E-Paper
Advertisement

Rashmika – Vijay: పెళ్లైన 2 రోజులకే సెట్ పైకి.. “మేడ్ ఫర్ ఈచ్ అదర్” అంటూ!

Rashmika – Vijay: పెళ్లైన 2 రోజులకే సెట్ పైకి.. “మేడ్ ఫర్ ఈచ్ అదర్” అంటూ!
Advertisement

Rashmika – Vijay:ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు అలా పెళ్లిళ్లు చేసుకుంటున్నారో లేదో ఇలా సెట్ పైకి వచ్చేసి అందరిని ఆశ్చర్యపరిస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు (Raj Nidimoru) తో అలా ఏడడుగులు వేసిందో లేదో అప్పుడే తన తెలుగు సినిమా ‘మా ఇంటి బంగారం’ సినిమా సెట్ లో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది. సినిమాపై తనకున్న డేడికేషన్ ఏంటో నిరూపించి అందరిని మెప్పించింది. అలా సమంత పెళ్లయిన వారంలోపే సెట్ మీద అడుగుపెడితే.. ఇక్కడ క్రేజీ జంటగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మందన్న(Rashmika mandanna) పెళ్లైన రెండు రోజులకే సెట్ పై కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

పెళ్లయిన రెండు రోజుల్లోనే సెట్ పైకి..

తాజాగా “మేడ్ ఫర్ ఈచ్ అదర్” అంటూ రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఏంటా ఈ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం.. అసలు విషయంలోకి వెళ్తే.. విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న దాదాపు 8 సంవత్సరాల పాటు రహస్యంగా తమ బంధాన్ని మెయింటైన్ చేసి ఈ ఏడాది ఫిబ్రవరి 26న ఉదయపూర్ హై ప్రొఫైల్ ప్యాలెస్ లో అత్యంత సన్నిహితులు, బంధువుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఉదయం హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంటే.. అదే రోజు సాయంత్రం రష్మిక మందన్న మత ఆచారాల ప్రకారం కొడవ పద్ధతిలో వివాహం చేసుకున్నారు.

రిసెప్షన్ కి స్వయంగా ఆహ్వానం..

Advertisement

మార్చి 4వ తేదీన హైదరాబాదులో తాజ్ కృష్ణ హోటల్లో రష్మిక మందన్న విజయ్ దేవరకొండ రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఇప్పటికే వివాహమనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, భారత ప్రధాని నరేంద్ర మోదీ లను కలిసి జంటగా ఆహ్వానించారు. ఇక మరొకవైపు రష్మిక మందన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను స్వయంగా కలిసి తమ రిసెప్షన్ వేడుకకు ఆహ్వానించింది.

కొత్త యాడ్ తో సందడి..

ఇలాంటి సమయంలో తాజాగా రష్మిక మందన్న తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా “మేడ్ ఫర్ ఈచ్ అదర్” అంటూ ఒక యాడ్ వీడియోని ఆమె షేర్ చేశారు. ఇకపోతే పెళ్లి తర్వాత మొదటిసారి విజయ్, రష్మిక కలసి నటించిన ప్రకటన రిలీజ్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ ప్రకటన పెళ్లయిన తర్వాత సెట్ పై చేశారనుకున్నారు. కానీ ఇది పెళ్లికి ముందే షూట్ జరిగినట్లు తెలుస్తోంది. ఒక వెడ్డింగ్ క్లాత్ బ్రాండ్ కి వీరిద్దరూ కలిసి ఈ యాడ్ చేసినట్టు తెలుస్తుంది. ఇకపోతే రష్మిక మందన్నకు విజయ్ దేవరకొండకు నేషనల్ వైడ్ గుర్తింపు ఉంది కాబట్టే పెళ్లికి ముందే షూట్ చేసిన ఈ వీడియోని పెళ్లి తర్వాత రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట చేసిన ఈ యాడ్ తో వెడ్డింగ్ క్లాత్ బ్రాండ్ కి మరింత గుర్తింపు లభిస్తోందని చెప్పవచ్చు.

Advertisement

ALSO READ:Vijay -Sangeetha: 28 ఏళ్ల తర్వాత బయటపడ్డ నిజం.. విడాకుల పిటిషన్ లో!

భారీగా రెమ్యూనరేషన్..

ఇకపోతే ఈ యాడ్ కోసం ఇద్దరికీ కూడా సదరు సంస్థ భారీగానే రెమ్యూనరేషన్ ఇచ్చుకున్నట్లు తెలుస్తోంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ పెళ్లి బ్యాక్ డ్రాప్ లో ఒక సాంగ్తో ఈ యాడ్ సాగింది. ఇందులో సరదాగా ఇద్దరు గొడవపడి మళ్లీ కలిసి పెళ్లి చేసుకుని డాన్స్ చేసినట్లు చూపించారు. మొత్తానికైతే పెళ్లి తర్వాత వీరిద్దరికి సంబంధించిన ఫస్ట్ యాడ్ రావడంతో అభిమానులు దీనిని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేసేస్తున్నారు.. ప్రస్తుతం ఈ యాడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

?utm_source=ig_web_copy_link

Related News

బీజేపీపికి నటుడు నరేష్ వార్నింగ్.. పెట్రోల్ విషయంలో ఆ తప్పు చెయ్యొద్దు.. పోస్ట్ వైరల్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Big Stories

Advertisement
×