E-Paper
Advertisement

Dhurandhar vs Deepika: ‘ధురంధర్’ వర్సెస్ దీపికా… ఈ జంట మధ్య గ్యాప్ పెరిగిందా?

Dhurandhar vs Deepika: ‘ధురంధర్’ వర్సెస్ దీపికా… ఈ జంట మధ్య గ్యాప్ పెరిగిందా?
Advertisement

Dhurandhar vs Deepika: ప్రస్తుతం సోషల్ మీడియా టైమ్‌లైన్ మొత్తం ఒక్కటే పేరుతో షేక్ అయిపోతోంది.. అదే ‘ధురంధర్ 2’. గతేడాది పార్ట్-1తో రూ. 1300 కోట్ల వసూళ్లు రాబట్టి అందరి మైండ్ బ్లాక్ చేసిన ఈ సినిమా, ఇప్పుడు సీక్వెల్‌తో బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ రికార్డులను సెట్ చేస్తోంది. తొలిరోజే ఏకంగా రూ. 200 కోట్లతో ఇండియన్ సినిమా హిస్టరీలోనే ‘ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్’ ట్యాగ్ వైపు దూసుకుపోతోంది. కానీ, ఇంతటి భారీ సక్సెస్ సెలబ్రేషన్స్ మధ్య ఒక విషయం మాత్రం నెటిజన్లకి ‘సమ్ థింగ్ ఫిషీ’ అనిపిస్తోంది. అదే రణవీర్ సింగ్ బెటర్ హాఫ్, క్వీన్ దీపికా పదుకొణే మెయింటైన్ చేస్తున్న డెడ్లీ సైలెన్స్!

రణవీర్ విశ్వరూపం.. ఆదిత్య ధర్ మ్యాజిక్!

సినిమాలో రణవీర్ విషయానికి వస్తే.. దర్శకుడు ఆదిత్య ధర్ క్రియేట్ చేసిన ‘జస్కీరత్ సింగ్ రంగి’ అలియాస్ ‘హంజా అలీ మజారి’ క్యారెక్టర్‌లో రణవీర్ జీవించేశాడు. ఆ బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్, ఆ ఇంటెన్స్ లుక్స్ చూస్తుంటే “హి అండర్ అండ్‌స్టడ్ ద అసైన్మెంట్” అని చెప్పక తప్పదు.ఇక  టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరకు అందరూ సోషల్ మీడియాలో రణవీర్‌ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు కూడా .

అంతా బాగుంది కానీ.. దీపికా ఎక్కడ?

Advertisement

కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది.. ఇంతమంది విష్ చేస్తున్నా, సొంత భార్య దీపికా నుంచి మాత్రం కనీసం ఒక్క ఇన్స్టా స్టోరీ కూడా లేకపోవడం ఇప్పుడు బాలీవుడ్ లో ‘హాట్ టాపిక్’ అయిపోయింది. దీపికా ఎందుకు స్పందించడం లేదనే దానిపై సోషల్ మీడియాలో రకరకాల థియరీస్ నడుస్తున్నాయి. ‘ధురంధర్’ సినిమాను ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ‘ప్రాపగండా ఫిలిం’ అని పిలుస్తున్నారు. ఇది ఒక పర్టికులర్ పొలిటికల్ పార్టీకి (BJP) సపోర్ట్ చేసేలా ఉందనే విమర్శలు ఉన్నాయి. మనందరికీ తెలిసిందే, దీపికా గతంలో జేఎన్‌యు (JNU) ఇష్యూలో తన స్టాండ్ ఏంటో క్లియర్ గా చెప్పింది. సో, ఈ సినిమా థీమ్ తన పొలిటికల్ ఐడియాలజీకి ఆపోజిట్‌గా ఉండటమే ఈ సైలెన్స్‌కి కారణమా? అనే చర్చ గట్టిగా నడుస్తోంది.

సోషల్ మీడియాలో నెటిజన్ల ఫైర్

మరోవైపు “షీ ఈజ్ టూ బిజీ విత్ హర్ ఓన్ కింగ్డమ్” అని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం పార్ట్-1 కి స్టోరీ లెవల్లో ఇన్వాల్వ్ అయిన దీపికా, పార్ట్-2 విషయంలో ఎందుకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తోందని ఆశ్చర్యపోతున్నారు. నెటిజన్లు ఊరుకుంటారా? “వీరిద్దరి మధ్య అంతా ఓకేనా?” అంటూ అప్పుడే గాసిప్స్ మొదలుపెట్టేశారు. రణవీర్ సక్సెస్‌ని ఎంజాయ్ చేయలేనంతగా వీరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా? అని కౌంటర్ క్వశ్చన్లు వేస్తున్నారు. ట్విట్టర్ (X) లో అయితే మీమ్స్ మామూలుగా లేవు. “అందరూ విష్ చేశారు కానీ దీపికా మాత్రం ఇంకా నిద్రపోతోందా?” అని కొందరు, “షీ డోంట్ కేర్ అబౌట్ ప్రాపగండా” అని ఇంకొందరు కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. ఏదేమైనా, బాక్సాఫీస్ దగ్గర రణవీర్ తడాకా చూపిస్తుంటే, దీపికా మౌనం మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది. ఈ సైలెన్స్ వెనుక ఉన్న అసలు మ్యాటర్ తెలియాలంటే ఇంకొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే!

Advertisement

also read: Ntr vs Krishna: తెలుగు ఇండస్ట్రీ షేక్.. ఎన్టీఆర్ వర్సెస్ కృష్ణ

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×