E-Paper
Advertisement

రామాయణ తర్వాత హీరో యష్ ఏ సినిమా చేయబోతున్నాడంటే..?

రామాయణ తర్వాత హీరో యష్ ఏ సినిమా చేయబోతున్నాడంటే..?
Advertisement

Hero Yash : కన్నడ రాకింగ్ స్టార్ యష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కేజిఎఫ్ మూవీ తో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. అతని కెరియర్ కి ఈ మూవీ పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన సీక్వెల్ మూవీ కూడా భారీ విషయాన్ని సొంతం చేసుకోవడంతో యష్ తో సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలు క్యూ కట్టారు.. ప్రస్తుతం ఈ హీరో రెండు భారీ ప్రాజెక్టులలో నటిస్తున్నారు. అయితే ఆ తర్వాత ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడా అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. రామాయణ మూవీ తర్వాత యష్ ఎవరితో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయో ఒకసారి వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

యష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో..?

కన్నడ స్టార్, పాన్ ఇండియా హీరో యష్ కే జి ఎఫ్ 2 సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నారు. ప్రస్తుతం ఈయన రెండు భారీ ప్రాజెక్టులలో నటిస్తున్నాడు. టాక్సిక్‌, `రామాయణ`సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఈ రెండు సినిమాల నుంచి వచ్చిన అప్డేట్స్ తో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమాలను థియేటర్లలో చూస్తామని ఈ హీరో అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం రామాయణ మూవీ తర్వాత సినిమాలకు బ్రేక్ తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. 2022లో ఒక మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన యష్ ఆ తరువాత కొంత బ్రేక్ తీసుకుని సైలెంట్‌గా తన పనేంటో చేసుకుంటూ పోయాడు.. ఆ సినిమా గురించి ఎక్కడ ప్రకటించకుండా దాదాపు పూర్తయ్యేంత వరకు సైలెంట్ గా చేసుకున్నాడు.. ఇప్పుడు కూడా సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకుంటున్నా అని వేరే సినిమాని సైలెంట్ గా పూర్తి చేస్తాడేమో అని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా కూడా యష్ సినిమా కథలు విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుని ఎంపిక చేసుకుంటున్నాడు. ఇప్పటివరకు ఆయన నటించిన సినిమాలన్నీ కూడా మంచి టాక్ ని సొంతం చేసుకున్నాయి. యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఇకముందు ఎలాంటి స్టోరీ తో ప్రేక్షకులను పలకరిస్తారో చూడాలి..

Advertisement

Also Read : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ ప్రేమ రియల్ లైఫ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

టాక్సిక్ మూవీ రిలీజ్ ఎప్పుడు..?

కేజీఎఫ్ 2 తర్వాత యష్ ఒక లేడీ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చాడు. డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో చేసిన పీరియాడిక్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మీణీ వసంత్ తదితరులు నటిస్తున్నారు.. ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన పోస్టర్లు అలాగే టీజర్లు అంచనాలను పెంచేసేసాయి. కన్నడతో పాటు ఇంగ్లీష్‌లోనూ రూపొందించిన ఈ సినిమాని కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలతో పాటు ఇంగ్లీష్‌లోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తుంది. అయితే దాదాపు రెండు నెలలుగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది.. కొన్ని పరిస్థితుల కారణంగా ఈ సినిమా వాయిదా పడింది. ఎట్టకేలకు జూన్ 4న సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ డేట్ ను ప్రకటించారు. ఈ మూవీతో హీరో ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తాడో చూడాలి..

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×