Kamalinee Mukherjee : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ లో కమలని ముఖర్జీ ఒకరు. ముఖ్యంగా కమలని సినిమాల్లో అందరికీ విపరీతంగా గుర్తుండేది ఆనంద్. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. కేవలం ఈమెకు మాత్రమే కాకుండా శేఖర్ కు కూడా ఈ సినిమా మంచి పేరు తీసుకొచ్చింది.
మళ్లీ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన గోదావరి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అయింది. ఈ సినిమాలో సీత అనే పాత్రలో కనిపించింది కమలని. ఇప్పటికీ కమలని కోసమే ఆ సినిమా చూసిన వాళ్లు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు మాత్రం తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించడం మానేసింది కమలని ముఖర్జీ. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ద్వారా పలు రకాల ఆసక్తికర విషయాలను బయటపెట్టింది.
తెలుగు సినిమాలకు దూరం
హీరోయిన్ గా కమలిని ముఖర్జీకి అద్భుతమైన పేరు వచ్చింది. అయితే అలా మంచి పేరు సాధించిన తరుణంలోనే పవన్ కళ్యాణ్ జల్సా సినిమాలో కూడా ఆఫర్ వచ్చింది. ఇలియానాకు అక్క పాత్రలో జల్సా సినిమాలో కనిపించింది. అలానే హ్యాపీ డేస్ లో కూడా టీచర్ పాత్రలో కనిపించింది. అయితే హీరోయిన్ గా చేస్తూనే కొన్ని ఇంపార్టెంట్ రోల్స్ వస్తే వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కమలని ముఖర్జీ.
కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా గోవిందుడు అందరివాడేలే. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఈ సినిమాను బండ్ల గణేష్ నిర్మించాడు. ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించింది కమలని ముఖర్జీ. ఇప్పుడు మాత్రం తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు.
దూరానికి అదే కారణం
అయితే కమలని మాట్లాడుతూ గోవిందుడు అందరివాడే సినిమాతో తనకు అసంతృప్తి ఉంది అని అసలు విషయం బయటపెట్టింది. సినిమాలో తనకు ఒక పాత్ర చెప్పారు. కానీ సినిమా జరుగుతున్న తరుణంలో తన పాత్ర మారిపోవడం అనేది తనకు అయిష్టంగా అనిపించిందట.
గోవిందుడు అందరివాడే (Govindhudu andharivaade) సినిమా తరువాత తెలుగులో సినిమాలు చేయడం కంప్లీట్ గా మానేసింది. 2014లో వచ్చిన ఆ సినిమా తర్వాత ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో కమలని కనిపించలేదు. అయితే గోవిందుడు అందరివాడు సినిమా వల్లనే తెలుగు సినిమాలకు దూరమైనట్లు తెలిపింది. ఆ సినిమా తర్వాత తమిళ, మలయాళ సినిమాల్లో కొన్ని కీలక పాత్రలో కనిపించింది. 2016 తర్వాత ఇప్పటివరకు మరో సినిమా చేయలేదు కమలని ముఖర్జీ.
Also Read: OG Movie : ఓజీ కథనంపై అనుమానాలు… మళ్లీ వీరమల్లు రిజల్టేనా ?