Tollywood:సాధారణంగా ప్రతి ఏడాది సినీ ఇండస్ట్రీలో ఏదో ఒక ట్రెండ్ పుట్టుకొస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి ఏకంగా ఒకప్పుడు తమ అద్భుతమైన మ్యూజిక్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని.. శ్రోతలను మైమరపింపజేసిన ఎంతోమంది సంగీత దర్శకులు ఇప్పుడు రూట్ మార్చుకుంటున్నారు. ముఖ్యంగా రికార్డింగ్ రూమ్ కే పరిమితం కాకుండా వెండితెరపై హీరోలుగా కూడా మెప్పించగలమని నిరూపించుకుంటున్నారు. ఇప్పటికే జీవి ప్రకాష్, విజయ్ ఆంటోని వంటి కోలీవుడ్ సంగీత దర్శకులు హీరోగా మారి సత్తా చాటుతుంటే.. ఇప్పుడు టాలీవుడ్ లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నారు సంగీత దర్శకులు.
విషయంలోకి వెళ్తే.. చాలా కాలంగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా మారబోతున్నారు అంటూ వార్తలు రాగా.. ఎట్టకేలకు ఆ వార్త నిజమయింది. బలగం సినిమాతో దర్శకుడిగా మారి తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకున్న జబర్దస్త్ కమెడియన్ వేణు ఎల్దండి.. ఇప్పుడు ‘ఎల్లమ్మ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఇప్పటికే కొంతమంది హీరోలు ఈ కథను రిజెక్ట్ చేయగా.. ఇప్పుడు ఇదే కథతో హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్నారు దేవిశ్రీప్రసాద్. ఇకపోతే ఈ జాబితాలోకి మరో మ్యూజిక్ డైరెక్టర్ కూడా చేరబోతున్నారు.ఇప్పటికే బాయ్స్ చిత్రంతో నటుడిగా ముఖానికి మేకప్ వేసుకొని మెరిసిన సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చాలా కాలం తర్వాత మళ్లీ కెమెరా ముందుకు రానున్నారు.
మరోవైపు ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ కూడా ‘మూన్ వాక్’ అనే చిత్రంతో నటుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఇందులో ఆయన దర్శకుడిగా ఇండస్ట్రీకి అరంగేట్రం చేయబోతున్నారు. మొత్తానికైతే ఇలా సంగీత దర్శకులు హీరోలుగా మారి సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ఇప్పటికే తమిళ చిత్ర పరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్లు హీరోలుగా మారి బ్లాక్ బాస్టర్ హిట్ లు కొట్టడం మనం చూస్తూనే ఉన్నాం. అలాంటివారిలో విజయ్ ఆంటోని బిచ్చగాడు సినిమాతో నటుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ మేనల్లుడైన జీవి ప్రకాష్ వరుస సినిమాలతో హీరోగా ఫుల్ బిజీ అయిపోయారు. ఇప్పుడు ఇదే బాటలో తెలుగు కంపోజర్స్ కూడా ప్రయాణం మొదలుపెట్టారు. ఇప్పటికే మ్యూజిక్ కంపోజర్ గానే కాకుండా డాన్సర్ గా కూడా తన పెర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకున్న దేవిశ్రీప్రసాద్ ఎల్లమ్మ చిత్రంతో ఏ స్థాయిలో తన పెర్ఫార్మన్స్ చూపిస్తారో తెలియాల్సి ఉంది.
ALSO READ:Venkatesh: భార్య గురించి తొలిసారి స్పందించిన వెంకీ.. ఆ మాట తట్టుకోలేకపోయిందంటూ!
ఇదిలా ఉండగా ఈ సరికొత్త ట్రెండ్ ఇండస్ట్రీకి కలిసి వస్తుందా అనే కోణంలో అభిమానులు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే ఇండస్ట్రీకి ఎప్పటికప్పుడు కొత్త హీరోలు పుట్టుకొస్తూనే ఉన్నారు. అలాగే కొత్త దర్శకులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరి మ్యూజిక్ కంపోజర్స్ సంగతేంటి ? ఎక్కడో నోటికో కోటికో ఒక్కరు ఉన్నట్లు.. చాలా తక్కువ మంది మాత్రమే ఇండస్ట్రీలో తమ టాలెంట్ ను నిరూపించుకుంటున్నారు. మరి వీరు కూడా హీరోలుగా మారితే ఇక మ్యూజిక్ కంపోజర్స్ కొరత ఏర్పడుతుందనే వాదనలు కూడా తెరపైకి వచ్చాయి. మరి ఈ ట్రెండు ఇండస్ట్రీకి ఏ విధంగా కలిసొస్తుందో చూడాలి.