Hero Nani : సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్లకు హీరోలకు మధ్య గొడవలు జరగడం కామన్.. కొన్ని కొన్ని సార్లు సినిమా అవుట్ ఫుట్ విషయంలో ఇద్దరు మధ్య వాగ్వాదం రావడం సహజం.. అయితే ఇప్పటివరకు డైరెక్టర్ హీరోల మధ్య గొడవల కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోయింది తప్ప సినిమానే పూర్తిగా ఆగిపోలేదు. కానీ తాజాగా ఓ వార్త మాత్రం సోషల్ మీడియాని షేర్ చేస్తుంది. టాలీవుడ్ స్టార్ హీరో నాని డైరెక్టర్ తో గొడవపడి సినిమాని వదులుకున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం నెట్టింట ప్రచారంలో ఉంది.. ఎప్పుడు కూల్ గా కనిపించే నాని డైరెక్టర్లతో గొడవ పడడం ఏంటి? అనే సందేహం కూడా వస్తుంది కదూ.. ఇందులో నిజం ఎంత ఉందో? అసలు ఏ డైరెక్టర్ తో ఆయన గొడవ పడ్డారో ఇప్పుడు ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..
న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ ని మొదలు పెట్టిన నాని ఒక్కో మెట్టు ఎదుగుతూ ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోల జాబితాలో ఉన్నారు. అలాంటి నాని ఒకప్పుడు డైరెక్టర్ తో గొడవపడి సినిమాను వదిలేసాడంటూ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం మాస్ స్టోరీలతో మాస్ యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకోవాలని నాని తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. గతంలో డైరెక్టర్ శేఖర్ కమ్ములతో ఓ సినిమాకి కమిట్ అయ్యారట. మొదట్లో ఓకే అని చెప్పి ఆ తర్వాత నో చెప్పడానికి గల కారణం ఏంటి అని శేఖర్ కమ్ముల సైతం నానితో మాట్లాడాడట.. నాని మాస్ సినిమాలు చేస్తున్నాను ఇలాంటి టైం లో క్లాస్ సినిమాలు చేయలేను అని డైరెక్టర్ తో చెప్పడంతో వీళ్ళిద్దరి మధ్య మాటలు లేవని తెలుస్తుంది. ఇది జరిగిన అసలు మ్యాటర్. శేఖర్ కమ్ముల క్లాసికల్ లవ్ స్టోరీ తో సినిమాలో చేస్తూ వరుసగా హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు.
Also Read : ‘పెద్ది’ ఐటమ్ సాంగ్ లో హీరోయిన్స్ ఎవరో తెలుసా..?
నాని గురించి ఎంత చెప్పినా తక్కువే. దసరా తర్వాత నుంచి మాస్ హీరోగా అవతారమెత్తి వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఈమధ్య నాన్ని నటించిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్టుగా నిలుస్తుంది. గత ఏడాది హిట్ 3 మూవీతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.. ఇప్పుడు శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ మూవీతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు.. ఈ సినిమా త్వరలోనే థియేటర్లోకి రాబోతుంది. దీని తర్వాత మరో నాలుగు భారీ ప్రాజెక్టులను లైన్లో పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఒకవైపు హీరోగా మాత్రమే కాదు మరోవైపు నిర్మాతగా కూడా ఆయన వరుసగా సినిమాలు నిర్మిస్తు సక్సెస్ అవుతున్నారు.