E-Paper
Advertisement

The RajaSaab: ఏంటీ.. హీరోనే అనుకుంటే హీరోయిన్ కూడా డూపేనా.. ఫోటో వైరల్!

The RajaSaab: ఏంటీ.. హీరోనే అనుకుంటే హీరోయిన్ కూడా డూపేనా.. ఫోటో వైరల్!
Advertisement

The RajaSaab: ప్రముఖ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas ) హీరోగా మారుతి(Maruthi ) దర్శకత్వంలో వచ్చిన చిత్రం హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన చిత్రం ది రాజాసాబ్(The Raja Saab). సంక్రాంతి సందర్భంగా జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రభాస్ హీరోగా నటించగా.. ప్రముఖ మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ (Malavika mohanan) తొలిసారి ఈ చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది.

ఈమెతో పాటు నిధి అగర్వాల్ (Niddhi agerwal), రిద్దీ కుమార్ (Riddhi kumar) హీరోయిన్లుగా నటించారు. ఇదిలా ఉండగా ఈ సినిమా విడుదలకు ముందే సోషల్ మీడియాలో ట్రోల్స్ కి గురైన విషయం తెలిసిందే. ఇక టీజర్ విడుదలైనప్పుడు కూడా గ్రాఫిక్స్ నాణ్యత పై విపరీతమైన విమర్శలు వెల్లువెత్తాయి. పైగా కథలో మంచి అంశాలు ఉన్నప్పటికీ వాటిని సరిగ్గా తెరకెక్కించడంలో మారుతీ ఫెయిల్ అయ్యారు అనే వార్తలు కూడా వినిపించాయి.

హీరోయిన్ కి కూడా డూప్..

Advertisement

ఇకపోతే ఈ సినిమా విడుదలైన తర్వాత పలు యాక్షన్ సన్నివేశాలు, డాన్స్ షార్ట్ లలో ప్రభాస్ స్థానంలో డూప్ ను ఉపయోగించారనే ఆరోపణలు సినిమా చూసిన తర్వాత ఎక్కువగా వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా జియో హాట్ స్టార్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇక్కడ కొన్ని సీన్స్ ను కట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం ఇప్పుడు మరింత వైరల్ గా మారింది. ఇకపోతే హీరోయిన్ మాళవిక మోహనన్ నటించిన ఒక ఫైట్ సీన్ లో కూడా డూప్ వాడారు అనే వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టగా.. ఇప్పుడు ఆ రూమర్స్ కి ఆజ్యం పోశారు నటుడు రాన్సన్ విన్సెంట్.

అసలు విషయం బయటపెట్టిన ప్రముఖ నటుడు..

అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించిన ఈయన ఏ ఫైట్ కి సంబంధించిన ఫోటోలను కొన్ని సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఒక ఫోటోలో మాళవికతో ఫైట్ చేస్తున్న దృశ్యం ఉండగా.. మరో ఫోటోలో ఆమెకు డూప్ గా పనిచేసిన ఫైటర్ తో ఆయన దిగిన చిత్రం కనిపిస్తోంది. దీన్ని ఆధారంగా చూస్తే మాళవిక మోహనన్ స్థానంలో..ఒక పురుష ఫైటర్ ను ఆమె లుక్కుకి తగ్గట్టుగా మేకప్ చేసి అదే కాస్ట్యూమ్ లో సిద్ధం చేసి సీన్ చిత్రీకరించినట్లు నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇకపోతే ఈ ఫోటో కాస్త వైరల్ అవ్వడంతో.. అబ్బాయిని డూప్ గా ఉపయోగించారనే అంశం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.ఇకపోతే ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే రాన్సన్ విన్సెంట్ వెంటనే ఇంస్టాగ్రామ్ పోస్ట్ ను డిలీట్ చేశారు. అయితే ట్రోల్స్ కి భయపడి ఆయన దీనిని డిలీట్ చేసినట్లు తెలుస్తోంది.

మారుతీపై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్..

Advertisement

ఇక దీనికి ప్రభాస్ అభిమానులు, సినిమా ప్రేమికులు మరోసారి మారుతీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హీరో నే డూప్ అనుకుంటే హీరోయిన్ ని కూడా డూప్ గా పెట్టేశారు. ఇక సినిమాలో అందరికీ డూప్ లనే పెట్టారా? అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా విడుదల తర్వాత కూడా ది రాజా సాబ్ సినిమా ఇలా ట్రోల్స్ ఎదుర్కోవడం గమనార్హం. మొత్తానికైతే థియేటర్లలో నిరాశపరచిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ లో కూడా ఇలా ట్రోల్స్ ఎదుర్కోవడం హాట్ టాపిక్ గా మారింది. మరి దీనిపై మారుతి దీనిపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

the rajasaab
the rajasaab

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×