E-Paper
Advertisement

ఐదేళ్ల కిందటే మానశ శర్మకు నిహారిక హామీ.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మెగా డాటర్

ఐదేళ్ల కిందటే మానశ శర్మకు నిహారిక హామీ.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మెగా డాటర్
Advertisement

Niharika Konidela: నిహారిక కొణిదెల (Niharika Konidela) .. మెగా డాటర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా ప్రయత్నం చేసింది. కానీ సక్సెస్ కాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో సరిపెట్టుకుంది. కనీసం తాను తన సోదరి సుస్మితా కొణిదెల లాగా అయిన నిర్మాతగా మారాలని నిర్ణయించుకుంది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే ‘కమిటీ కుర్రోళ్ళు’ అనే చిత్రాన్ని నిర్మించి మొదటి చిత్రంతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమయ్యింది. అందులో భాగంగానే నిహారిక కొణిదెల, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన తెలుగు ఫాంటసీ కామెడీ థ్రిల్లర్ రాకాస. ఏప్రిల్ 3 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది.

2021 లోనే నిహారిక లెటర్ లో మానస శర్మ..

ప్రముఖ లేడీ డైరెక్టర్ మానస శర్మ (Manasa Sharma) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంగీత్ శోభన్ , నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి అఫీషియల్ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇకపోతే ఏప్రిల్ 3వ తేదీన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మరొకవైపు ఈ సినిమాకు సంబంధించిన పలు ఊహించని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే ..2021లో లేడీ డైరెక్టర్ మానస శర్మ నిహారిక తనకు పంపిన లెటర్ ను ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది.” ఈ చేతిరాత ఉన్న లెటర్ నాకు నిహారిక నుంచి వచ్చింది” అంటూ ఆమె ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది.

ఐదేళ్ల క్రితమే రాకాస కాంబో ఫిక్స్..

Advertisement

అందులో నిహారిక..” డియర్ మానస శర్మ.. నీపై ఉన్న ప్రేమ, అభిమానంతో చెబుతున్నాను .. త్వరలో మళ్లీ మనం జంటగా కలిసి సినిమా చేద్దాం” అంటూ ఆ లెటర్లో నిహారిక రాసుకొచ్చింది. దానిని మానస శర్మ షేర్ చేసింది . అయితే ఆ లెటర్ ఇప్పుడు వైరల్ అవ్వడంతో అది చూసిన అభిమానులు ఏంటి రాకాస కాంబో ఐదేళ్ల క్రితమే ఫిక్స్ అయ్యిందా ? తెరపైకి రావడానికి ఇన్నేళ్లు పట్టిందా? అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

మాట నిలబెట్టుకున్న నిహారిక..

ఏది ఏమైనా తన లెటర్ ద్వారా ఐదు సంవత్సరాల క్రితమే మానసా శర్మతో సినిమా చేస్తానని హామీ ఇచ్చిన నిహారిక.. అన్నట్టుగానే తన మాటను నిలబెట్టుకుంది. ఇక ప్రస్తుతం మానస శర్మ నిహారిక కాంబినేషన్లో వస్తున్న ఈ రాకాస ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

బెంచ్ లైఫ్ తో తొలి ప్రయత్నం..

Advertisement

ఇకపోతే మానసా శర్మ దర్శకత్వంలో నిహారిక కొణిదెల నిర్మాణంలో వస్తున్న రాకాస ఫిలిం మొదటి చిత్రమేం కాదు. వీరిద్దరి కాంబినేషన్లో గతంలోనే ‘బెంచ్ లైఫ్’ అనే సిరీస్ వచ్చింది. మానస శర్మ కథను అందిస్తూ దర్శకత్వం వహించిన టెలివిజన్ సిరీస్ ఇది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై నిహారిక కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో వైభవ్, రితికా సింగ్ , ఆకాంక్ష సింగ్ , చరణ్ పేరి, రాజేంద్రప్రసాద్, తనికెళ్ల భరణి, నయన్ సారిక, వెంకటేష్ కాకుమాను తదితరులు కీలకపాత్రలు పోషించారు. 2024 సెప్టెంబర్ 12 నుండి ఈ వెబ్ సిరీస్ సోనీ లైవ్లో ప్రీమియర్ గా అందుబాటులోకి వచ్చేసింది. ఏది ఏమైనా బెంచ్ లైఫ్ వెబ్ సిరీస్ తర్వాత మళ్లీ ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా రాకాస. గత ఐదు సంవత్సరాలుగా తమ కాంబో కోసం ఎదురుచూసిన ఈ జంట ఇప్పుడు తెరపైకి వచ్చేసింది. మరి రాకాస ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి .

 

also read: పెళ్లిపీటలెక్కిన బిగ్ బాస్ ప్రియాంక..ఇలా షాక్ ఇచ్చేందేంటి భయ్యా!

 

Related News

శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. ఆకట్టుకుంటున్న ‘దేవరాయ’ టైటిల్ గ్లింప్స్ అండ్ ఫస్ట్ లుక్!

78వ ఎమ్మీ అవార్డ్స్ తుది జాబితా.. అత్యధిక నామినేషన్స్ అందుకున్న షోలు!

హాస్పిటల్ పాలైన మమితా బైజు.. వీడియో వైరల్!

హరికృష్ణ 70వ జయంతి..ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్!

ఐదుసార్లు చావును దగ్గరగా చూశాను.. అదే నాకు ఇంపార్టెంట్.. హీరో కామెంట్స్..

“ప్రజలు మెచ్చిన నాయకుడు”.. పవన్ కళ్యాణ్ కు చిరంజీవి స్పెషల్ బర్త్‌డే విషెస్!

Poojitha Ponnada : గార్జీయస్ లుక్ లో మెరిసిపోతున్న పూజిత.. కుర్రాళ్ళు ఏమైపోతారమ్మా..!

HBD Pawan Kalyan : బర్త్ డే స్పెషల్.. ఆ ఒక్కటే పవర్ స్టార్ ను చేసిందా..?

Big Stories

Advertisement
×