Allari Naresh: అల్లరి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు నరేష్. ప్రముఖ దర్శకుడు ఇవివి సత్యనారాయణ కుమారుడుగా అందరికీ పరిచయం. అయితే మొదటి సినిమా అల్లరితోనే సినిమా పేరును ఇంటిపేరుగా మార్చుకొని అల్లరి నరేష్ అయిపోయాడు. బహుశా అల్లరి నరేష్ అనే పేరు పెట్టడం వలన కావచ్చు తను చేసే సినిమాలన్నీ కూడా ఎక్కువగా కామెడీకి ప్రాధాన్యత ఉన్న సినిమాలు అప్పట్లో చేసేవాడు.
ఒకవైపు కామెడీ సినిమాలు చేస్తూనే మరోవైపు సీరియస్ రోల్స్ కూడా ఎంచుకునేవాడు. ముఖ్యంగా గమ్యం సినిమాలో గాలి శీను అనే పాత్ర అల్లరి నరేష్ కు విపరీతమైన పేరుని తీసుకొచ్చింది. ఒకవైపు కామెడీ సినిమాలు చేస్తూనే అప్పుడప్పుడు ప్రాముఖ్యత ఉన్న పాత్రలను కూడా చేశాడు. మహర్షి సినిమాలో కూడా అద్భుతమైన పాత్రలో కనిపించాడు.
రూట్ మార్చాడు
అయితే వరుసగా కామెడీ సినిమాలు మాత్రమే చేసిన నరేష్ ప్రస్తుత కాలంలో తన రూటు మార్చి కాన్సెప్ట్ బేస్ సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. హరీష్ శంకర్ శిష్యుడు విజయ్ కనకమేడల దర్శకత్వంలో వచ్చిన నాంది సినిమా మంచి సక్సెస్ అయింది. ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో ఉగ్రం సినిమా వచ్చింది కానీ ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. అయితే ప్రస్తుతం అల్లరి నరేష్ కామెడీ సినిమాలు చేయడం తగ్గించేశారు. అయితే అల్లరి నరేష్ ఇప్పుడు మరోసారి రూట్ మార్చారు.
హాస్య మూవీస్, అన్నపూర్ణ స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తున్న ఒక సినిమాలో నటించిన ఉన్నారు అల్లరి నరేష్. ఈ సినిమా చూసి ఆఫ్ ఫాంటసీ జోనర్ లో రానుంది. ఈ సినిమాకి సంబంధించిన ముహూర్తం సెప్టెంబర్ 6వ తారీఖున అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగనుంది. అల్లరి నరేష్ కెరియర్ లో ఇది ఒక రిమార్కబుల్ సినిమా అవుతుంది అని అందరూ బిలీవ్ చేస్తున్నారు. సుడిగాడు సినిమా తర్వాత ఆ స్థాయి సక్సెస్ ఈ సినిమా ఇస్తుంది అని అందరు అనుకుంటున్నారు. మరోవైపు హాస్య మూవీస్ కూడా డిఫరెంట్ స్క్రిప్ట్ తో సినిమాలు నిర్మిస్తున్నారు.
ఫామ్ లో ఉన్న హాస్య మూవీస్
ఇట్లు మారేడుమల్లి ప్రజానీకం (Itlu Maredumillu Prajanikam) , ఊరు పేరు భైరవకోన (Ooru Peru Bhairava Kona), సామజవరగమన (Samajavaragamana) సినిమాలు ఈ బ్యానర్ లో వచ్చాయి. శ్రీ విష్ణు నటించిన సామజవరగమన సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. దాదాపు 50 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇప్పుడు ఈ బ్యానర్ సోషియో ఫాంటసీ సినిమాను నిర్మిస్తూ ఉండటంతో, అల్లరి నరేష్ సినిమా మీద కూడా విపరీతమైన క్యూరియాసిటీ మొదలవుతుంది.
Also Read: Kamalinee Mukherjee : తెలుగు సినిమాలు చేయకపోవడానికి రామ్ చరణ్ సినిమానే కారణం