E-Paper
Advertisement

Dhurandhar : బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న రణ్‌వీర్ సింగ్ థ్రిల్లర్ మూవీ.. బుక్ మై షోలో నయా రికార్డ్..!

Dhurandhar : బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న రణ్‌వీర్ సింగ్ థ్రిల్లర్ మూవీ.. బుక్ మై షోలో నయా రికార్డ్..!
Advertisement

Dhurandhar : బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన తాజా చిత్రం దురంధర్.. బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య ధార్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. స్పై, యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది.. థియేటర్లోకి రాకముందు నుంచి ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ ఉందన్న విషయం తెలిసిందే. మొదటినుంచి ఏ రెస్పాన్స్ అయితే అందుకుందో అదే విధంగా రిలీజ్ అయ్యాక కూడా పాజిటివ్ టాక్ ని అందుకుంది. అంతేకాదు భారీగా కలెక్షన్లను కూడా కొల్లగొట్టేసింది.. కేవలం ఏడు రోజుల్లోనే 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించి ట్రేడ్ పండితులను ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. దాంతో పాటుగా బుక్ మై షోలో మరో రికార్డ్ ను బ్రేక్ చేసింది.. ఈ చిత్రానికి ఊహించని విధంగా బుకింగ్స్ జరిగినట్లు తెలుస్తుంది. ఆ బుకింగ్స్ వివరాల గురించి ఒకసారి తెలుసుకుందాం..

బుక్ మై షోలో దురంధర్ రికార్డ్..

హీరో రణ్‌వీర్‌ సింగ్, సారా అర్జున్ హీరో, హీరోయిన్లుగా నటించిన మూవీ దురంధర్.. సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, రాకేశ్ బేడీ, సౌమ్య టాండన్, నవీన్ కౌశీక్, మానవ్ గోహిల్, క్రిస్టల్ డిసౌజా తదితరులు కీలకపాత్రలు పోషించారు. జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండేలు సంయుక్తంగా దురంధర్ చిత్రాన్ని నిర్మించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద వరుసగా రికార్డులను బ్రేక్ చేస్తూ వస్తుంది. 280 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ అయ్యింది.. ఈ సినిమా బుక్ మై షో లో మరో రికార్డ్ ను బ్రేక్ చేసింది. మొదటి రోజు నుంచి ఇప్పటివరకు బుకింగ్స్ పెరుగుతూనే వస్తున్నాయి. మొదటి రోజు 376కే, రెండో రోజు 462కే, మూడో రోజు 490కే, నాల్గొవ రోజు కాస్త తగ్గాయి. 378కే, ఐదోవ రోజు 408 కే, ఆరో రోజు 444 కే, ఏడో రోజు 580కే, ఎనిమిదోవ రోజు 837 కే బుకింగ్స్ జరిగినట్లు తెలుస్తుంది… గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డ్ ను బ్రేక్ చెయ్యడం విశేషం..

Advertisement

Also Read : మహా పై పెళ్లి కొడుకు సీరియస్.. ప్రతాప్ ఫుల్ హ్యాపీ.. మాధవ్ పెళ్లి కోసం టెన్షన్..

దురంధర్ కలెక్షన్స్ విషయానికొస్తే..

రణవీర్ సింగ్ దరంధర్ సినిమా రోజురోజుకి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది.. మొదటిరోజు 28 కోట్ల రూపాయలు, రెండో రోజున 32 కోట్ల రూపాయలు, మూడో రోజున 43 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 23.25 కోట్ల రూపాయలు, ఐదో రోజున 27 కోట్ల రూపాయలు, ఆరో రోజున 27 కోట్ల రూపాయలు, ఏడో రోజున 27 కోట్ల రూపాయలు రాబట్టింది. ఎనిమిదోవ రోజు కూడా భారీగానే కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. మొత్తానికి ఎనిమిది రోజులకు కలిపి 300 కోట్లకు పైగా వసూళ్లను అందుకోవడం విశేషం. నిజానికి 168 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే వరల్డ్ వైడ్‌గా 400 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ వర్గాలు వాల్యూ నిర్దేశించాయి. ఈ సినిమా జోరుని చూస్తుంటే 1000 కోట్ల క్లబ్ లోకి చేరే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది.. చివరికి ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో చూడాలి..

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×