Actor Sonu Sood: సోనూసూద్(Sonu Sood) రీల్ హీరో మాత్రమే కాదు రియల్ హీరో అనే పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతున్న ఈయన అరుంధతి సినిమా ద్వారా తెలుగు సినీ ప్రేక్షకులకు బాగా సుపరిచితమయ్యారు. ఈ సినిమాలో పశుపతి పాత్రలో తన నటనతో ప్రేక్షకులను భయపెట్టిన సంగతి తెలిసిందే. అరుంధతి సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్న సోను సూద్ తదుపరి వరుస సినిమాలలో నటిస్తూ విలన్ గా ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఇలా సినిమాలలో విలన్ పాత్రలలో నటించినప్పటికీ నిజ జీవితంలో మాత్రం మంచి మనసున్న హీరోగా పేరు ప్రఖ్యాతలు పొందారు.
మహాలక్ష్మి అపార్ట్మెంట్…
ముఖ్యంగా కరోనా సమయంలో ఆపదలో ఉన్న ఎంతోమందికి తానున్నానని భరోసా ఇస్తూ ఎంతోమంది ప్రాణాలను కాపాడిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ కూడా ఎవరికైనా కష్టం వచ్చిందనే విషయం సోను సూద్ వరకు వెళ్తే ఆయన తప్పకుండా సహాయం చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇకపోతే తాజాగా సోను సూద్ కి సంబంధించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈయన ముంబైలో ఉన్నటువంటి తన విలువైన ఇంటిని అమ్మేశారని సమాచారం. ముంబైలోని లోఖండ్ వాలా మినర్వా ప్రాంతంలో ఉన్నటువంటి మహాలక్ష్మి అపార్ట్మెంట్ ను దాదాపు రూ.8.10 కోట్లకు అమ్మేసినట్టు తెలుస్తుంది. అయితే సోను సూద్ ఈ అపార్ట్మెంట్ ను 2012 వ సంవత్సరంలో కొనుగోలు చేశారు.
లాభానికి అపార్ట్మెంట్ అమ్మిన నటుడు..
ఇలా 13 సంవత్సరాల క్రితం సోనూసూద్ ఈ అపార్ట్మెంట్ ను రూ.5 16 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. 13 సంవత్సరాల క్రితం ఐదు కోట్లకు కొనుగోలు చేసిన సోనూ సూద్ ఇప్పుడు 8 కోట్ల రూపాయలకు అమ్మేశారు అయితే ఈ 13 సంవత్సరాల కాలంలో ఈయన ఈ అపార్ట్మెంట్ ను సుమారు రూ.2.94 రూపాయల లాభానికి అమ్మినట్టు తెలుస్తోంది. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలు సినిమాలలో సంపాదిస్తూ ఇలా పెద్ద ఎత్తున ఆస్తులను కొనుగోలు చేస్తుంటారు. అయితే వాటికి సరైన ధరలు వచ్చినప్పుడు లాభాలలో అమ్మడం సర్వసాధారణం.
దర్శకుడిగా మారిన సోను సూద్..
దాదాపు బాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలు అదరూ కూడా ఇదే విధానాన్ని ఫాలో అవుతూ వస్తున్నారు. ఇక సోను సూద్ సినీ కెరియర్ విషయానికి వస్తే.. ఈయన చివరిగా ఫతే అనే సినిమాలో కనిపించి సందడి చేశారు. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అనుకున్న స్థాయిలో ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయింది అయితే ఈ సినిమాకు సోను సూద్ దర్శకత్వం వహించటం గమనార్హం. ఇక ఈ సినిమా ద్వారా ఈయన దర్శకుడిగా కూడా మారిపోయారు. ఇలా కెరియర్ పరంగా ఇండస్ట్రీలో హీరోగా విలన్ గా దర్శకుడిగా కూడా తనని తాను నిరూపించుకుంటూ ఉన్నారు. ఇక ఈయన సినిమాల కంటే కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తలలో నిలుస్తున్నారు.
Also Read: Bigg Boss Telugu 9: బిగ్ బాస్ 9 రాకకు సర్వం సిద్ధం… లాంచింగ్ ఎపిసోడ్ ఆరోజే!