా అంటూ మరింత వైరల్ చేస్తున్నారు. మరి ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఎవరు? ఏంటి అని విషయానికి వస్తే ..

అనుపమ పరమేశ్వరన్ చిన్ననాటి ఫోటో..

ఈ ఫోటోలో తెలుపు నీలి రంగు డ్రెస్సులో ఒక అబ్బాయి పక్కన నిల్చొని అబ్బాయి భుజం పై చేతులు వేస్తూ ఫోటోలకు చాలా క్యూట్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చిన ఈ చిన్నారి ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్నారు. ఇక ఈమెకు పాన్ ఇండియా స్థాయిలో కూడా ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈమె సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల కాలంలో ఒక హీరోతో రిలేషన్ లో ఉందంటూ ఈమెకు సంబంధించిన వార్తలు కూడా హల్చల్ చేస్తున్నాయి. మరి ఇప్పుడైనా ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. అవునండి మీరు గెస్ చేసిన విధంగానే ఈ ఫోటోలో ఉన్నది నటి అనుపమ పరమేశ్వరన్ .

కార్తికేయ 2 తో పాన్ ఇండియా క్రేజ్..

Advertisement

ప్రేమమ్ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా  ఇండస్ట్రీకి పరిచయమైన అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం మలయాళ ,తెలుగు, తమిళ సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. అలాగే ఈమె నటించిన కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇలా నటిగా ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా అనుపమ బిజీగా ఉన్నారు. ఇకపోతే అనుపమ సోదరుడు పుట్టినరోజు సందర్భంగా చిన్ననాటి ఫోటోలను ఈమె తన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Advertisement

అనుపమ పరమేశ్వరన్  ఇటీవల లాక్ డౌన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పెద్దగా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక అనుపమ ప్రస్తుత తన తదుపరి సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఇటీవల కాలంలో అనుపమ తన సినిమాల కంటే కూడా వ్యక్తిగత విషయాల ద్వారా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈమె ప్రముఖ స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ తో రిలేషన్ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు అనుగుణంగానే వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా ఒకే తరహా ఫోటోలను షేర్ చేయడంతో విరోష్ బాటలోనే ఈ జంట కూడా రిలేషన్షిప్ కొనసాగిస్తున్నారు అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి అయితే ఇప్పటివరకు ఈ వార్తల పై వీరిద్దరూ ఎక్కడ స్పందించలేదు.

Also Read: Pawan Kalyan: ఉస్తాద్ భగత్ కోసం పవన్ రెమ్యూనరేషన్.. క్లారిటీ ఇచ్చిన మైత్రి నవీన్!

Related News

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

Big Stories

Advertisement
×