E-Paper
Advertisement

Singer Mangli: మరో వివాదంలో సింగర్ మంగ్లీ.. బూతు పాటపై కేసు నమోదు..

Singer Mangli: మరో వివాదంలో సింగర్ మంగ్లీ.. బూతు పాటపై కేసు నమోదు..
Advertisement

Singer Mangli: సింగర్ మంగ్లీ పరిచయం అవసరం లేని పేరు. ఈమె సింగర్ గా ఇండస్ట్రీలో ఎంతోమంది అభిమానులను, పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. జానపద పాటలను పాడుతూ యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందిన మంగ్లీ(Mangli) అనంతరం ప్లే బ్యాక్ సింగర్ గా సినిమాలలో అవకాశాలను అందుకున్నారు. కెరియర్ మొదట్లో తెలుగు సినిమాలలో మాత్రమే పాటలు పాడుతున్న ఈమె ప్రస్తుతం తమిళం, కన్నడ, హిందీ భాషలలో కూడా పాటలు పాడుతూ ఎంతో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా సింగర్ మంగ్లీ పాడిన ఓ పాట వివాదంలో చిక్కుకుంది.

సింగర్ మంగ్లీ బూతు పాట..

కన్నడ నటుడు ధ్రువ సర్జా(Dhruva Sarja) హీరోగా ప్రేమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం KD: ది డెవిల్(KD The Devil). ఈ సినిమాలో “సర్కే చునర్ తేరి సర్కే” అంటూ సాగిపోయే ఈ స్పెషల్ సాంగ్ ప్రస్తుతం వివాదంలో చిక్కుకుంది. ఈ పాట మొత్తం అశ్లీలంగా ఉంది అంటూ పెద్ద ఎత్తున నేటిజన్లు విమర్శలు కురిపించారు. అశ్లీలతతో కూడిన ఈ పాట ద్వారా సమాజానికి ఏం తెలియజేయాలనుకుంటున్నారంటూ ఈ పాటపై వ్యతిరేకత వచ్చింది .ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో పాటను నిషేధించాలని కోరుతూ ముంబైకి చెందిన ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సర్టిఫికెట్, అలాగే సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు ఫిర్యాదులు చేశారు.

ఐటమ్ సాంగ్ చేసిన నోరా ఫతేహి..

Advertisement

ఈ పాట మైనర్లకు హాని కలిగించే విధంగా ఉందని ఫిర్యాదులు వెళ్లడంతో ఈ పాటను యూట్యూబ్ నుంచి తొలగించారు. ఇక ఈ పాట కోసం పనిచేసిన సంగీత దర్శకులు గాయని గాయకులపై కూడా ఫిర్యాదులు వెళ్లాయి. ఈ సినిమా దర్శకుడు ప్రేమ్, ఈ పాట రచయిత రాకీబ్ ఆలం, మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ అలాగే సింగర్ మంగ్లీ పేర్లను కూడా ఫిర్యాదులో ప్రస్తావించారు. ఇక ఐటమ్ సాంగ్ లో బాలీవుడ్ నటి నోరా ఫతేహి(Nora Fatehi) నటించిన సంగతి తెలిసిందే.

వరుస వివాదాలలో సింగర్ మంగ్లీ..

Advertisement

ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న ఈ పాట పట్ల వ్యతిరేకత రావడంతో ఈ పాటను యూట్యూబ్ నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలోనే ఈ పాట పాడిన సింగర్ మంగ్లీ పై కూడా ఫిర్యాదులు రావడంతో ఈమె మరో వివాదంలో చిక్కుకున్నారని చెప్పాలి. ఈ విషయంపై సింగర్ మంగ్లీ ఇప్పటివరకు ఎక్కడ స్పందించలేదు మరి తన స్పందన ఎలా ఉంటుందనేది తెలియాల్సి ఉంది. ఇటీవల మంగ్లీ తరచు వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే .తన పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున పార్టీ ఏర్పాటు చేయడమే కాకుండా డ్రగ్స్ వాడారని వార్తలు రావడంతో ఈమె వివాదంలో నిలిచారు అయితే పార్టీలో ఎలాంటి డ్రగ్స్ ఉపయోగించలేదని స్పష్టమైనది. అలాగే ఇటీవల తన పాటపై సోషల్ మీడియాలో రావడంతో మంగ్లీ సైబర్ క్రైమ్ ను కూడా ఆశ్రయించడంతో ఈమె వివాదంలో నిలిచారు.

Also Read: Manchu Lakshmi: ఘనంగా మంచు లక్ష్మి కూతురు విద్యా నిర్వాణ ఓణీల వేడుక..ఫోటోలు వైరల్!

Related News

రామాయణంలోకి అమీర్ ఖాన్ కూతురు.. ఆ 5 నిమిషాలే కీలకమట!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. ఆ రూమర్స్ కు చెక్..

మమిత బైజుకు ఏమైంది..? సినిమాలకు గుడ్ బై..?

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

Big Stories

Advertisement
×