E-Paper
Advertisement

MSVPG Audiance talk: చిరు మూవీకి పబ్లిక్ టాక్.. ఫీలింగ్ ఏంటంటే?

MSVPG Audiance talk: చిరు మూవీకి పబ్లిక్ టాక్.. ఫీలింగ్ ఏంటంటే?
Advertisement

MSVPG Audiance talk: ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న చిరంజీవి (Chiranjeevi).. ఆ తర్వాత ‘భోళాశంకర్’ సినిమా చేసి డిజాస్టర్ ను చవిచూశారు. ఆ తర్వాత ‘విశ్వంభర’ సినిమా చేశారు చిరంజీవి. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ వీఎఫ్ఎక్స్ కారణంగా వాయిదా పడుతూనే వస్తోంది. ఈ ఏడాది సమ్మర్ స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో.. మరోవైపు ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చారు చిరంజీవి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా సంక్రాంతి సందర్భంగా నేడు థియేటర్లలోకి వచ్చింది..

వాస్తవానికి నిన్ననే ఈ సినిమాకి ప్రీమియర్ షోలు పడ్డాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాను చూసిన ఆడియన్స్ తమ అభిప్రాయాలను ఏ విధంగా వ్యక్తపరుస్తున్నారు. అసలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాపై ఆడియన్స్ ఫీలింగ్ ఏంటి? అనే విషయం ఇప్పుడు చూద్దాం..

చిరంజీవి మూవీపై పబ్లిక్ టాక్..

Advertisement

థియేటర్ నుంచి ఆడియన్స్ సంతోషంగా బయటకు రావడం చూసి సినిమాపై మరింత పాజిటివిటీ పెరిగిందనే కోణంలో నెటిజన్స్ తమ అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. ఇకపోతే సినిమా చూసిన ఆడియన్స్ కి ఈ సినిమాపై కలిగిన ఫీలింగ్స్ ఏంటి? వారు తమ అభిప్రాయాలను ఏ విధంగా పంచుకుంటున్నారు? అనే విషయానికి వస్తే.. ముఖ్యంగా ఈ సినిమా చాలా బాగుందని, బ్లాక్ బాస్టర్ అని కొంతమంది కామెంట్లు చేస్తుంటే.. మరికొంతమంది “సంక్రాంతికి అసలైన ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ ఇది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో కలిసి వచ్చి చూడాల్సిన సినిమా” అని కామెంట్ చేస్తున్నారు.

అనిల్ రావిపూడిని చూసి నేర్చుకోవాలి..

ఇంకొంతమంది ఈ వయసులో కూడా చిరంజీవి ఆ రేంజ్ లో పర్ఫామెన్స్ ఇచ్చారు అంటే ఆయన ఎనర్జిటిక్ లెవెల్స్ కి ఫిదా అవ్వాల్సిందే. ఈ సినిమాలో వింటేజ్ చిరంజీవిని చూపించారు. అంటూ కామెంట్లు చేస్తున్నారు. చిరంజీవి నటన పైనే కాకుండా డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వ విలువలపై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా మొత్తం హైలెట్. చిరంజీవి ఎప్పుడూ వింటేజ్. ఆయన ఎప్పటికీ మా హృదయాల్లోనే ఉంటారు. సినిమా స్క్రీన్ ప్లే, స్టోరీ , నేరేషన్ ఎలా తీయాలి అనేది మిగతా డైరెక్టర్లు అనిల్ రావిపూడి ని చూసి నేర్చుకోవాలి. బడ్జెట్ ఒకటే కాదు అన్ని రకాలుగా కూడా సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు.

మరో వందేళ్లయినా చిరు ఇలాగే ఉండాలి..

Advertisement

చిరంజీవి మరో వందేళ్లయినా అలాగే ఉండాలి. నయనతార, వెంకటేష్ అందరూ కూడా సినిమాకి మరింత ప్లస్ గా నిలిచారు. చాలా రోజులయింది. ఇలాంటి సినిమా చూసి.. అసలైన సంక్రాంతి పండక్కి మంచి విందు భోజనం లాంటి సినిమా ఇచ్చాడు అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

ఘరానా మొగుడు చిరంజీవి ఈజ్ బ్యాక్..

ఘరానా మొగుడు చిరంజీవిని మళ్ళీ తెరపై చూపించారు. అనిల్ రావిపూడికి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ చెబుతున్నారు.. ఇక మేల్ అభిమానులే కాదు ఫిమేల్ అభిమానులు కూడా ఈ సినిమాపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. పైగా “నో మాస్.. నో క్లాస్.. ఓన్లీ బాస్.. వింటేజ్ చిరంజీవి ఈజ్ బ్యాక్” అంటూ డైలాగ్స్ కూడా విసురుతున్నారు. మొత్తానికైతే ఆడియన్స్ మొత్తం ఫుల్ ఖుషి అవుతున్నారు అని చెప్పాలి. చాలా రోజుల తర్వాత చిరంజీవి ఖాతాలో మరో బలమైన సక్సెస్ పడిందని అభిమానులు తమ అభిప్రాయంగా చెబుతున్నారు

ALSO READ: Anil ravipudi: విజయ్‌తో సినిమా.. భయపడి వదిలేసా – డైరెక్టర్ అనిల్ రావిపూడి!

 

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×