BigTV English

S.V.Krishna Reddy: వేదవ్యాస్ గా రాబోతున్న ఎస్వీ కృష్ణారెడ్డి.. హీరోయిన్ గా కొరియన్ నటి

S.V.Krishna Reddy: వేదవ్యాస్ గా రాబోతున్న ఎస్వీ కృష్ణారెడ్డి.. హీరోయిన్ గా కొరియన్ నటి

SV Krishna Reddy: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి (S.V.Krishna Reddy) ఒకరు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేసిన ఈయన త్వరలోనే తన 43వ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకుడిగా తన 43వ సినిమాకు వేదవ్యాస్(Vedavyas) అనే టైటిల్ ప్రకటించారు. ఇక ఈ సినిమా నేడు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఎంతో ఘనంగా పూజ కార్యక్రమాలను జరుపుకున్నారు. కే అచ్చిరెడ్డి (K.Acchi Reddy)సమర్పణలో సాయి ప్రగతి ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త కాంగ్రెస్ పార్టీ నేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నిర్మిస్తున్నారు.


కొరియన్ నటికి స్వాగతం పలికిన దిల్ రాజు..

ఈ సినిమా పూజా కార్యక్రమాలలో భాగంగా తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు, వి.వి వినాయక్, అనిల్ రావిపూడి, మురళీమోహన్, ఆలీ దంపతులు వంటి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మొదటిసారి సౌత్ కొరియా నటి జున్ హ్యున్ జీ (Jun Hyun Ji) నటించబోతున్నారు. ఇక ఈమెకు నిర్మాత దిల్ రాజు బొకే అందజేస్తూ కంగ్రాట్యులేషన్స్ అండ్ వెల్కమ్ టు టాలీవుడ్ అంటూ స్వాగతం పలికారు. ఈ పూజా కార్యక్రమాలలో భాగంగా ముహూర్తపు షాట్ కు దర్శకుడు వి.వి వినాయక క్లాప్ ఇవ్వగా, అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. మరో నిర్మాత జెమినీ కిరణ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.


ముఖ్య అతిథులుగా దర్శక నిర్మాతలు..

ఈ పూజా కార్యక్రమాలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ ఎస్వీ కృష్ణారెడ్డి అచ్చిరెడ్డి గారి సినిమాలను చూస్తూ పెరిగి ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చి తమ ప్రయాణం మొదలుపెట్టామని, అలాంటిది కృష్ణారెడ్డి గారి 43వ సినిమాకు మేము గెస్ట్లుగా రావడం చాలా సంతోషంగా ఉందని, వేదవ్యాస్ సినిమా మంచి సక్సెస్ కావాలని దిల్ రాజు కోరుకున్నారు. అనిల్ రావిపూడి, వి.వి వినాయక్ కూడా అచ్చిరెడ్డి ఎస్.వి.కృష్ణారెడ్డి కాంబినేషన్ గురించి మాట్లాడుతూ ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని తెలిపారు.

తెలుగు సినిమాలో కొరియన్ నటి…

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. తాను ఎంతో అదృష్టవంతుడిని మీ అందరి ఆదరణతో తన 43వ సినిమాని చేస్తున్నానని తెలిపారు. తన సినీ ప్రయాణంలో ఎన్ని సినిమాలు చేయగలనో అన్ని సినిమాలు కూడా కొమ్మూరి ప్రతాపరెడ్డి గారితోనే చేస్తానని తెలిపారు. మొదటిసారి ఒక తెలుగు సినిమాలో కొరియర్ నటిని హీరోయిన్ గా పరిచయం చేస్తున్నామని ఈమె ఈ సినిమాలో నటించడం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి పంచిన మాకు మాత్రం ఇదొక గొప్ప అవకాశంగా భావిస్తున్నానని ఎస్వీ కృష్ణారెడ్డి తెలిపారు. మీ అందరి ఆశీస్సులతో ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండి తన 43వ సినిమా ద్వారా మీ ముందుకు రాబోతున్నానని కృష్ణారెడ్డి తెలిపారు. ఇక నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ తమ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన సినీ దర్శకులు నిర్మాతలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

Also Read: Sreemukhi: బి అంటే బిగ్ బాస్ కాదు… బాయ్ ఫ్రెండ్‌ పేరును ఇలా కూడా వాడేస్తుంది

Related News

Akhanda 2: ఇట్స్ అఫీసియల్… పోటీ నుంచి తప్పుకున్న బాలయ్య… ఇక ఓజీ ఒంటరిగానే

Dil Raju : రాజుగారిని ఆదుకోవాలంటే… ప్రతి సారి పవనేశ్వరుడే రావాలా ?

Maniratnam: అప్పుల బాధతో మణిరత్నం సోదరుడు మృతి.. 23 ఏళ్ల తర్వాత తీర్పునిచ్చిన హైకోర్టు

Om Raut: ఇదేం కర్మ రా బాబు, సినిమా వచ్చి వెళ్లిపోయిన ఈ దర్శకుడికి తిట్లు మాత్రం తప్పట్లేదు

Kingdom OTT: ఇక్కడ కూడా అభిమానులకు నిరాశే..

Big Stories

×