E-Paper
Advertisement

Sai Durgha Tej: నిన్ను అలా చూసి గూస్‌బంప్స్ వచ్చాయి చరణ్..

Sai Durgha Tej: నిన్ను అలా చూసి గూస్‌బంప్స్ వచ్చాయి చరణ్..
Advertisement

Sai Durgha Tej: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) పుట్టినరోజును పురస్కరించుకుని సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కుటుంబ సభ్యులు, అభిమానులు, ఇతర నటీనటులు, రాజకీయ నాయకులు.. ఇలా అందరూ రామ్ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు (HBDRamCharan) తెలుపుతూ ఎక్స్ వేదికగా పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ పోస్ట్‌లో రామ్ చరణ్ పేరు దేశ వ్యాప్తంగా టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఇక కుటుంబ సభ్యులు అయితే రామ్ చరణ్‌తో ఉన్న అనుబంధాన్ని కూడా షేర్ చేసుకుంటున్నారు. వారి చిన్నప్పటి ఫొటోలను షేర్ చేస్తారు. ఆ ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ (Sai Durgha Tej) కూడా రామ్ చరణ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన పోస్ట్, పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ సాయి ఏమని ట్వీట్ చేశాడంటే..

Also Read- Hey Balwanth: ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతున్న సుహాస్-శివాని హే బల్వంత్.. ఆ రోజు నుంచే అందుబాటులోకి!

నాకు దక్కిన గౌరవం

Advertisement

‘‘పుట్టినరోజు శుభాకాంక్షలు చరణ్ @AlwaysRamCharan. నీ అంకితభావాన్ని చాలా దగ్గర నుంచి గమనించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. నిన్న పెద్ది సెట్స్‌లో నిన్ను చూస్తుంటే నాకు రోమాలు నిక్కబొడుచుకున్నాయి. నిన్ను తెరపై చూడటానికి ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. నీకు లభిస్తున్న ఈ ప్రేమ, విజయంతో పాటు నీకు ఎంతో కీర్తిని తెచ్చిపెడుతున్న ప్రతి అందమైన విషయానికి నువ్వు ఖచ్చితంగా అర్హుడివి’’ అని సాయి దుర్గా తేజ్ పేర్కొన్నారు. ఈ పోస్ట్‌తో పాటు రామ్ చరణ్‌తో కలిసి దిగిన చిన్నప్పటి ఫొటోను, లేటెస్ట్ ఫొటోను కూడా ఆయన ఈ ట్వీట్‌కు జత చేశారు. ఈ పోస్ట్‌, ఫొటోలను చూసిన ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతున్నారు. సాయికి థ్యాంక్స్ చెబుతూ, కామెంట్స్‌లో రామ్ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Also Read- Chiranjeevi: పెద్ది పహిల్వాన్ గ్లింప్స్..బుచ్చిబాబు పై మెగాస్టార్ ప్రశంశలు… ఏమన్నారంటే!

వావ్.. అద్భుతం

Advertisement

ప్రస్తుతం సాయి దుర్గా తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’తో ఏప్రిల్ 30న బాక్సాఫీస్‌ని షేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. చరణ్ బర్త్‌డే స్పెషల్‌గా వచ్చిన ‘పెద్ది’ పెహల్వాన్ గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ గ్లింప్స్ చూసిన వారంతా ‘వావ్.. అద్భుతం’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దర్శకుడు బుచ్చిబాబుపై మెగాభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నిజంగా ఇలా ఊహించలేదేని, ఒక్క సినిమా అనుభవంతో ఇలాంటి అవుట్ ఫుట్ ఇస్తావని జడ్జ్ చేయలేదని, వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్లింప్స్‌తో ఈసారి రామ్ చరణ్ బాక్సాఫీస్ వద్ద గట్టిగా సౌండ్ చేయబోతున్నాడనేలా.. ఫ్యాన్స్ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

Also Read- UBS OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్.. ఎప్పుడు ?ఎక్కడంటే?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×