JNTU Hyderabad: జేఎన్టీయూ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. రేపు, ఎల్లుండి (ఆగస్టు 29, 30 తేదీల్లో) జరగబోయే అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ పరీక్షలకు కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని అధికారులు పేర్కొన్నారు.
భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జేఎన్టీయూహెచ్) పరిధిలోని అన్ని కాలేజీల్లో పరీక్షలు వాయిదా వేశారు. భారీ వర్షాలతో కాలువలు పొంగి పొర్లడం వల్ల విద్యార్థుల భద్రత కోసం ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించాల్సిన అన్ని యూజీ, పీజీ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలను వాయిదా వేశారు. కొత్త తేదీలను తర్వాత ప్రకటిస్తామని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.
ALSO READ: PGCIL Notification: పీజీసీఐఎల్‌లో 1543 ఉద్యోగాలు.. లక్షకు పైగా జీతం, ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు..!
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. రోడ్లు, వంతెనలు ముంచెత్తడం, ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడటం వల్ల విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం కష్టమవుతోంది. భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇంతకుముందు కూడా ఆగస్టు 13 నుంచి 15 వరకు పరీక్షలు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ భారీ వర్షాలతో ఇదే పరిస్థితి ఏర్పడింది.
ALSO READ: BOM Jobs: ఇది అద్భుతమైన అవకాశం.. డిగ్రీతో భారీగా ఉద్యోగాలు.. డోంట్ మిస్
జేఎన్టీయూహెచ్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ సమాచారం అందుబాటులో ఉంటుంందని అధికారులు తెలిపారు. ప్రిన్సిపాళ్లు, కాలేజీలు విద్యార్థులకు సమాచారం అందజేయాలని సూచించారు. ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో విద్యా సంస్థలు తీసుకునే ఇటువంటి చర్యలు విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నాయి.. కొత్త షెడ్యూల్ కోసం విద్యార్థులు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను గమనించాల్సి ఉంటుందని చెప్పారు. ఈ వాయిదా వల్ల విద్యార్థులు మరింత సిద్ధంగా పరీక్షలు రాయడానికి అవకాశం లభిస్తుంది.