E-Paper
Advertisement

Dhurandhar 2: మూడవ అతిపెద్ద ఇండియన్ ఫ్రాంచైజీగా ‘ధురంధర్ 2’ రికార్డ్.. ‘పుష్ప 2’ హిస్టరీ..

Dhurandhar 2: మూడవ అతిపెద్ద ఇండియన్ ఫ్రాంచైజీగా ‘ధురంధర్ 2’ రికార్డ్.. ‘పుష్ప 2’ హిస్టరీ..
Advertisement

Dhurandhar 2: రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ధురంధర్ 2: ద రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచే భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ఈ చిత్రం, తాజాగా భారతీయ సినీ చరిత్రలో పలు కీలక మైలురాళ్లను అధిగమించింది. తాజా లెక్కల ప్రకారం, ‘ధురంధర్’ సిరీస్ (మొదటి భాగం మరియు ప్రస్తుత సీక్వెల్) కలిపి మొత్తం రూ. 2,219 కోట్లకు పైగా వసూలు చేసింది. దీనితో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ ఫ్రాంచైజీ (రూ. 2,002 కోట్లు) సాధించిన రికార్డును ఇది దాటేసింది. ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఫ్రాంచైజీల జాబితాలో యశ్ రాజ్ ఫిల్మ్స్ ‘స్పై యూనివర్స్’ (రూ. 3,195 కోట్లు), ఎస్.ఎస్. రాజమౌళి ‘బాహుబలి’ సిరీస్ (రూ. 2,462 కోట్లు) తర్వాత ‘ధురంధర్’ మూడవ స్థానంలో నిలిచింది.

Read also-Nabha Natesh: ఉల్లిపొర లాంటి చీరలో అందాలు ఆరబోస్తున్న నభా నటేష్!

6 రోజుల్లో..

Advertisement

ఈ చిత్రం కేవలం 6 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 919 కోట్లను కొల్లగొట్టింది. ఇందులో భారతదేశం నుంచి నెట్ వసూళ్లు సుమారు రూ. 575.67 కోట్లు కాగా, విదేశీ మార్కెట్లలో రూ. 231.57 కోట్లను రాబట్టింది. ఈ క్రమంలో అమీర్ ఖాన్ ‘సీక్రెట్ సూపర్ స్టార్’, రణబీర్ కపూర్ ‘యానిమల్’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల లైఫ్ టైమ్ కలెక్షన్లను ఇది కేవలం వారం లోపే అధిగమించడం విశేషం. అయితే, అత్యంత వేగంగా రూ. 1000 కోట్ల మార్కును చేరుకున్న భారతీయ చిత్రంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2: ద రూల్’ సృష్టించిన రికార్డు మాత్రం చెక్కుచెదరలేదు. ‘పుష్ప 2’ కేవలం 6 రోజుల్లోనే వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరగా, ‘ధురంధర్ 2’ 6వ రోజు నాటికి రూ. 919 కోట్ల వద్ద నిలిచింది. ఇది 7వ రోజున ఈ అద్భుతమైన మైలురాయిని చేరుకుంటుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.

Read also-RGV AI Video: హాలీవుడ్ స్టార్లతో కలిసి నటించిన రామ్ గోపాల్ వర్మ!.. ఇది వేరే లెవెల్..

Advertisement

వచ్చే వారం రోజుల్లో ఈ చిత్రం బాహుబలి ఫ్రాంచైజీ రికార్డులను కూడా సవాలు చేసే అవకాశం ఉంది. రణవీర్ సింగ్ కెరీర్‌లోనే ఇది అతిపెద్ద విజయంగా నిలవడమే కాకుండా, ఇండియన్ సినిమా స్టామినాను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. బాలీవుడ్ స్పై థ్రిల్లర్‌లకు ఆదరణ పెరుగుతున్న క్రమంలో, ఈ సినిమా సాధిస్తున్న విజయాలు భవిష్యత్తులో మరిన్ని భారీ ప్రాజెక్టులకు బాటలు వేస్తున్నాయి. ధురంధర్ రెండో భాగం భారీ అంచనాలతో విడుదలై అంచనాలకు తగ్గట్లుగా రికార్డులు క్రియేట్ చేస్తుంది. కేవలం ఆరు రోజుల్లోకే ఇలాంటి రికార్డుల క్రియేట్ చేస్తే రానున్న రోజుల్లో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×