E-Paper
Advertisement

HBD Ntr : ఎన్టీఆర్ ఆస్తులు ఎన్ని కోట్లంటే..? బాలనటుడు టు డ్రాగన్.

HBD Ntr : ఎన్టీఆర్ ఆస్తులు ఎన్ని కోట్లంటే..? బాలనటుడు టు డ్రాగన్.
Advertisement

HBD Ntr : తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు జూనియర్ ఎన్టీఆర్.. నందమూరి వారసుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన ఆ తర్వాత ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజిని సంపాదించుకున్నాడు. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ మూవీతో ఏకంగా గ్లోబల్ స్టార్ అయ్యాడు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలల్లో నటిస్తున్న ఎన్టీఆర్ పుట్టినరోజు నేడు. ఈ సందర్బంగా ఆయన అభిమానులు, నందమూరి ఫ్యాన్స్ ఎన్టీఆర్ కు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇండస్ట్రీలోని ఫ్రెండ్స్ అలాగే సన్నిహితులు ఎన్టీఆర్ కు బర్త్ డే విసెష్ చెబుతున్నారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్బంగా ఆయన ఆస్తులు, నటించిన సినిమాలు గురించి ఒకసారి తెలుసుకుందాం..

ఎన్టీఆర్ ఆస్తులు ఎంతంటే..?

అతి చిన్నవయసులోనే నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నాడు ఎన్టీఆర్. ఒక్కో సినిమా అతనికి ఒక్కో మెట్టు ఎదుగుతూ స్టార్ అయ్యాడు. మరి స్టార్ ఇమేజ్ తో పాటుగా ఆస్తులు కూడా బాగానే సంపాదించాడు. ఎన్టీఆర్ ఇప్పటివరకు సంపాదించిన ఆస్తుల విలువ 600 కోట్లకు పై మాటే అని తెలుస్తుంది. ఒక్కో సినిమాకు రూ.45 కోట్ల నుంచి రూ.80 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నారంట.. అంతే కాదు బ్రాండ్ ఎంబాసిడర్ గా కూడా వ్యవహారిస్తూ నెలకు దాదాపు 4 కోట్లు సంపాదిస్తున్నాడు. అంతేకాదు పలు బిజినెస్ లు కూడా చూస్తూ సక్సెస్ అవ్వడం మాత్రమే కాదు. లాభాలను అర్జీస్తున్నాడు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఆయనకు ఉన్న విలాసవంతమైన ఇల్లు సుమారు రూ.25 కోట్లకు విలువ, అలా 80 కోట్లతో ప్రైవేట్ జెట్ ఉంది. వీటితో పాటుగా భార్య పేరు మీద ల్యాండ్ కూడా ఉందని తెలుస్తుంది.

ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే..

Advertisement

ఎన్టీఆర్ హరికృష్ణ, శాలిని దంపతులకు మే 20, 1983 లో జన్మించారు. ఆ తర్వాత నటనపై ఆసక్తితో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. క్లాసికల్ డ్యాన్స్ కూడా నేర్చుకున్నాడు. ఒక్కో సినిమాతో క్రేజ్ కూడా పెరిగింది. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ టైం లోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు.. 13 ఏళ్ల వయసులో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన బాలరామాయణంలో నటించాడు.. ఆ తర్వాత స్టూడెంట్ నెం. 1 మూవీతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. టెంపర్’, ‘జనతా గ్యారేజ్’, ‘అరవింద సమేత’ వంటి సినిమాలతో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఆ తర్వాత ట్రిపుల్ ఆర్ చిత్రంతో గ్లోబల్ స్టార్ అయ్యాడు. ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ కూడా పెరిగారు. గతంలో దేవర, వార్ 2 చిత్రాలతో ప్రేక్షకులను పలకరించాడు కానీ ఆశించిన ఫలితాలను అందుకోలేదు.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ మూవీలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్బంగా ఈ చిత్రం నుంచి వచ్చిన గ్లింప్స్ వీడియో రిలీజ్ అయ్యింది. ప్రేక్షకులను మెప్పించింది. త్వరలోనే మూవీ రిలీజ్ కాబోతుంది. నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న ఎన్టీఆర్ కు మా బిగ్ టీవీ స్పెషల్ విషెస్ చెబుతుంది.. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటుంది. హ్యాపీ బర్త్ డే ఎన్టీఆర్..

Related News

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

Big Stories

Advertisement
×