OTT Movie : హాలీవుడ్ హారర్ సినిమాలపై ప్రభావం చూపిన ఒక సైకో కిల్లర్ సిరీస్ ఓటీటీలో త్వరలోనే స్ట్రీమింగ్ కాబోతోంది. ఇదివరకే రెండు సీజన్లతో ప్రేక్షకులను పరుగులు పెట్టించిన ఈ సిరీస్ మూడో సారి కూడా పరుగులు పెట్టించేందుకు సిద్ధంగా ఉంది. ఒక సైకో కిల్లర్ చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది.1950 కాలంలో హత్యలు, శవాల దొంగతనం, మానవ చర్మంతో వస్తువులను తయారు చేయడంవంటి ఒళ్ళు జదరించే సీన్స్ ఇందులో చాలానే ఉన్నాయి. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
నెట్‌ఫ్లిక్స్‌లో
‘మాన్స్టర్: ది ఎడ్ గీన్ స్టోరీ’ (Monster: The Ed Gein Story) 2025లో విడుదలైన అమెరికన్ ట్రూ క్రైమ్ డ్రామా సిరీస్. దీనిని ర్యాన్ మర్ఫీ, ఇయాన్ బ్రెన్నాన్ సృష్టించగా, చార్లీ హన్నమ్, లారీ మెట్‌కాల్ఫ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 అక్టోబర్ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కు రానుంది. ఇది 8 ఎపిసోడ్స్ తో IMDbలో 7.8/10 రేటింగ్ ని పొందింది.
స్టోరీలోకి వెళ్తే
1950లలో విస్కాన్సిన్‌లోని ప్లైన్‌ఫీల్డ్ అనే చిన్న గ్రామంలో, ఎడ్ గీన్ అనే వ్యక్తి ఒంటరిగా జీవిస్తుంటాడు. తన తల్లి అగస్టా పెంపకంలో క్రూయల్ గా మారుతాడు. తల్లి పెంపకంలోని మతపరమైన ప్రభావం అతన్ని ఒక భయంకరమైన మార్గంలోకి నడిపిస్తాయి. ఇక ఫ్యామిలీలో అందరూ చనిపోవడంతో, ఇక ఇతని మానసిక స్థితి ఘోరంగా దెబ్బతింటుంది. ఈ సమయంలో ఎడ్ గీన్ ఇద్దరమ్మాయిలను చంపుతాడు. అలాగే స్మశానాల నుండి తొమ్మిది శవాలను దొంగిలిస్తాడు. వాటి చర్మంతో కుర్చీలు, పాత్రలు, నిపుల్ బెల్ట్ లాంటివి తయారు చేస్తాడు. ఇక అమ్మాయిలను భయంకరంగా టర్గెట్ చెస్తుంటాడు. అతని ఇంట్లో గుర్తించిన కొన్ని పుర్రెలు, చర్మం వస్తువులు అమెరికన్ ప్రజలను షాక్‌కు గురిచేస్తాయి.
అలాగే అతని క్రైమ్స్ హాలీవుడ్‌లో ‘సైకో’, ‘ది టెక్సాస్ చైన్‌సా మాసకర్’, ‘సైలెన్స్ ఆఫ్ ది లాంబ్స్’ లాంటి హారర్ సినిమాలకు ఎలా స్ఫూర్తినిచ్చాయో చూపిస్తుంది. ఈ సిరీస్ ఎడ్ గీన్ జీవితంతో పాటు, అతని క్రైమ్స్ ట్రూ క్రైమ్ జానర్‌ను, హారర్ సినిమాలను ఎలా ప్రభావితం చేశాయో కూడా చూపిస్తుంది. ఈ సిరీస్ డిస్టర్బింగ్ స్టైల్‌లో ఒక షాకింగ్ ఎమోషనల్ రైడ్‌ను అందిస్తుంది. ఆ సైకో ఎందుకు అమ్మాయిలను చంపుతున్నాడు ? పోలీసులకు ఎలా దొరుకుతాడు ? అతని తల్లి వల్ల ఎలా సైకోలా మారాడు ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ ఘోరమైన కంటెంట్ ఉన్న సిరీస్ ని మీరు కూడా మిస్ కాకుండా చుడండి.