BigTV English

Putin Kim Jinping: ఒకే వేదికపై పుతిన్, కిమ్, జిన్ పింగ్.. చైనాలో ఈ ముగ్గురు ఏం చేయబోతున్నారంటే?

Putin Kim Jinping: ఒకే వేదికపై పుతిన్, కిమ్, జిన్ పింగ్.. చైనాలో ఈ ముగ్గురు ఏం చేయబోతున్నారంటే?

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్
వీరంతా ఒకే వేదికను పంచుకోబోతున్నారు. ఆ మాటకొస్తే ప్రపంచంలోని 26 దేశాల అధినేతలు, ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. పరిస్థితులన్నీ అనుకూలిస్తే భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆ వేదికపై కనపడతారు. ఇటీవల కాలంలో ఇంత భారీ స్థాయిలో ఎక్కడా అంతర్జాతీయ సమావేశం జరగలేదని చెప్పాలి. అలాంటి అరుదైన వేడుకకు చైనాలోని బీజింగ్ వద్ద ఉన్న టియానన్మెన్ స్క్వేర్ వేదికగా మారుతోంది.


ఎందుకీ కలయిక..?
1939 సెప్టెంబర్ 1 న మొదలైన రెండో ప్రపంచ యుద్ధం 1945 సెప్టెంబర్ 2తో ముగిసింది. రెండో ప్రపంచ యుద్ధానికి 2025తో 80ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా చైనాలో అతి పెద్ద సైనిక కవాతు నిర్వహించబోతున్నారు. ఈ కవాతుకి ప్రపంచ దేశాధినేతలు హాజరుకాబోతున్నారు.

విక్టరీ డే..
రెండో ప్రపంచ యుద్ధంలో మిత్ర రాజ్యాల విజయానికి ప్రతీకగా ఈ వేడుకను చైనాలో జరుపుకోబోతున్నారు. 80ఏళ్ల నాటి విజయోత్సవాన్ని మరోసారి ఘనంగా నిర్వహించబోతున్నారు. బీజింగ్ లో జరిగే విక్టరీ డే ప్రత్యేకతను సంతరించుకోబోతోంది. బీజింగ్‌లోని టియానన్మెన్ స్క్వేర్‌లో జరగబోతున్న ఈ కార్యక్రమంలో చైనా సైన్యం.. తాజా సైనిక సాంకేతికతతో కూడిన విన్యాసాలు ప్రదర్శించబోతోంది. ఈ విక్టరీ డే వన్యాసాలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్, బెలారసియన్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో కూడా హాజరు కాబోతున్నారు. దక్షిణ కొరియా తరపున జాతీయ అసెంబ్లీ స్పీకర్ వూ వోన్-షిక్ ప్రాతినిధ్యం వహిస్తుండగా, స్లోవేకియా తరపున ప్రధాని రాబర్ట్ ఫికో హాజరవుతారని తెలుస్తోంది. ఇక భారత్ విషయానికొస్తే ప్రధాని నరేంద్రమోదీకి ఆహ్వానం అందినట్టుగా చెబుతున్నారు. అయితే ఆయన షెడ్యూల్ మాత్రం ఖరారు కాలేదు. భారత ప్రధాని మోదీ చైనాలో జరిగే కవాతుకి హాజరవుతారా లేదా అనే విషయంపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ వస్తుంది. అయితే బీజింగ్ నేతృత్వంలోని భద్రతా కూటమి అయిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సమావేశానికి మోదీ హాజరవుతున్నారని మాత్రం అధికారిక సమాచారం ఉంది.


చైనా, రష్యా, ఉత్తర కొరియాల మధ్య సంబంధాలు దృఢంగా ఉన్నాయి. ఆర్థిక సంబంధాలతోపాటు, సైన్య సహకారం కూడా ఉంది. ఉక్రెయిన్ పై యుద్ధం కోసం ఉత్తర కొరియా తమ సైన్యాన్ని రష్యాకి సపోర్ట్ గా పంపించింది. ఇక రష్యా నుంచి చమురు దిగుమతుల్లో చైనాదే అగ్రస్థానం. ట్రంప్ పరిభాషలో చెప్పాలంటే ఉక్రెయిన్ యుద్ధానికి చైనా అత్యధిక రెవెన్యూని రష్యాకు అందిస్తుందనమాట. సో ఈ మూడు దేశాల కలయిక ఉక్రెయిన్ కి, అమెరికాకి కూడా కోపం తెప్పించే అవకాశం ఉంది. మరి ఇలాంటి కలయికకు మోదీ దూరంగా ఉంటారో లేదో చూడాలి.

చైనాతో భారత్ సంబంధాలు అంతంతమాత్రమే. 2020లో సరిహద్దు వివాదం కారణంగా భారత్, చైనా సంబంధాలు బాగా క్షీణించాయి. ఇప్పుడిప్పుడే చైనా, భారత్ దగ్గరవుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అమెరికా ప్రతీకార సుంకాల నేపథ్యంలో ప్రధాన బాధితులుగా ఉన్న చైనా, భారత్ పరస్పర సహకారం కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి సందర్భంలో చైనా సందర్శన భారత్ కు అందివచ్చిన అవకాశమేనని చెప్పాలి.

Related News

H1B New Rules: గ్రీన్ కార్డ్స్, వీసాలపై ట్రంప్ బాంబ్.. ఇండియన్స్ పై ఎలాంటి ప్రభావం పడుతుందంటే?

Nuke India: ‘ట్రంపును చంపాలి.. ఇండియాపై అణు బాంబు వెయ్యాలి.. అమెరికా షూటర్ గన్ పై సంచలన నినాదాలు

Kartarpur Corridor: పొంగిన రావి నది.. మునిగిన కర్తార్‌పూర్ కారిడార్.. నీటిలో వందలాది మంది

Minneapolis shooting: మినియాపొలిస్‌లో రక్తపాతం.. చర్చి స్కూల్‌పై రైఫిల్ దాడి.. అసలేం జరిగిందంటే?

Trump Statement: భారత్, పాక్ కి నేనే వార్నింగ్ ఇచ్చా.. మరింత గట్టిగా ట్రంప్ సెల్ఫ్ డబ్బా

Big Stories

×