E-Paper
Advertisement

సంగీతం నుండి బిజినెస్ వరకు.. ఆశాభోస్లే మొత్తం ఆస్తులు ఎంతంటే?

సంగీతం నుండి బిజినెస్ వరకు.. ఆశాభోస్లే మొత్తం ఆస్తులు ఎంతంటే?
Advertisement

Asha bhosle: ప్రముఖ గాయని ఆశా భోస్లే గత కొంతకాలంగా ఛాతీ ఇన్ఫెక్షన్, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో సతమతమవుతూ శనివారం (ఏప్రిల్ 11 2026) రాత్రి గుండెపోటు రావడంతో హుటాహుటిన ఆమెను కుటుంబ సభ్యులు ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ కి తరలించారు. ప్రత్యేకమైన వైద్య బృందం సమక్షంలో చికిత్స అందించినప్పటికీ కోలుకోలేక ఆదివారం నాడు ఆమె కన్నుమూశారు. ఆశాభోస్లే మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు .. ఆమె మరణం పట్ల దేశ సినీ పరిశ్రమ ఒక్కసారిగా మూగబోయింది. పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు, నెటిజన్లు ఈమె మరణానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. వీరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయబరుస్తున్నారు. ఇకపోతే ఆశాభోస్లే సింగర్ ద్వారా భారీగా అర్జించిన ఆదాయాన్ని వ్యాపారాలలో పెట్టుబడిగా పెట్టి మరింత ఆదాయాన్ని పెంపొందించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు సంబంధించిన ఆస్తుల వివరాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి ఆశా భోస్లే 70 సంవత్సరాల సినీ కెరియర్లో 92 సంవత్సరాల జీవితకాలంలో ఎంత సంపాదించింది అనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.

అంతర్జాతీయ స్థాయికి విస్తరించిన వ్యాపార సామ్రాజ్యం..

ప్రముఖ గాయనిగా పేరు సొంతం చేసుకున్న ఈమె గొప్ప గాయని మాత్రమే కాదు సక్సెస్ఫుల్ వ్యాపారవేత్త కూడా.. అయితే ఈ విషయం ముంబై వాసులకు తప్ప బయట వారికి పెద్దగా తెలియకపోవచ్చు. ఈమె వ్యాపారం ఆస్తుల విలువ ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. తన అద్భుతమైన గాత్రంతో కోట్లాదిమంది ప్రజల మనసులు గెలిచిన ఈ మెలోడీ క్వీన్ ఆశాభోస్లే వంటల పట్ల తనకున్న ఇష్టాన్ని ఒక విజయవంతమైన రెస్టారెంట్ బ్రాండ్ గా మార్చారు. దానికి తన పేరు “ఆశా’స్ రెస్టారెంట్” అని కూడా పెట్టారు. మొదటి రెస్టారెంట్ ను 2002లో దుబాయ్ లోని వాఫీ సిటీ మాల్ లో ఆరంభించారు..ఆ తర్వాత ఈ వ్యాపారాన్ని అంతర్జాతీయ స్థాయికి విస్తరించారు . ఈ రెస్టారెంట్ బ్రాంచ్ లు దుబాయ్, కువైట్, బహ్రెయిన్ , ఖతార్, అబుదాబి లతో పాటు యూకే లోని బర్మింగ్ హామ్, మాంచెస్టర్ వంటి నగరాలలో కూడా ఉన్నాయి. అంటే ఈమె ఆలోచన ధోరణి ఎంత గొప్పగా ఉందో అర్థమవుతుంది.

Advertisement

also read:అప్పుడే గర్భవతినయ్యాను.. కానీ ఆ తప్పే నన్ను మాతృత్వానికి దూరం చేస్తోంది – వితికా శేరు!

ఆశా భోస్లే మొత్తం ఆస్తుల వివరాలు..

ఆశా భోస్లే మొత్తం ఆస్తుల వివరాల విషయానికొస్తే ముంబై, పూణే వంటి ప్రాంతాలలో విలాసవంతమైన గృహాలతో పాటు 80 నుండి 100 కోట్ల విలువ చేసే రియల్ ఎస్టేట్ పోర్ట్ పోలియో కూడా ఉంది. అలాగే ముంబైలోని పెద్దారు రోడ్డులో అత్యంత ఖరీదైన నివాసాన్ని ఆమె నిర్మించుకున్నారు. 2025లో ఆమె తన కుమారుడు ఆనంద్ భోస్లే తో కలిసి పూణేలోని పంచశీల్ వన్ నార్త్ లో ఉన్న 3, 401 చదరపు అడుగుల విలాసవంతమైన అపార్ట్మెంట్ ను రూ.6.15 కోట్లకు విక్రయించారు. ఈ అపార్ట్మెంట్లో 152 చదరపు అడుగుల టెర్రర్స్ , 5 పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి. ఇక అటు రెస్టారెంట్లు, బిజినెస్ తో బిజీగా మారిన ఈమె మొత్తం 250 కోట్ల వరకు ఆస్తిని సంపాదించినట్లు సమాచారం.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×