Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan)ల మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఆశ్చర్యపరిచిన అన్నదమ్ముల అనుబంధం వారిది. ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత అన్నయ్య చిరంజీవి ఇంటికి తమ్ముడు పవన్ కళ్యాణ్ వచ్చి.. కాళ్లకు సాష్టాంగ నమస్కారం చేసిన వీడియో చూసి అందరి కళ్లు చెమర్చాయి. దీనిపై నరేంద్ర మోదీ (Narendra Modi) కూడా వారిద్దరిని అభినందించిన సంఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. మరోసారి అలాంటి ఘటన అని చెప్పలేం కానీ, ఈసారి చిరంజీవి తన తమ్ముడి విషయంలో తన ప్రేమను కనబరిచారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..
Also Read- Teja Sajja: పెళ్లి పై బిగ్ అప్డేట్ ఇచ్చిన తేజ సజ్జ… త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నారా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh). తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందనతో థియేటర్లలో రన్ అవుతోంది. ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా తన తమ్ముడు అండ్ ఫ్యామిలీతో కలిసి వీక్షించారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో చిరంజీవి డ్యాన్స్ చేస్తూ కనిపించారు. తన సీట్లో కూర్చొనే.. సినిమాలో పాటలు వచ్చినప్పుడు ఆటోమ్యాటిగ్గా రిథమింగ్ ఇస్తున్నారు. డ్యాన్స్ అంటే చిరంజీవి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ అందరికీ ఎంతో ఇష్టమైన ‘ఈ మనసై’ పాట సరికొత్తగా తెరపై కనిపిస్తుంది. ఇక డ్యాన్స్ చేయకుండా ఉంటారా?
Also Read- Ramcharan: ఫ్యాన్స్ గెట్ రెడీ… చరణ్ బర్త్ డే..బిగ్ సర్ ప్రైజ్ ప్లాన్ చేసిన మేకర్స్..
అంతేకాదు, ఇందులో చిరంజీవి ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంలోని ‘వాన వాన వెల్లువాయె’ అనే పాట కూడా ఓ సన్నివేశంలో వస్తుంది. ఆ పాట వచ్చినప్పుడు కూడా చిరంజీవి చాలా ఎగ్జయిట్ అవుతూ చూస్తున్నారు. చిరు మూమెంట్స్‌ని క్యాప్చర్ చేస్తూ.. మేకర్స్ ఈ వీడియోను క్రియేట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు మెగా ఫ్యాన్స్‌కు తెగ నచ్చేసింది. అందుకే లైక్స్, షేర్స్‌తో సోషల్ మీడియాను దుమ్మురేపుతోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ వైఫ్ కూడా ఈ పాటలు ప్లే అవుతున్నప్పుడు.. ప్రత్యేకంగా ఆయనతో మాట్లాడుతుండటం చూపించారు. చిరంజీవి వైఫ్ సురేఖ, పవన్ కళ్యాణ్ వైఫ్ అన్నా లెజ్నెవా, దర్శకుడు హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, శ్రీలీల, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి.. వంటి వారంతా ఈ షో చూస్తున్న వారిలో ఉన్నారు. తమ్ముడు సినిమాలోని సాంగ్స్ చూస్తూ తన్మయత్వానికి లోనైన చిరంజీవి.. ఇలా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుండటం మాత్రం.. మరోసారి మెగా ఫ్యాన్స్‌కు మెమరబుల్ మూమెంట్ అని మాత్రం చెప్పుకోవచ్చు. చూద్దాం.. ఈ సినిమాపై చిరంజీవి ఎలా రియాక్ట్ అవుతారో?
Megastar @KChiruTweets Garu watched #UstaadBhagatSingh with his family and thoroughly enjoyed it ❤️
He loved every moment of the film and appreciated the efforts of the entire team ❤🔥
Don't miss his reaction for Vaana Vaana Velluvaaye & EE Manase songs 😍
Watch… pic.twitter.com/GYB0cBOcKn
— Mythri Movie Makers (@MythriOfficial) March 21, 2026
Also Read- Raashi Khanna: ఆ సీన్ సమయంలో గొడవ.. మధ్యలో వెళ్లిపోదామనుకున్నాను.. రాశి ఖన్నా కీలక వ్యాఖ్యలు