Bigg Boss Telugu 9: బిగ్ బాస్ అతిపెద్ద రియాలిటీ షో గా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఈ రియాలిటీ షో వివిధ భాషలలో ప్రసారం అవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. అదేవిధంగా తెలుగులో కూడా ఇప్పటికే ఎనిమిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే బిగ్ బాస్ 9 వ(Bigg Boss Telugu 9) సీజన్ కూడా ప్రారంభానికి సర్వం సిద్ధమైందని తెలుస్తోంది. ఇక తొమ్మిదవ సీజన్లో భాగంగా కేవలం సెలబ్రిటీలు మాత్రమే కాకుండా సామాన్యులు కూడా హౌస్ లోకి వెళ్లే విధంగా నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు. ఇప్పటికే కామన్ మ్యాన్ క్యాటగిరిలో ఎంపికైన వారిని బిగ్ బాస్ అగ్ని పరీక్ష(Bigg Boss Agnipariksha) ద్వారా తిరిగి హౌస్ లో కంటెస్టెంట్ గా పంపించడానికి ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
చదరంగం కాదు.. రణరంగం..
ఇలా అగ్నిపరీక్ష కార్యక్రమం ద్వారా కామన్ మ్యాన్ క్యాటగిరిలో పలువురు కంటెస్టెంట్లను ఎంపిక చేసి వారిని బిగ్ బాస్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి పంపించబోతున్నారు. ఇక ఇప్పటికే బిగ్ బాస్ కార్యక్రమానికి సంబంధించి ఎన్నో ప్రోమోలను విడుదల చేశారు. ఈ ప్రోమోలలో భాగంగా ఈసారి ఆటలో గెలవాలి అంటే యుద్ధం చేయాల్సిందేనని, చదరంగం కాదు రణరంగం అంటూ నాగార్జున చెప్పిన మాటలు బట్టి చూస్తుంటే టాస్కులు కూడా చాలా టఫ్ గా ఉండబోతున్నాయని స్పష్టమవుతుంది. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన మరొక బిగ్ అప్డేట్ విడుదల చేశారు ఈ కార్యక్రమం సెప్టెంబర్ 7వ(September 7th) తేదీ నుంచి ప్రసారం కాబోతుందని స్టార్ మా ఓ ప్రోమో ద్వారా తెలియజేశారు.
సెప్టెంబర్ 7న ప్రారంభం..
ఇలాంటి బిగ్ బాస్ ప్రసారానికి మొత్తం సిద్ధమైందని 7వ తేదీ ఎంతో ఘనంగా ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతోందని తెలియడంతో బిగ్ బాస్ అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ పలువురు పేర్లు తెరపైకి వస్తున్నాయి. మరి ఎవరు ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా సందడి చేయబోతున్నారు అనేది తెలియాలి అంటే సెప్టెంబర్ 7వ తేదీ వరకు ఎదురు చూడాల్సిందే. ఇక ఈ కార్యక్రమానికి ఎప్పటిలాగే నాగార్జున (Nagarjuna) హోస్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమం మొదటి సీజన్ కు ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా రెండవ సీజన్ కు నాని హోస్ట్ గా వ్యవహరించారు.
ఇక మూడవ సీజన్ నుంచి ఈ కార్యక్రమానికి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ తొమ్మిదవ సీజన్ కి కూడా ఈయనే వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారు. అయితే నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈయనపై ఎన్నో సందర్భాలలో విమర్శలు కూడా వచ్చాయి. షో చూడకుండానే జడ్జ్ చేస్తారని, కొంతమందికే హౌస్ లో సపోర్ట్ చేస్తారు అంటూ పలు సందర్భాలలో ఈయనపై విమర్శలు వచ్చాయి. అదేవిధంగా బిగ్ బాస్ కార్యక్రమంపై కూడా విమర్శలు రావడమే కాకుండా ఈ షోపై కేసులు వేసి కోర్టుకు వెళ్లిన సంఘటనలు కూడా ఉన్నాయి.
Also Read: S.V.Krishna Reddy: వేదవ్యాస్ గా రాబోతున్న ఎస్వీ కృష్ణారెడ్డి.. హీరోయిన్ గా కొరియన్ నటి