Karunakaran Movie:కరుణాకరన్.. టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై ప్రేమ కావ్యాలని తెరకెక్కించడంలో ఈయన స్టైలే వేరు. ఇక కరుణాకరన్ సినిమాల్లో హీరోయిన్ల క్యారెక్టరైజేషన్, మ్యూజిక్, విజువల్స్ చాలా రిచ్‌గా, ఫ్రెష్‌గా ఉంటాయని చెప్పక్కర్లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ది బెస్ట్ అనిపించుకున్న ‘తొలిప్రేమ’ ఈయన దర్శకత్వంలో వచ్చిందే. ఇక ప్రభాస్ కి డార్లింగ్ ఇమేజ్ ని తెచ్చిన ‘డార్లింగ్’ కూడా ఆయన సృష్టించిన మ్యాజిక్కే. కరుణాకరన్ చివరిగా 2018లో వచ్చిన ‘తేజ్ ఐ లవ్ యు’ అంటూ సాయి దుర్గ తేజ్ తో సినిమా చేసిన సంగతి తెల్సిందే. ఇక ఈ సినిమా డిజాస్టర్ కావడంతో మెగా ఫోన్ కి దూరంగా ఉండిపోయాడు ఈ లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్.
బెల్లంకొండ గణేష్ హీరోగా
అలా గత ఆరేళ్లుగా మెగాఫోన్ పట్టకుండా ఉన్న కరుణాకరన్ తాజాగా ఆ గ్యాప్ ని బ్రేక్ చేస్తూ తన కొత్త ప్రాజెక్ట్ కి ముహూర్తం పెట్టేశారు. బెల్లంకొండ సురేష్ కొడుకు బెల్లంకొండ గణేష్ హీరోగా కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ఈ రోజే గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో లాంచ్ అయింది. అయితే ఈ సినిమా విశేషం ఏంటో తెలుసా.. ‘జాతిరత్నాలు’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ అనుదీప్ కేవీ ఈ సినిమాకి డైలాగ్స్ రాయడం. అయితే ఫంకీతో పెద్ద డిజాస్టర్ మూట గట్టుకున్నా అనుదీప్ కి అవకాశాలు వస్తున్నాయంటే అదంతా జాతిరత్నాలు మహిమే అని చెప్పకతప్పదు.
లవ్ స్టోరీలు కరువయ్యాయి అనుకుంటున్న సమయంలో
ఇక బెల్లంకొండ గణేష్ విషయానికి వస్తే మొదటి సినిమా ‘స్వాతి ముత్యం’తో మెప్పించిన ఈ కుర్ర హీరో ‘నేను స్టూడెంట్ సర్’ తో పర్లేదనిపించాడు. ఇపుడు ముచ్చటగా మూడో సినిమా లెజెండరీ లవ్ స్టోరీ మేకర్ చేతిలో పడటం గణేష్ కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. మరో వైపు ఈ కాలంలో ఫ్రెష్ లవ్ స్టోరీలు కరువయి పోయాయి అనుకుంటున్న సమయంలో కరుణాకరన్ మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేస్తానని ఎంట్రీ ఇవ్వడం అంటే ప్రేమ కథల్ని ఇష్టపడేవారికి అది గుడ్ న్యూసే.
ఈసారి సాలిడ్ హిట్ తో కమ్ బ్యాక్ ఇవ్వడం పక్కా
ఇక ఆరేళ్ల తర్వాత మళ్లీ కెమెరా వెనక్కి వచ్చిన కరుణాకరన్, ఈసారి సాలిడ్ హిట్ తో కమ్ బ్యాక్ ఇవ్వడం పక్కా అంటూ నెట్టింట కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు మూవీ లవర్స్. ఇక త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన విషయాలు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని సమాచారం. చూడాలి మరి బెల్లంకొండ గణేష్ – కరుణాకరన్ ల ఈ క్రేజీ కాంబోతో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో!
also read: