E-Paper
Advertisement

HBD Ram Charan: గ్లోబల్ స్టార్ అయినా రామ్ చరణ్ దేనికి భయపడతారో తెలుసా?

HBD Ram Charan: గ్లోబల్ స్టార్ అయినా రామ్ చరణ్ దేనికి భయపడతారో తెలుసా?
Advertisement

HBD Ram Charan:మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ (Ram Charan) అతి తక్కువ సమయంలోనే మెగా పవర్ స్టార్ గా పేరు దక్కించుకున్నారు. తన అద్భుతమైన నటనతో రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో ఏకంగా గ్లోబల్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్నారు రామ్ చరణ్. ప్రస్తుతం బుచ్చిబాబు సన దర్శకత్వంలో పెద్ది అనే టైటిల్ తో సినిమా చేస్తున్నారు. వాస్తవానికి ఈనెల 27వ తేదీన అనగా నేడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమా… కొన్ని కారణాలవల్ల వాయిదా పడింది. ముఖ్యంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్లో ఉండడం.. అటు కొంత భాగం షూటింగ్ మిగిలిపోవడం.. అలాగే టికెట్ ధరల పెంపు ఇలా పలు కారణాలవల్ల ఈ సినిమా విడుదల ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు ఏప్రిల్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈరోజు రామ్ చరణ్ పుట్టినరోజు.. ఈ సందర్భంగా సినిమా నుండి స్పెషల్ గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

గ్లోబల్ స్టార్ అయినా అదంటే చచ్చేంత భయం..

ఇకపోతే నేడు రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయినప్పటికీ దానికి భయపడతారట. మరి రామ్ చరణ్ దేనికి భయపడతారు అనే విషయం ఇప్పుడు చూద్దాం.. స్కూలింగ్ వరకు ఎన్నో కండిషన్స్ మధ్య పెరిగిన రామ్ చరణ్ కి ఆ తర్వాతే కాస్త ఫ్రీడం దొరికిందట. అయితే అందరి అబ్బాయిల లాగే బైక్స్ మీద తన ఇష్టాన్ని పెంచుకోలేదు. మొదట్లో బైక్ రైడ్ అంటే చాలా భయపడేవారట. బైకు వద్దని.. హార్స్ రైడింగ్ మీద ఇష్టం పెంచుకున్నట్లు సమాచారం. ఇక తర్వాతే బైక్ ను ఫార్మాలిటీ కోసం నేర్చుకున్నారట. చిన్నప్పటి నుంచే పెట్స్ మీద చాలా ఇష్టాన్ని పెంచుకున్నారు రామ్ చరణ్.

చిరుత సమయంలో ఎన్నో ఇబ్బందులు..

Advertisement

ఇకపోతే నటన మీద ఇష్టం లేని రరామ్ చరణ్ తండ్రి కోరిక మేరకు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. అందులో భాగంగానే చిరుత సినిమాతో మొదటిసారి ఇండస్ట్రీలోకి వచ్చాడు . ఆ సమయంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. నటన రాదు అని కొంతమంది కామెంట్ చేస్తే.. మరి కొంత మంది మెగాస్టార్ కొడుకు కాబట్టి ఇండస్ట్రీలో అవకాశం లభించింది అనే కామెంట్లు కూడా వ్యక్తం అయ్యాయి. అయితే వాటన్నింటిని అధిగమించి ఒక్కో మెట్టు ఎదుగుతూ రంగస్థలం సినిమాలో తన అద్భుతమైన నటనతో అందరిని మెప్పించి పూర్తిస్థాయి నటుడిగా రికార్డు సృష్టించారు రామ్ చరణ్ . ఇక నేడు గ్లోబల్ స్టార్ గా ఎదిగిపోయారు.

ALSO READ:Sai Pallavi: పెళ్లిపై సడన్ ట్విస్ట్ ఇచ్చిన సాయి పల్లవి.. మేల్ ఫ్యాన్స్ తట్టుకుంటారా?

రామ్ చరణ్ ప్రస్తుత సినిమాలు..

Advertisement

రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సన దర్శకత్వంలో పెద్ది సినిమా చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ రామ్ చరణ్ సరసన హీరోయిన్గా నటిస్తోంది.ఈ సినిమా తర్వాత రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన డైరెక్టర్ సుకుమార్ తో రామ్ చరణ్ తదుపరి చిత్రాన్ని చేయనున్నారు.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×