E-Paper
Advertisement

Deva katta: పవన్ కళ్యాణ్ తో పొలిటికల్ సినిమా.. స్పందించిన దేవా కట్టా.. స్క్రిప్ట్ పనులు మొదలు?

Deva katta: పవన్ కళ్యాణ్ తో పొలిటికల్ సినిమా.. స్పందించిన దేవా కట్టా.. స్క్రిప్ట్ పనులు మొదలు?
Advertisement

Deva katta: దేవా కట్ట పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా కొనసాగుతున్న ఈయన ఇటీవల పవన్ కళ్యాణ్ తో సినిమా చేయబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ ఇటీవల హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తదుపరి సినిమాల గురించి ఎన్నో రకాల వార్తలు బయటకు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ త్వరలోనే తన కొత్త సినిమాని దేవా కట్ట(Deva Katta) దర్శకత్వంలో చేయబోతున్నారని ఈ సినిమా పొలిటికల్ జానర్ లో ఉండబోతోంది అంటూ వార్తలు బయటకు వచ్చాయి.

పవన్ కళ్యాణ్ తో సినిమా చేయటం డ్రీమ్..

ఈ విధంగా పవన్ కళ్యాణ్ పొలిటికల్ జానెర్ లో నటించబోతున్నారంటూ వస్తున్నటువంటి ఈ వార్తలపై దేవకట్ట స్పందించారు. ఈ సందర్భంగా ఈయన పవన్ కళ్యాణ్ తో సినిమా అంటూ వస్తున్న వార్తల గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయడం తన డ్రీమ్ అని తెలిపారు. అయితే రిపబ్లిక్ సినిమా కథను ముందుగా పవన్ కళ్యాణ్ కోసమే రాసుకున్నానని, కొన్ని కారణాల వల్ల ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారితో చేయలేకపోయానని తెలిపారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో తాను ఎలాంటి సినిమా చేయలేదని తెలిపారు.

రాజకీయాలతో సంబంధం లేకుండా..

Advertisement

ఇక పవన్ కళ్యాణ్ తో ఎప్పటికైనా ఒక సినిమా చేయాలని ఉంది. ఈ నేపథ్యంలోనే పవన్ రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేకుండా ఒక సరి కొత్త స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నానని, సరైన సమయం వచ్చినప్పుడు ఈ క్రేజీ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి అంటూ ఈ సందర్భంగా దేవా కట్ట పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడం గురించి వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ తో సినిమా లేకపోయినా ఏదో ఒక రోజు పవన్ కళ్యాణ్ తో కచ్చితంగా తన సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.

Advertisement

మరోవైపు పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఆయన టీం కూడా స్పందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి సినిమాలకు కమిట్ అవ్వలేదని, సరైన సమయంలో తన సినిమాలు గురించి పవన్ కళ్యాణ్ స్వయంగా స్పందిస్తారు అంటూ తన గురించి వస్తున్నటువంటి వార్తలను ఖండించారు . పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కావడంతో ఈయన పూర్తిగా రాజకీయ వ్యవహారాలలో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ మార్చి 19 న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా విడుదలైనప్పటికీ ప్రేక్షకుల అంచనాలను మాత్రం చేరుకోలేకపోయింది.. ఇక పవన్ కళ్యాణ్ ఓజి 2 సినిమాకు మాత్రమే కమిట్ అయిన సంగతి తెలిసిందే.

Also Read: Anil Ravipudi: అనిల్ రావిపూడి వెంకటేష్ సినిమాకు ముహూర్తం ఫిక్స్… పూర్తి వివరాలివే!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×