E-Paper
Advertisement

Deepika – Ranaveer : కొత్త ఇంట్లోకి బాలీవుడ్ స్టార్ కపుల్.. ఎన్ని కోట్లో తెలుసా..?

Deepika – Ranaveer : కొత్త ఇంట్లోకి బాలీవుడ్ స్టార్ కపుల్.. ఎన్ని కోట్లో తెలుసా..?
Advertisement

Deepika – Ranaveer : బాలీవుడ్ స్టార్ కపుల్స్ లో దీపికా పదుకొనే రణవీర్ సింగ్ ఒకరు.. వీళ్ళ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న ఈ జంట ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ఈమధ్య సోషల్ మీడియాలో కూడా హైపర్ యాక్టివ్ గా ఉంటున్న ఈ జంట తమ సినిమాల గురించి అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు.. ఇదిలా ఉండగా ఈ జంట కొత్తగా ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. అంతే కాదు ఆ ఇంట్లోకి గృహప్రవేశం కూడా చేశారట.. ప్రస్తుతం దీని గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. మరి ఆ ఇంటి ఖరీదు ఎన్ని కోట్లు? ఎక్కడ ఆ ఇల్లు కొన్నారు అన్నది కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

కొత్తింట్లోకి స్టార్ కపుల్ గృహప్రవేశం..

బాలీవుడ్ ఇండస్ట్రీలోని మోస్ట్ వాంటెడ్ కపుల్స్ లలో రణవీర్ సింగ్ – దీపికా పదుకొనే ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన బాంద్రా బ్యాండ్‌స్టాండ్‌లో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు రూ. 119 కోట్ల భారీ ఖరీదుతో కొనుగోలు చేసిన ఈ విలాసవంతమైన మాన్షన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అన్ని కోట్లు పెట్టి కొనడం అనేది మామూలు విషయం కాదు అని ఆ జంట అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతూ వస్తున్నారు.. ఈ జంట ఎప్పుడూ హుందాగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. దానికి తగ్గట్లుగానే తమ అభిరుచిని పెంచుకుంటూ అందరిలో ప్రత్యేకంగా నిలుస్తూ వస్తుంటారు. ప్రస్తుతం ఈ ఇంటి గురించి బాలీవుడ్ మీడియాలో పలు రకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి..

Advertisement

Also Read : మాధవ్ ను మోసం చేసిన గాయత్రి.. తాయారు ప్లాన్ సక్సెస్.. మాధవ్ పరిస్థితి దారుణం..

కొత్తింటి ప్రత్యేకతలు ఏంటంటే..?

బాలీవుడ్ స్టార్ కపుల్ దీపిక పదుకొనే – రణవీర్ సింగ్ కొనుగోలు చేసిన ఆ ఇంటి ప్రత్యేకతల విషయానికొస్తే.. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నివాసమైన `మన్నత్` కు దీపిక కొత్త ఇల్లు చాలా దగ్గరగా ఉంది. ఇకపోతే బాంద్రాలోని`సాగర్ రేష్మ్`. ఇక అపార్ట్‌మెంట్‌లో 16, 17, 18 , 19వ అంతస్తులలో ఇది ఉంటుంది. నిజానికి ముంబై రియల్ ఎస్టేట్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన డీల్స్ లో ఒకటిగా మారడం విశేషం.. సముద్రం అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తాయి.. అతి త్వరలోనే ఈ జంట ఈ ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నారని సమాచారం.. ఇక సినిమాల విషయానికొస్తే.. దీపికా పదుకొనే అల్లు అర్జున్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.. ఇక బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ మాత్రం రీసెంట్గా దురంధర్ 2 మూవీతో ప్రేక్షకుల ను పలకరించాడు. ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేస్తుంది. ప్రస్తుతం మరో రెండు ప్రాజెక్టులలో నటించబోతున్నట్లు సమాచారం.. వీరిద్దరు కూడా బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.

Related News

ఈ జనరేషన్‌కు మరో బ్రహ్మానందం దొరికేశాడు.. కోనా వెంకట్ కామెంట్స్!

గ్లామర్ మాత్రమే కాదు.. చీరకట్టులోనూ త్రిష అందం అదుర్స్!

రజనీకాంత్‌కు తిరుగులేదుగా.. ‘జైలర్ 2’ కలెక్షన్ల లెక్క ఇదే!

గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకుంటే.. చిరంజీవి సినిమాలో అసలు ట్విస్ట్ ఇదే!

రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో పరిచయాలున్నా.. ఆ పని మాత్రం చేయలేదు!

స్పెషల్ అట్రాక్షన్ గా రణబీర్ వాచ్.. రాముడు, హనుమంతుడితో ప్రత్యేక డిజైన్..

దాసరి సినిమా షూటింగ్‌లో అసలేం జరిగింది? దివ్యవాణి బయటపెట్టిన విషయాలు

రణబాలి విషయంలో నేను చెప్పిందే జరిగింది.. విజయ్ కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×