Singapore Viral News: సింగపూర్ లో చట్టాలు సిక్ట్ గా అమలు అవుతాయి. ఏమాత్రం రూల్స్ అతిక్రమించినా కఠిన చర్యలు తప్పవు. అందుకు ప్రత్యక్ష ఉదాహారణ తాజాగా పని మనిషి విషయంలో సింగపూర్ కోర్టు ఇచ్చిన తీర్పు. నిబంధనలను కాదని పని చేసినందుకు గాను ఏకంగా పెద్ద మొత్తంలో జరిమానా విధించింది. ఈ తీర్పు ప్రస్తుతం సింగపూర్ లో సంచలనంగా మారింది.
ఇంతకీ ఆ పని మనిషి చేసిన నేరం ఏంటంటే?
అదనపు జీతం కోసం ఫిలిప్పీన్స్ కు చెందిన ఓ పని మనిషి నిబంధనలు విరుద్ధంగా పలు చోట్ల పని చేయడాన్ని సింగపూర్ న్యాయస్థానం తప్పుబట్టింది. సెలవు రోజులలో పని చేయడాన్ని కూడా నేరంగా పరిగణించింది. తాజాగా కోర్టు S$13,000 (రూ.8.8 లక్షలు) భారీ జరిమానా విధించింది. 53 ఏళ్ల పిడో ఎర్లిండా ఒకాంపో 1994 నుంచి సింగపూర్ లో చట్టబద్ధంగా ఉద్యోగం చేస్తోంది. ఆమె కెరీర్‌లో నలుగురు యజమానుల దగ్గర పని చేసింది. అయితే, ఆమె ఏప్రిల్ 2018, ఫిబ్రవరి 2020 మధ్య 64 ఏళ్ల సోహ్ ఓయ్ బెక్ కోసం పార్ట్ టైమ్ హౌస్ క్లీనింగ్ పని కూడా చేయడం మొదలు పెట్టింది. COVID-19 ఆంక్షలు సడలించిన తర్వాత మార్చి 2022 నుండి సెప్టెంబర్ 2024 వరకు తిరిగి పని చేసింది. అంతేకాదు, సెలవు రోజులలో 2 నుంచి 4 గంటల షిఫ్టులలో సోహ్ ఇంటిని శుభ్రం చేసింది. నెలకు రెండు నుండి మూడు సార్లు S$375(రూ.25 వేలు) నగదు సంపాదించింది. అదే సమయంలో సోహ్.. ఎర్లిండా పేరును తన సొంత యజమాని పులక్ ప్రసాద్‌కు కూడా సూచించాడు. అతడి ఇంటిలోనూ ఆమె సెప్టెంబర్ 2019 నుండి ఫిబ్రవరి 2020 వరకు పని చేసింది. మార్చి 2022- సెప్టెంబర్ 2024 మధ్య కరోనా తర్వాత కూడా ఆమె పని చేసింది. నెలకు S$450(రూ.30 వేలు) చొప్పున డబ్బులు సంపాదించింది.
సింగపూర్ నిబంధనలకు విరుద్ధంగా పని చేసిన ఎర్లిండా
సింగపూర్ పని మనుషులు కేవలం అధికారిక యజమానుల దగ్గరే పని చేయాలి. ఇతరుల దగ్గర పని చేయడం నిబంధనలకు విరుద్ధం. చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తులకు S$20,000(రూ.13.6 లక్షలు) వరకు జరిమానా విధించవచ్చు. రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా రెండూ విధించవచ్చు. సింగపూర్ చట్టం అక్రమ నియామకం కేసులలో యజమానులకు కూడా శిక్ష విధిస్తుంది. యజమానికి S$5,000(రూ. 3.4 లక్షలు) నుంచి S$30,000(రూ. 20.4 లక్షలు) వరకు జరిమానా విధిస్తుంది. ఒక సంవత్సరం జైలు శిక్ష లేదా రెండూ విధించవచ్చు.
కనీస జరిమానా రూ. 3.4 లక్షలు అయినప్పటికీ..
సోహ్ చేసిన నేరానికి కనీస జరిమానా S$5,000(రూ. 3.4 లక్షలు) ఉండేదని, కానీ, అక్రమ సంపాదన కోసం పాల్పడినందుకు ఎక్కువ మొత్తాన్ని చెల్లించాలని ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలిపింది. న్యాయమూర్తి అంగీకరించి జరిమానాను పెంచారు. ఎర్లిండా, సోహ్ ఇద్దరూ తమ జరిమానాలను పూర్తిగా చెల్లించారు. ప్రసాద్‌పై చర్య తీసుకునేందుకు కోర్టు త్వరలో నిర్ణయం తీసుకోనుంది.
Read Also: డేటింగ్ యాప్స్ లో అమ్మాయిలే ఎక్కువట.. ఏకంగా రూ.57 వేలు చెల్లించి మరి..