CSK Vs RCB : సాధారణంగా క్రికెట్ ను రకరకాలుగా ఆడుతుంటారు. కొందరూ గల్లీలలో టెన్నీస్ బంతి, రబ్బరు, కార్క్, గ్రేస్ ఇలా రకరకాలుగా ఆడుతుంటారు. మరికొందరూ కొన్ని మాస్క్ లు, హెల్మెంట్ లు ధరిస్తుంటారు. ఇంకొందరూ రకరకాల బ్యాట్లతో ఆడుతుంటారు. ఏది ఏమైనప్పటికీ అందరూ ఆడేది క్రికెట్ ఆటనే. అయితే ఈ క్రికెట్ ఎవ్వరూ ఆడిన ఆటనే.. కానీ కొన్ని టోర్నమెంట్ లకు మాత్రమే విలువ ఉంటుంది. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, నేషనల్ స్థాయి ఆటగాళ్లకు మాత్రమే గుర్తింపు ఉంటుంది. కానీ గల్లీల్లో ఎంత టాలెంట్ ఉన్నా క్రికెట్ ఎంత మంచిగా ఆడిన టాలెంట్ లేనట్టే లెక్క. తాను ఏంటో బహిరంగంగా గుర్తింపు పొందినప్పుడే తన ఆట గురించి అందరికీ తెలుస్తుంది. అది ఏ ఆటగాడైనా సరే. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే..? తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య క్రికెట్ మ్యాచ్ కి సంబంధించినది.
Also Read : Oshane Thomas : ఒకే ఒక్క బంతికి 15 పరుగులు, మరోసారి 22 పరుగులు… ఎవడ్రా ఈ థామస్.. ఇంత చెత్త బౌలింగ్ ఏంటి
వినాయకుడి విగ్రహాలతో క్రికెట్ మ్యాచ్..
ఐపీఎల్ 2025 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ట్రోఫీ గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి ఆ జట్టును సోషల్ మీడియాలో రకరకాలుగా ఏదో ఒక విధంగా ట్రోలింగ్స్ చేస్తూనే ఉన్నారు. తాజాగా సోషల్ మీడియాలో చెన్నై వర్సెస్ బెంగళూరు జెర్సీలు ధరించడంతో పాటు వినాయకుడి విగ్రహాలు తలకు పెట్టుకొని క్రికెట్ ఆడుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఫీల్డింగ్ చేస్తే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బ్యాటింగ్ చేస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారు క్రికెట్ ని ఇలా కూడా ఆడుతారా..? అంటూ కామెంట్స్ చేయడం విశేషం.
ఆర్సీబీ పై నిత్యం ట్రోలింగ్స్..
మరోవైపు ఇటీవలే ఆర్సీబీ జట్టు ట్రోఫీతో వినాయకుడిని చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఆర్సీబీ జట్టు లోగో చీరలపై కూడా ముద్రించి ట్రోలింగ్స్ చేశారు. 2025 లో రాయల్ ఛాలెంజర్స్ జట్టు ట్రోఫీ విజయం సాధించినప్పటి నుంచి ఏదో ఒక రకంగా ట్రోలింగ్స్ చేస్తూనే ఉన్నారు. ఇక ఆ తరువాత ఓ కుక్కకు కూడా ఆర్సీబీ జెర్సీ ధరించి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసి ట్రోలింగ్స్ చేసారు. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు కేవలం 2025లో ఒకే ఒక్క ట్రోఫీ గెలిస్తే.. ఆ జట్టును ఆ ట్రోఫీ గెలిచిన సంతోషం కూడా లేకుండా చేస్తున్నారని ఆర్సీబీ అభిమానులు పేర్కొనడం గమనార్హం. 2025 ఐపీఎల్ ట్రోఫీ సాధించగానే ఆర్సీబీ జట్టు చిన్న స్వామి స్టేడియం వద్ద విజయోత్సవ సంబురాలు నిర్వహించారు. ఈ వేడుకల కోసం అభిమానులు లక్షలాది మంది తరలిరావడంతో.. దాదాపు 11 మంది ప్రాణాలను కోల్పోయారు. ఆ ఘటన పై తాజాగా ఆర్సీబీ స్పందించింది.
?igsh=MW83NW5jaGV3MDlpZw==