E-Paper
Advertisement

AOR Day 1 Collections: డబుల్ డిజిట్ టచ్ చేసిన రాజుగారు.. ఎన్ని కోట్లంటే?

AOR Day 1 Collections: డబుల్ డిజిట్ టచ్ చేసిన రాజుగారు.. ఎన్ని కోట్లంటే?
Advertisement

AOR Day 1 Collections: ఈ ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. అలా ప్రభాస్ (Prabhas) ది రాజాసాబ్ (The RajaSaab) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కథ పరంగా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నా.. కలెక్షన్ల పరంగా నాలుగు రోజుల్లోనే 200 కోట్లు కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక ఈ సినిమా తర్వాత వచ్చిన మరో చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. అనిల్ రావిపూడి(Anil Ravipudi), చిరంజీవి(Chiranjeevi ) కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఇది. ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా రెండు రోజుల్లోనే 120 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది.

మొదటిరోజు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?

ఇక ఇప్పుడు సంక్రాంతి బరిలో నిలిచిన మూడవ చిత్రం ‘అనగనగా ఒక రాజు’. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి (Naveen Polisetty) హీరోగా, మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) హీరోయిన్గా వచ్చిన చిత్రం ఇది. మొదటి షో తోనే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. ఇప్పుడు డబుల్ డిజిట్ టచ్ చేసినట్లు మేకర్స్ అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. అనగనగా ఒక రాజు సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఏ మేరా రాబట్టింది అనే విషయం ఇప్పుడు చూద్దాం.. జనవరి 14వ తేదీన భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొత్తంగా మొదటి రోజు 22 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది.నవీన్ పోలిశెట్టి కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇది అని చెప్పవచ్చు.

రాజుగారి సంక్రాంతి బ్లాక్ పాస్టర్..

Advertisement

ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా పోస్టర్తో సహా ప్రకటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇకపోతే సితార ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా డే వన్ కలెక్షన్లకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేస్తూ..” రాజుగారి సంక్రాంతి బ్లాక్ బాస్టర్.. మొదటి రోజే 22 కోట్ల గ్రాస్ కలెక్షన్ వసూలు చేసింది” అని ఒక పోస్టర్ పంచుకున్నారు. ఇక అంతేకాదు “రాజుగారు అసలైన సంక్రాంతి సంబరాలు తెచ్చేసారు. ఇంటిల్లిపాది నవ్వుల సునామి సృష్టిస్తోంది “అంటూ క్యాప్షన్ జోడించారు. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

సంక్రాంతికి హ్యాట్రిక్ కొట్టిన హీరోయిన్గా మీనాక్షి..

ఇకపోతే అనగనగా ఒక రాజు సినిమాలో నవీన్ పోలిశెట్టి సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. ముఖ్యంగా మీనాక్షి చౌదరి ఈ సినిమాతో సక్సెస్ అందుకోవడంతో సంక్రాంతి హీరోయిన్గా పేరు దక్కించుకుంది. 2024లో గుంటూరు కారం , 2025లో సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో మంచి విజయాలను అందుకున్న ఈమె.. ఈ ఏడాది సంక్రాంతికి కూడా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకొని.. సంక్రాంతికి హ్యాట్రిక్ కొట్టిన హీరోయిన్గా రికార్డు సృష్టించింది. ఇక ఈ సినిమాకి మారి దర్శకుడిగా పనిచేశారు. ఇందులో చమ్మక్ చంద్ర, రావు రమేష్, రంగస్థలం మహేష్, తారక్ పొన్నప్ప తదితరులు కీలకపాత్రలు పోషించారు.

Advertisement

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×