OG Film Talk : ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే విపరీతమైన క్రేజ్ ఉండేది. అప్పట్లో పవన్ కళ్యాణ్ వరుసగా బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు కొట్టారు. అయితే ప్రస్తుతం కేవలం సినిమాలోనే కాకుండా రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఎక్కువగా సినిమాల కంటే కూడా రాజకీయాల వైపే తన దృష్టిని పెట్టారు.
అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు చేయను అని అప్పట్లో చెప్పారు. కానీ తనకి ఇన్కమ్ సోర్స్ లేకపోవడం వలన మళ్లీ సినిమాలు చేయాల్సి వచ్చింది. వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు సైన్ చేశాడు. ఎన్నో సినిమాలు సైన్స్ చేశాడు కానీ ఇప్పటికి మాత్రం నాలుగు సినిమాలు మాత్రమే రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాలేవి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేదు. పూర్తిస్థాయిలో ఆకట్టుకునే సినిమా ఓజీ అని బలంగా నమ్ముతున్నారు పవన్ అభిమానులు.
ఓజీ కథనంపై అనుమానాలు
ఓజి సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు కూడా ఉన్నాయి. కానీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక టాక్ నడుస్తుంది.ఓజీ బాలేదు అనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది.
మిక్సిడ్ టాక్ వచ్చేలా ఉందని, హరి హర వీరమల్లు లాంటి ఫలితం పవన్ కళ్యాణ్‌ను రాబోతుందని అంటున్నారు. ప్రిడెక్టబుల్ స్టోరీ, స్లో కథనం. కొన్ని చొట్ల పవన్ కళ్యాణ్ వల్ల, ఆయనకు పడే ఎలివేషన్స్ వల్ల బానే ఉన్నా.. తర్వాత కథనం నీరుగారిపోతుందట. ఇది ఇండస్ట్రీ వర్గాల్లో మాట్లాడుకుంటున్న టాక్. అయితే విపరీతమైన అంచనాలతో థియేటర్ కు వెళితే డిసప్పాయింట్ అవుతారు కాబట్టి ఈ రకంగా ముందు నుంచే ప్రిపేర్ చేస్తే సినిమాను ఎంజాయ్ చేస్తారు అని ఒక ఆలోచన కూడా ఉంది.
డిజాస్టర్ వీరమల్లు
హరిహర వీరమల్లు సినిమా ఎన్నో అంచనాల మధ్య విడుదలైంది. అన్నిటిని మించి పవన్ కళ్యాణ్ ఫస్ట్ పాన్ ఇండియా సినిమా. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా మంచి సక్సెస్ సాధిస్తుంది అని నిర్మాత బలంగా నమ్మారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఎప్పుడూ లేనివిధంగా ఈ సినిమాను ప్రమోట్ చేశారు. గతంలో ఎప్పుడూ పవన్ కళ్యాణ్ తన సినిమాని చూడండి అని బలంగా చెప్పలేదు. కానీ ఈ సినిమాకు మాత్రం విపరీతమైన ప్రెస్ మీట్స్ పెట్టారు. సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న టైంలో పవన్ కళ్యాణ్ ఈ సినిమాని ప్రమోట్ చేసిన విధానం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ఆ ప్రయత్నాలు అన్నీ కూడా కేవలం ఓపెనింగ్స్ వరకు మాత్రమే పనికొచ్చాయి. సినిమా పూర్తిస్థాయిలో పవన్ కళ్యాణ్ అభిమానులను నిరాశపరిచింది. ఇప్పుడు ఓ జి విషయంలో కూడా అదే జరుగుతుంది అని టాక్ వినిపిస్తుంది.
Also Read: Akhanda 2: ఇట్స్ అఫీసియల్… పోటీ నుంచి తప్పుకున్న బాలయ్య… ఇక ఓజీ ఒంటరిగానే