E-Paper
Advertisement

జెన్నిఫర్ వింగెట్ పెళ్లి పీటలెక్కబోతుందా? సింగపూర్ బిజినెస్‌మెన్‌తో త్వరలోనే వివాహం!

జెన్నిఫర్ వింగెట్ పెళ్లి పీటలెక్కబోతుందా? సింగపూర్ బిజినెస్‌మెన్‌తో త్వరలోనే వివాహం!
Advertisement

Jennifer Winget Wedding: బుల్లితెర ప్రేక్షకులకు ఎంతగానో సుపరిచితమైన ప్రముఖ హిందీ టెలివిజన్ నటి జెన్నిఫర్ వింగెట్ (Jennifer Winget) త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ‘దిల్ మిల్ గయే’, ‘సరస్వతీచంద్ర’, ‘బేహద్’ వంటి సూపర్ హిట్ సీరియల్స్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ 41 ఏళ్ల నటి, సింగపూర్‌కు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్తతో ప్రేమలో ఉన్నట్లు సమాచారం.

Read also-బాక్స్ ఆఫీస్ వద్ద ‘పెద్ది’ ఊచకోత.. కేవలం 4 రోజుల్లోనే రూ. 250 కోట్ల క్లబ్‌లో రామ్ చరణ్!

Advertisement

వెకేషన్‌లో ప్రపోజల్..

హిందుస్తాన్ టైమ్స్ నివేదికల ప్రకారం… జెన్నిఫర్ వింగెట్, సింగపూర్ బేస్డ్ బిజినెస్‌మెన్ విలియం ఇష్మాయిల్ (William Ishmael) గత కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఇటీవల ఒక వెకేషన్ (సెలవుల) సమయంలో విలియం ఆమెకు ప్రపోజ్ చేయగా, జెన్నిఫర్ అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Advertisement

ఈ ఏడాది చివర్లోనే వివాహం!

ప్రస్తుతం వీరిద్దరూ పెళ్లి పీటలెక్కడానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ లేదా డిసెంబర్-జనవరి మధ్యలో క్రైస్తవ సంప్రదాయం (Christian wedding) ప్రకారం వీరి వివాహం జరగనున్నట్లు టాక్. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన పనులను, వెండర్స్ మరియు వెడ్డింగ్ ప్లానర్లను షార్ట్‌లిస్ట్ చేసే పనిలో జెన్నిఫర్ బిజీగా ఉన్నట్లు సమాచారం. ఒక మంచి వెడ్డింగ్ వేదిక (Venue) కోసం ప్రస్తుతం ఈ జంట అన్వేషిస్తోంది. జెన్నిఫర్ క్లోజ్ ఫ్రెండ్స్ అయిన నటీమణులు హర్లీన్ సేథి, జెనీలియా దేశ్‌ముఖ్‌లకు కూడా ఈ పెళ్లి ప్లాన్స్ గురించి ముందే తెలుసని బాలీవుడ్ వర్గాల టాక్.

Read also-Hebah Patel : అబ్బా.. చీరలో హెబ్బా కేక.. వయ్యారాలతో చంపేస్తుంది..!

రెండో పెళ్లికి సిద్ధమైన నటి..

జెన్నిఫర్ వింగెట్‌కు ఇది రెండో వివాహం. గతంలో ఆమె తన కో-స్టార్, నటుడు కరణ్ సింగ్ గ్రోవర్‌ను 2012లో వివాహం చేసుకుంది. అయితే, మనస్పర్థల కారణంగా వీరిద్దరూ 2014లోనే విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత కరణ్ సింగ్ గ్రోవర్ బాలీవుడ్ నటి బిపాసా బసును వివాహం చేసుకున్నారు. ఇక జెన్నిఫర్ విషయానికి వస్తే, విడాకుల తర్వాత ఆమె తన కెరీర్‌పైనే పూర్తి దృష్టి పెట్టింది. ఈ ఏడాది ప్రారంభంలో ఆమె తన సహనటుడు కరణ్ వాహితో ప్రేమలో ఉన్నట్లు, వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు కొన్ని రూమర్స్ వచ్చాయి. అయితే కరణ్ వాహి ఆ వార్తలను పూర్తిగా ఖండించారు. ఇప్పుడు సింగపూర్ వ్యాపారవేత్త విలియం ఇష్మాయిల్‌తో జెన్నిఫర్ కొత్త జీవితాన్ని ప్రారంభించబోతుండటంతో ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు.

Related News

ప్రాణభయంతో సొంత ఇంటిని అమ్మేసిన టైగర్ ష్రాఫ్.. ఎన్ని కోట్లంటే?

చిక్కుల్లో ఫౌజీ సినిమా.. నేతాజీ మనవడు ఏమన్నారంటే?

తెలుగు డబ్బింగ్ కి సిద్ధమైన ఒడిస్సా హిట్ మూవీ..ఏదో తెలుసా?

ఘెట్టో కిడ్స్ తో భాగ్య శ్రీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అదుర్స్.. వీడియో వైరల్!

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు..

ఏందమ్మా మానస.. సన్‌సెట్‌లోనూ ఇంత అందంగా ఉన్నావేంటి!

అసలు నేను చేసిందేంటి? గరివిడి లక్ష్మి వివాదంపై ఆర్పీ ఆవేదన!

గరివిడి లక్ష్మి వివాదంపై ఆర్పీ పట్నాయక్ సంచలన వ్యాఖ్యలు.. బయోపిక్‌లో నిజాలు చూపించారా?

Big Stories

Advertisement
×